




Best Web Hosting Provider In India 2024

ఖలేజా రీరిలీజ్.. సాంగ్, డైలాగ్స్ కట్ చేశారంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. వీడియోలు వైరల్
ఖలేజా మూవీ శుక్రవారం (మే 30) రీరిలీజైన విషయం తెలిసిందే. అయితే ఇందులో ఓ సాంగ్, కొన్ని డైలాగులు మిస్ కావడంతో ఫ్యాన్స్ రచ్చరచ్చ చేశారు. థియేటర్లో అద్దాలు ధ్వంసం చేస్తున్న వీడియో కూడా వైరల్ అవుతోంది.
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో 2010లో వచ్చిన మూవీ ఖలేజా. అప్పట్లో ఈ మూవీ ఎవరికీ పెద్దగా ఎక్కపోవడంతో బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. అయితే 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ ఈ మూవీని రీరిలీజ్ చేశారు. దీంతో శుక్రవారం (మే 30) థియేటర్లు మహేష్ అభిమానులతో నిండిపోయాయి. అయితే ఈ రీరిలీజ్ లో ఓ పాట, డైలాగ్స్ కట్ చేయడంతో కొందరు ఫ్యాన్స్ రచ్చరచ్చ చేశారు.
మహేష్ ఫ్యాన్స్ రచ్చ
ఈ రీరిలీజ్‌ల కాలంలో ఒకప్పటి బ్లాక్బస్టర్లు, సూపర్ హిట్ సినిమాలు మళ్లీ 4కే వెర్షన్ లో ప్రేక్షకులను అలరించడానికి థియేటర్లలోకి వస్తున్నాయి. అలా మహేష్ బాబు నటించిన ఖలేజా కూడా శుక్రవారం (మే 30) రీరిలీజైంది. అయితే ఈ సినిమాలోని కొన్ని కీలకమైన సీన్లు, డైలాగులు, పాట కట్ చేయడంతో మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో థియేటర్లలో రచ్చరచ్చ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఓ థియేటర్లో ప్రొజెక్షనిస్ట్ తో అభిమానులు గొడవ పడుతున్న వీడియో, అక్కడ అద్దం పగలగొట్టిన వీడియో వైరల్ అయింది. ఇలా పాట కట్ చేశారన్న విషయం ముందే చెప్పాలి కదా అంటూ ఓ అభిమాని ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మరో అభిమాని కూడా మరో వీడియోను పోస్ట్ చేశాడు. సండే మండే సాంగ్ లేదు.. నాలో నాకు దేవుడు కనిపిస్తున్నాడు డైలాగ్ లేదు.. చేస్తే కామెడీ నేనే చేయాలి అనే సీన్ లేదు అంటూ మూవీలో ఏం మిస్సయ్యాయో చెప్పారు.
ఆ సీన్స్ మళ్లీ జోడించి..
సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ చేసిన ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో ఖలేజా టీమ్ దిగి వచ్చింది. ఈ సమస్యను పరిష్కరించామని, ఆ మిస్సయిన సీన్స్ ను కూడా తిరిగి జోడించినట్లు ఖలేజా 4కే టీమ్ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. అయినా కొందరు ఫ్యాన్స్ మాత్రం ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. కొన్ని థియేటర్లలో ఇప్పటికీ ఆ సీన్స్ లేవంటూ సోషల్ మీడియా ద్వారా చెబుతున్నారు.
ఖలేజా మూవీ తొలిసారి 2010లో రిలీజైంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మహేష్ బాబుతోపాటు అనుష్క శెట్టి, ప్రకాశ్ రాజ్, రావు రమేష్, షఫి, సునీల్, అలీ, సుబ్బరాజులాంటి వాళ్లు నటించారు. అయితే ఈ మూవీకి అప్పట్లో బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూరే ఎదురైంది. కానీ ఆ తర్వాత టీవీలోకి వచ్చిన తర్వాత మాత్రం అనూహ్యంగా పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ఓ కల్ట్ క్లాసిక్ గా మిగిలిపోయింది.
సంబంధిత కథనం