అఖిల్ అక్కినేని – జైనాబ్ పెళ్లి తేదీ…వేదిక ఇదేనా?

Best Web Hosting Provider In India 2024

అఖిల్ అక్కినేని – జైనాబ్ పెళ్లి తేదీ…వేదిక ఇదేనా?

Nelki Naresh HT Telugu

ప్రియురాలు జైనాబ్ ర‌వ్జీ మెడ‌లో త్వ‌ర‌లోనే అఖిల్ అక్కినేని మూడుముళ్లు వేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ జంట పెళ్లికి ముహూర్తం ఫిక్స‌యిన‌ట్లు తెలిసింది. జూన్ 6న అఖిల్ అక్కినేని, జైనాబ్ ర‌వ్జీ పెళ్లి హైద‌రాబాద్‌లో జ‌రుగ‌నున్న‌ట్లు తెలిసింది.

అఖిల్ అక్కినేని, జైనాబ్ ర‌వ్జీ

టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని ఇంటివాడు కాబోతున్న‌ట్లు స‌మాచారం. ప్రియురాలి మెడ‌లో త్వ‌ర‌లో మూడుముళ్లు వేయ‌బోతున్న‌ట్లు తెలిసింది. అఖిల్ అక్కినేని, జైనాబ్ ర‌వ్జీల పెళ్లికి ముహూర్తం ఫిక్స‌యిన‌ట్లు చెబుతోన్నారు. జూన్ 6న ఈ జంట పెళ్లిపీట‌లుఎక్క‌బోతున్న‌ట్లు టాలీవుడ్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే పెళ్లి డేట్‌ను మాత్రం ఇటు అక్కినేని ఫ్యామిలీతో పాటు జైనాబ్ ర‌వ్జీ కుటుంబ‌స‌భ్యులు అధికారికంగా వెల్ల‌డించ‌లేదు.

హైద‌రాబాద్‌లోనే పెళ్లి…

అఖిల్‌, జైనాబ్ లు డెస్టినేష‌న్ వెడ్డింగ్ కు ప్లాన్ చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. అందులో నిజం లేద‌ని, వీరి పెళ్లి అన్న‌పూర్ణ స్టూడియోలోనే సింపుల్‌గా జ‌ర‌గ‌బోతున్న‌ట్లు స‌మాచారం. నాగ‌చైత‌న్య‌, శోభితా ధూళిపాళ్ల పెళ్లి కూడా అన్న‌పూర్ణ స్టూడియోలోనే జ‌రిగింది.

గ‌త ఏడాది ఎంగేజ్‌మెంట్‌…

జైనాబ్ ర‌వ్జీతో చాలా కాలంగా ప్రేమ‌లో ఉన్నాడు అఖిల్ అక్కినేని. వీరి ల‌వ్‌స్టోరీ ఎంగేజ్‌మెంట్‌తోనే బ‌య‌ట‌పడింది. గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో అఖిల్‌, జైనాబ్ ఎంగేజ్‌మెంట్ జ‌రిగింది. వీరి ఎంగేజ్‌మెంట్ ఫొటోల‌ను నాగార్జున అభిమానుల‌తో పంచుకున్నాడు. జ‌నాబ్‌ను త‌మ కుటుంబంలోకి కోడ‌లిగా ఆహ్వానించ‌డం ఆనందంగా ఉందంటూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

సినిమాలో…

జైనాబ్ ర‌వ్జీ స్వ‌త‌హాగా ఓ పెయింట‌ర్‌. హైద‌రాబాద్‌లో పుట్టిన ఆమె దుబాయ్‌లో పెరిగింది. సినిమాల్లోనూ న‌టించింది. ఎంఎఫ్ హుస్సేన్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన మీనాక్షి ఏ టేల్ ఆఫ్ త్రీ సిటీస్ అనే బాలీవుడ్‌ మూవీలో ఓ కీల‌క పాత్ర‌లో జైనాబ్ క‌నిపించింది. జైనాబ్ ఫ్యామిలీతో నాగార్జున కుటుంబానికి చాలా ఏళ్లుగా ప‌రిచ‌యం ఉంది. జైనాబ్ తండ్రి జుల్ఫీ ర‌వ్జీ, నాగార్జున మంచి స్నేహితులు. ఆ అనుబంధ‌మే అఖిల్‌, జైనాబ్ మ‌ధ్య ప్రేమ‌కు దారితీసిన‌ట్లు స‌మాచారం.

లెనిన్ మూవీ…

2017లో శ్రియా భూపాల్‌తో అఖిల్ ఎంగేజ్‌మెంట్ జ‌రిగింది. పెళ్లి పీట‌లు ఎక్క‌కుండానే మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా ఈ జంట విడిపోయారు. మ‌రోవైపు కెరీర్ ప‌రంగా ఒదిదుడుకుల‌ను ఎదుర్కొంటున్నారు అఖిల్‌. ఏజెంట్ డిజాస్ట‌ర్‌గా నిల‌వ‌డంతో కెరీర్‌కు రెండేళ్ల పాటు బ్రేక్ తీసుకున్నాడు అఖిల్‌. ఇటీవ‌లే లెనిన్ మూవీకి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడు. శ్రీలీల హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీకి అన్న‌పూర్ణ స్టూడియోస్ ప‌తాకంపై నాగార్జున స్వ‌యంగా నిర్మిస్తున్నాడు.

నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024