





Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి ఒకరోజు ముందే ఇవాళ వచ్చేసిన 250 కోట్ల రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్- 7.9 రేటింగ్- 5 భాషల్లో స్ట్రీమింగ్!
ఓటీటీలోకి ఇవాళ రూ. 250 కోట్ల సినిమా రెట్రో డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. తమిళ స్టార్ హీరో సూర్య, టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే తొలిసారి జోడీ కట్టిన ఈ సినిమాకు పాపులర్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించారు. 7.9 ఐఎమ్‌డీబీ రేటింగ్ సాధించిన రెట్రో ఓటీటీ రిలీజ్ వివరాలపై లుక్కేద్దాం.
ఓటీటీలోకి తమిళ స్టార్ హీరో సూర్య నటించిన రెట్రో మూవీ డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేసింది. కంగువా వంటి బిగ్గెస్ట్ ఫ్లాప్ తర్వాత సూర్య నటించిన సినిమా ఇది. అంతేకాకుండా ఈ సినిమాలో హీరోయిన్‌గా టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించింది. సూర్య, పూజా హెగ్డే తొలిసారిగా జోడీ కట్టిన సినిమా ఇది.
డీ గ్లామర్ లుక్‌లో పూజా హెగ్డే
అలాగే, రెట్రో మూవీలో మొదటిసారిగా పూజా హెగ్డే డీ గ్లామర్ లుక్‌లో కనిపించి అలరించింది. తమిళ పాపులర్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు రెట్రో మూవీకి దర్శకత్వం వహించారు. అటు సూర్య, ఇటు పూజా హెగ్డేకు గత కొంతకాలంగా సరైన హిట్ లేదు. దీంతో ఈ ఇద్దరు కలిసి నటించిన రెట్రో మూవీపై విడుదల సమయంలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
మే డే సందర్భంగా మే 1న రెట్రో మూవీ థియేటర్లలో విడుదలైంది. అయితే, రెట్రో మూవీకి మిశ్రమ స్పందనలు వచ్చాయి. తమిళంలో మాత్రం మంచి టాక్ తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాల్లో యావరేజ్ అనిపించుకుంది రెట్రో. కానీ, కొన్ని సీన్స్, సూర్య నటన, పూజా హెగ్డే ప్రజెన్స్ చాలా బాగున్నాయని, డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లారని ప్రశంసలు కూడా వచ్చాయి.
రెట్రో బడ్జెట్ అండ్ కలెక్షన్స్
రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్, గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రెట్రో మూవీ తెరకెక్కింది. ఈ సినిమాలో మలయాళ పాపులర్ యాక్టర్ జోజు జార్జ్, జయరాం, శ్రియా శరణ్, నాజర్, స్వాసిక, ప్రకాష్ రాజ్, కరుణాకరన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన రెట్రో మూవీకి సుమారుగా రూ. 60 నుంచి 65 కోట్ల బడ్జెట్ అయింది.
అయితే, రెట్రో మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 97 నుంచి 250 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. మిక్స్‌డ్ రెస్పాన్స్ తెచ్చుకున్నప్పటికీ రెట్రో మూవీ రూ. 250 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. దీంతో 250 కోట్ల సినిమాగా రెట్రో నిలిచింది. అలాంటి రెట్రో ఓటీటీ స్ట్రీమింగ్‌కి ఇవాళ (మే 30) వచ్చేసింది.
రెట్రో ఓటీటీ స్ట్రీమింగ్
నెట్‌ఫ్లిక్స్‌లో రెట్రో ఓటీటీ రిలీజ్ అయింది. నేటి నుంచి తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మలయాళ వంటి ఐదు భాషల్లో నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌లో రెట్రో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, ముందుగా మే 31న రెట్రోను ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. కానీ, ఒకరోజు ముందుగానే రెట్రో ఓటీటీ రిలీజ్ అయింది.
ఇదిలా ఉంటే, రెట్రో సినిమా పారి కన్నన్ (సూర్య), రుక్మిణి (పూజా హెగ్డే), గ్యాంగ్‌స్టర్ తిలక్ జోజు జార్జ్) పాత్రల చుట్టూ తిరుగుతుంది. గ్యాంగ్‌స్టర్ అయిన పెంచిన తండ్రి దగ్గర పెరిగిన పారి రౌడీగా మారుతాడు. రుక్మిణి ప్రేమ కోసం రౌడీయిజం మానేస్తానని, పెళ్లి చేసుకుంటానని మాట ఇస్తాడు. కానీ, పెళ్లి రోజే పారి కన్నన్ కత్తి పట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏమైందనేదే రెట్రో కథ.
సంబంధిత కథనం
టాపిక్