




Best Web Hosting Provider In India 2024

అక్కా అంటూ కారులో వరుస కలిపాడు.. న్యూడ్ ఫొటోలతో బెదిరించాడు.. సీన్ కట్ చేస్తే..
అతను పేరుకే కారు డ్రైవర్. చేసేవన్నీ కంత్రీ పనులు. ఇప్పటికే పలు కేసుల్లో జైలుకు వెళ్లొచ్చాడు. అయినా బుద్ధి మారలేదు. మహిళలను వంకర బుద్ధితో చూసే ఆ కారు డ్రైవర్.. తాజాగా ఓ కుటుంబాన్ని బెదిరించాడు. న్యూడ్ ఫొటోలను అడ్డుపెట్టుకొని డబ్బులు డిమాండ్ చేశాడు. అతని ఫోన్‌లో చాలామంది వీడియోలు ఉన్నట్టు తెలుస్తోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన ఓ కుటుంబం గతేడాది సెప్టెంబర్‌లో కారు బుక్ చేసుకుని బందరు బీచ్‌కు వెళ్లారు. ఆ కారు డ్రైవర్ రాజు.. అక్కా అంటూ కారులోని మహిళతో వరుస కలిపాడు. బీచ్‌కు వెళ్లిన తర్వాత.. మహిళ కుమార్తెతో మాటలు కలిపి ఫోన్ నంబర్ తీసుకున్నాడు. అప్పటి నుంచి బాలికకు ఫోన్ చేసి ప్రేమిస్తున్నానని వేధించేవాడు. కొంతకాలం తర్వాత మాయమాటలు చెప్పి బాలికకు వీడియో కాల్ చేశాడు. నగ్న చిత్రాలు సేకరించాడు. ఆ తర్వాత అసలు బుద్ధి ప్రదర్శించాడు.
బాలికను బెదిరించి..
ఈ ఏడాది జనవరిలో బాలిక తల్లిదండ్రులకు రాజు ఫోన్ చేశాడు. ‘మీ అమ్మాయి నాకు న్యూడ్ ఫొటోలు పంపింది. అవి బయటకు పంపకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలి’ అని డిమాండ్ చేశాడు. దీంతో భయపడి.. అతనికి రూ.20 వేలు పంపారు. ఆ తర్వాత ఫొటోలు ఎందుకు పంపావని తల్లిదండ్రులు బాలికను ప్రశ్నించారు. అయితే.. ‘న్యూడ్ ఫొటోలు పంపకపోతే.. మీ అమ్మ, నాన్నను చంపేస్తా’ అంటూ బెదిరించినట్లు బాలిక తెలిపింది.
ఇంటికి వచ్చి..
ఈ నెల 2న రాజు బాలిక ఇంటికి వచ్చి.. తల్లిదండ్రులను బెదిరించాడు. మరో రూ.50 వేలు తీసుకున్నాడు. నాలుగు రోజుల నుంచి మళ్లీ మరో రూ.50 వేలు కావాలని డిమాండ్ చేస్తున్నాడు. దీంతో చేసేది లేక బాధితులు పటమట పోలీసులను ఆశ్రయించారు. పోక్సో, ఐటీ యాక్ట్‌తో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు.
రాజు ఫోన్‌లో చాలా వీడియోలు..
కైకలూరు ప్రాంతానికి చెందిన రాజు.. అమ్మాయిలను మాయమాటలతో మభ్యపెట్టి వారి న్యూడ్ ఫొటోలు సేకరిస్తాడని తెలుస్తోంది. వాటిని అడ్డు పెట్టుకొని డబ్బులు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే చాలా మంది యువతులు పైకి చెప్పుకోలేక లక్షల రూపాయలు ఇచ్చినట్టు తెలుస్తోంది. గతంలో పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవించిన రాజు వ్యవహారాలు తెలిసి.. అతని భార్య కూడా వదిలేసినట్లు సమాచారం. అతని ఫోన్‌లో చాలామంది యువతుల న్యూడ్ వీడియోలు ఉన్నట్లు తెలుస్తోంది.
సంబంధిత కథనం
టాపిక్