తెలంగాణ లాసెట్ అభ్యర్థులకు అలర్ట్ – హాల్ టికెట్లు విడుదల, ఈ లింక్ తో డౌన్లోడ్ చేసుకోండి

Best Web Hosting Provider In India 2024

తెలంగాణ లాసెట్ అభ్యర్థులకు అలర్ట్ – హాల్ టికెట్లు విడుదల, ఈ లింక్ తో డౌన్లోడ్ చేసుకోండి

Maheshwaram Mahendra Chary HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu

తెలంగాణ లాసెట్ – 2025 హాల్ టికెట్లు విడుదలయ్యాయి. దరఖాస్తుదారులు lawcet.tgche.ac.in వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లాసెట్ ఎంట్రెన్స్ పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా జూన్ 6వ తేదీన జరగనుంది.

తెలంగాణ లాసెట్ హాల్ టికెట్లు 2025

తెలంగాణ లాసెట్ – 2025కు సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. తాజాగా ఎంట్రెన్స్ పరీక్ష హాల్ టికెట్లు విడుదలయ్యాయి. మే 25వ తేదీ వరకు ఆలస్య రుసుంతో దరఖాస్తులను స్వీకరించిన సంగతి తెలిసిందే. టీజీ లాసెట్ పరీక్ష జూన్ 6వ తేదీన జరగనుంది.

టీజీ లాసెట్ – 2025 హాల్ టికెట్లు… ఇలా డౌన్లోడ్ చేసుకోండి:

  1. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలో కనిపించే హాల్ టికెట్ డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ మరో పేజీ ఓపెన్ అవుతుంది.
  3. ఇక్కడ అభ్యర్థి రిజిస్ట్రేషన్ నెంబర్, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
  4. సబ్మిట్ చేస్తే మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
  5. ప్రింట్ లేదా డౌన్లోడ్ పై నొక్కి కాపీని పొందవచ్చు. పరీక్షా కేంద్రంలోకి వెళ్లాలంటే హాల్ టికెట్ తప్పనిసరి.
  6. అడ్మిషన్ ప్రక్రియలో హాల్ టికెట్ ఉపయోగపడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉంచుకోవాలి.

జూన్ 6న ఎగ్జామ్…

జూన్ 6వ తేదీన టీజీ లాసెట్ ఎగ్జామ్ ను నిర్వహించనున్నారు. ఉదయం సమయంలో మూడేళ్ల కోర్సు ప్రవేశ పరీక్ష, మద్యాహ్నం ఐదేళ్ల కోర్సు, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఎగ్జామ్ ఉటుంది. రాత పరీక్ష పూర్తి అయిన తర్వాత ప్రాథమిక కీలను ప్రకటిస్తారు. ఆ తర్వాత రిజల్ట్స్ ను వెల్లడిస్తారు.

ఫలితాల వెల్లడించిన తర్వాత కౌన్సెలింగ్ షెడ్యూల్ ను విడుదల చేస్తారు. విడతల వారీగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. అభ్యర్థి సాధించిన ర్యాంకుతో పాటు రిజర్వేషన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందే విద్యార్థులు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేసి… సీటు ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. ఆయా కాలేజీల్లో సీట్లు మిగిలితే స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేసే ఛాన్స్ ఉంటుంది.

టీజీ లాసెట్ – 2025 ఎంట్రెన్స్ పరీక్షలో అర్హత పొందిన వారికి మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సులతో పాటు పీజీ కోర్సుల్లోనూ ప్రవేశాలను కల్పిస్తారు. 2025-26 విద్యాసంవత్సరానికి ఈ అడ్మిషన్లు ఉంటాయి. ఈ ఏడాది కూడా ఉస్మానియా యూనివర్శిటీ ప్రవేశ పరీక్ష బాధ్యతలను చూస్తోంది.

ఈ లింక్ పై క్లిక్ చేసి టీజీ లాసెట్ – 2025 హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

టాపిక్

Ts LawcetTelangana NewsEducationAdmissionsEntrance Tests
Source / Credits

Best Web Hosting Provider In India 2024