అమెరికా విద్యార్థి వీసాపై కీలక అప్డేట్.. స్లాట్ల కోసం రెగ్యూలర్‌గా చెక్ చేస్తూ ఉండాలి

Best Web Hosting Provider In India 2024


అమెరికా విద్యార్థి వీసాపై కీలక అప్డేట్.. స్లాట్ల కోసం రెగ్యూలర్‌గా చెక్ చేస్తూ ఉండాలి

Anand Sai HT Telugu

విదేశీ విద్యార్థులకు సంబంధించి వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్‌ను ట్రంప్ సర్కార్ ఇటీవల తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా దీనిపై కీలక అప్డేట్ వచ్చింది.

అమెరికా విద్యార్థి వీసాపై అప్డేట్

అమెరికాలో చదువుకోవడానికి దరఖాస్తు చేసుకునే విదేశీ విద్యార్థుల వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే ఈ స్లాట్లు త్వరలోనే ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అమెరికా విదేశాంగశాఖ తెలిపింది. విద్యార్థుల సోషల్ మీడియా దర్యాప్తు ప్రణాళికలో భాగంగా తాత్కాలికంగా నిలిపివేశారు. వీసా అనేది ఒక ప్రత్యేక హక్కు అని, ప్రతి దరఖాస్తుపై భద్రతా తనిఖీలు అవసరమని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. విదేశీ విద్యార్థులు స్లాట్ బుకింగ్ అందుబాటులోకి వచ్చే విషయమై తరచూ చెక్ చేసుకోవాలని వెల్లడించింది.

ఆన్‌లైన్ పోర్టల్‌ చెక్ చేయండి

విదేశీ విద్యార్థుల సోషల్ మీడియాను పరిశీలించే ప్రణాళిక కారణంగా తాత్కాలికంగా ఈ చర్య తీసుకున్నట్టుగా అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్ చెప్పారు. ‘ప్రస్తుతానికి వీసా నియామకాల్లో ఆలస్యం జరగవచ్చు, అయితే విద్యార్థులు ఆన్‌లైన్ పోర్టల్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ ఉండాలి. ఎందుకంటే స్లాట్‌లు త్వరలో ఓపెన్ అవుతాయి.’ అని బ్రూస్ అన్నారు.

తనిఖీలు తప్పనిసరి

వీసా ప్రత్యేక హక్కు అని టామీ బ్రూస్ అన్నారు. ప్రతి వీసా దరఖాస్తుదారుడిపై తనిఖీలకు ఉంటాయని స్పష్టం చేశారు. ఇది కేవలం కొందరికి మాత్రమే కాదని అన్నారు. ప్రతి వీసా నిర్ణయం జాతీయ భద్రతాకు సంబంధించినదని బ్రూస్ అన్నారు. అమెరికా, పౌరుల భద్రతే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

స్లాట్లు ఏ రోజునైనా తెరవవచ్చు

ఈ ప్రక్రియకు ఎక్కువ సమయం పట్టదని, త్వరలో రాయబార కార్యాలయం ఈ దిశలో అవసరమైన మార్పులు చేస్తుందని అమెరికా విదేశాంగ శాఖ కూడా తెలిపింది. దీనితో పాటు విద్యార్థులు అపాయింట్‌మెంట్ పొందకపోయినా తరచుగా వెబ్‌సైట్‌ను తనిఖీ చేస్తూ ఉండాలని సూచించారు. ఎందుకంటే స్లాట్‌లు ఎప్పుడైనా తెరవవచ్చని వెల్లడించింది.

విద్యార్థుల సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలించాలని అమెరికా నిర్ణయించిన విషయం తెలిసిందే. అందుకు అవసరమైన ప్రక్రియ అయ్యేవరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది. దీంతో విదేశీ విద్యార్థుల్లో ఆందోళన మెుదలైంది. ఇక తాజాగా అమెరికా విదేశాంగ శాఖ క్లారిటీ ఇచ్చింది. విద్యార్థులు స్లాట్ల కోసం చెక్ చేస్తూ ఉండాలని స్పష్టం చేసింది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

Best Web Hosting Provider In India 2024


Source link