ఓటీటీలోకి ఈనెల వచ్చిన 6 టాప్ మలయాళ చిత్రాలు.. డిఫరెంట్ జానర్లలో.. రెండు సూపర్ హిట్స్ తెలుగులోనూ స్ట్రీమింగ్

Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి ఈనెల వచ్చిన 6 టాప్ మలయాళ చిత్రాలు.. డిఫరెంట్ జానర్లలో.. రెండు సూపర్ హిట్స్ తెలుగులోనూ స్ట్రీమింగ్

మే నెలలో ఓటీటీల్లోకి మలయాళ చిత్రాలు బాగానే వచ్చాయి. వీటిలో ఆరు పాపులర్ సినిమాలు ఉన్నాయి. రెండు బ్లాక్‍బస్టర్స్ కూడా ఎంట్రీ ఇచ్చాయి. ఈనెలలో స్ట్రీమింగ్‍కు వచ్చిన టాప్-6 మలయాళ చిత్రాలు ఇవి..

ఓటీటీలోకి ఈనెల వచ్చిన 6 టాప్ మలయాళ చిత్రాలు.. డిఫరెంట్ జానర్లలో.. రెండు సూపర్ హిట్స్ తెలుగులోనూ స్ట్రీమింగ్

ఓటీటీల్లో లేటెస్ట్ మలయాళ చిత్రాలు చూడాలనుకునే వారికి మే నెలలో కొన్ని అదిరిపోయే సినిమాలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ఈనెలలో ఆరు చిత్రాలపై ఆసక్తి నెలకొంది. వివిధ జానర్ల చిత్రాలు అడుగుపెట్టాయి. సెన్సేషన్ క్రియేట్ చేసిన తుడరుమ్ కూడా స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. మరణమాస్‍తో పాటు మరిన్ని సినిమాలు వచ్చేశాయి. ఈనెలలో ఓటీటీల్లోకి వచ్చిన ఆరు టాప్ మలయాళ చిత్రాల గురించి ఇక్కడ చూడండి.

తుడరుమ్

మలయాళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘తుడరమ్’ మే 30న జియోహాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. సూపర్ స్టార్ మోహన్‍లాల్ హీరోగా నటించిన ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది. ఏప్రిల్ 25న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ రూ.230కోట్ల కలెక్షన్లకు పైగా సాధించి భారీ బ్లాక్‍బస్టర్ అయింది. తుడరుమ్ మూవీకి తరుణ్ మూర్తి దర్శకత్వం వహించారు. థ్రిల్లర్స్ ఇష్టపడే వారు మిస్ కాకుండా చూడాల్సిన చిత్రమిది. జియోహాట్‍స్టార్‌లో ఇప్పుడు చూసేయవచ్చు.

మరణమాస్

మలయాళ డార్క్ కామెడీ థ్రిల్లర్ మరణమాస్ మే 14వ తేదీన సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. బాసిల్ జోసెఫ్ హీరోగా నటించిన ఈ మూవీకి శివప్రసాద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సోనీ లివ్‍లో మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజైన మరణమాస్ సూపర్ హిట్ అయింది.

అభిలాషం

అభిలాషం చిత్రం మే 23వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. సైజు కురుప్, తన్వి రామ్, అర్జున్ అశోకన్ లీడ్ రోల్స్ చేసిన ఈ రొమాంటిక్ డ్రామా మూవీ మార్చి 29న థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.

హంట్

భావన, రెంజీ పనికర్ ప్రధాన పాత్రల్లో నటించిన హంట్ చిత్రం మే 23వ తేదీన మనోరమ మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది. ఈ మలయాళ హారర్ థ్రిల్లర్ చిత్రం 2024 ఆగస్టులో థియేటర్లలో రిలీజైంది. సుమారు 10నెలలకు ఓటీటీలోకి వచ్చింది. ఈ మూవీని డైరెక్టర్ షాజి కైలాస్ తెరకెక్కించారు.

అయ్యర్ ఇన్ అరేబియా

అయ్యర్ ఇన్ అరేబియా చిత్రం మే 16వ తేదీన సన్‍నెక్స్ట్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఈ కామెడీ డ్రామా మూవీలో ముకేశ్, ఊర్వశి, ధన్యశ్రీనివాసన్, షైన్ టామ్ చాకో ప్రధాన పాత్రలు పోషించగా.. ఎంఏ నిషాద్ దర్శకత్వం వహించారు. 2024 ఫిబ్రవరిలో రిలీజైన ఈ మూవీ.. 15 నెలలకు సన్‍నెక్స్ట్ ఓటీటీలోకి అడుగుపెట్టింది.

బ్రొమాన్స్

మలయాళ యాక్షన్ కామెడీ మూవీ బ్రొమాన్స్.. సోనీ లివ్ ఓటీటీలో మే 1వ తేదీన స్ట్రీమింగ్‍కు వచ్చింది. మాథ్యూ థామస్, అర్జున్ అశోకన్, మహిమా నంబియార్ లీడ్ రోల్స్ చేసిన ఈ చిత్రం ఈ ఏడాది ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీని డైరెక్టర్ అరుణ్ డీ జోస్ తెరకెక్కించారు. సోదరుడిని వెతికేందుకు ఓ యువకుడు, అతడి స్నేహితులు చేసే ప్రయత్నాల చుట్టూ ఈ చిత్రం సాగుతుంది.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024