వైర‌ల్ అవుతున్న గీతా మాధురి బూమ్ బూమ్ సాంగ్ – థియేట‌ర్ల‌లోకి బిగ్‌బాస్ అర్జున్ అంబ‌టి మూవీ!

Best Web Hosting Provider In India 2024

వైర‌ల్ అవుతున్న గీతా మాధురి బూమ్ బూమ్ సాంగ్ – థియేట‌ర్ల‌లోకి బిగ్‌బాస్ అర్జున్ అంబ‌టి మూవీ!

Nelki Naresh HT Telugu

బిగ్‌బాస్ ఫేమ్ అర్జున్ అంబ‌టి హీరోగా న‌టిస్తోన్న ప‌ర‌మ ప‌ద సోపానం నుంచి బూమ్ బూమ్ అనే సాంగ్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఈ మాస్ పెప్పీ సాంగ్‌ను గీతా మాధురి ఆల‌పించింది. జెన్నిఫ‌ర్ ఇమాన్యుయేల్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ మూవీ జూలై 11న రిలీజ్ కాబోతోంది.

ప‌ర‌మ ప‌ద సోపానం మూవీ

బిగ్‌బాస్ ఫేమ్ అర్జున్ అంబ‌టి హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ప‌ర‌మ‌ప‌ద‌సోపానం. డిఫ‌రెంట్ రొమాంటిక్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీతో పూరి జ‌గ‌న్నాథ్ శిష్యుడు నాగ‌శివ డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. ఈ సినిమాలో అర్జున్ అంబ‌టికి జోడీగా జెన్నిఫ‌ర్ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా క‌నిపించ‌బోతున్న‌ది. ప‌ర‌మ ప‌ద సోపానం మూవీ జూలై 11న థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతోంది.

గీతా మాధురి…

ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. బూమ్ బూమ్ అంటూ సాగిన ఈ మాస్ పెప్పీ సాంగ్‌ను గీతా మాధురి ఆల‌పించింది. రాంబాబు గోశాల ఈ పాట‌ను రాశారు. డేవ్ జాంద్ మ్యూజిక్ అందించారు. బూమ్ బూమ్ పాట హుషారైన స్టెప్పులు, లిరిక్స్‌తో మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ను ఆక‌ట్టుకుంటోంది. ప‌ర‌మ ప‌ద‌సోపానం మూవీలో స్పెష‌ల్ సాంగ్‌గా బూమ్ బూమ్ క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల రిలీజ్ చేసిన చిన్ని చిన్ని త‌ప్పులేవో పాట‌కు మంచి రెస్పాన్స్ ల‌భిస్తోంద‌ని మేక‌ర్స్ పేర్కొన్నారు.

రొమాంటిక్ థ్రిల్ల‌ర్‌…

రొమాంటిక్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో ప‌ర‌మ‌ప‌ద సోపానం మూవీ తెర‌కెక్కుతోంది. ఈ సినిమాకు డైరెక్ష‌న్‌తో పాటు క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లేను నాగ‌శివ అందిస్తోన్నారు. గ‌తంలో డేవ్ జాంద్ ర‌వితేజ ఈగ‌ల్ సినిమాకు మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాకు అత‌డు అందించిన మ్యూజిక్, ఆర్ఆర్ హైలైట్‌గా నిలుస్తాయ‌ని మేక‌ర్స్ చెబుతోన్నారు. ఈ సినిమాలో అర్జున్ అంబ‌టి గ‌త సినిమాల‌కు భిన్నంగా స‌రికొత్త పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ప‌ర‌మ‌ప‌ద‌సోపానం సినిమాను గుడిమిట్ల‌ శివ‌ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు.

ఛార్ట్‌బ‌స్ట‌ర్‌…

బూమ్ బూమ్ సాంగ్ గురించి గీతామాధురి మాట్లాడుతూ.. ఈ పాటని చాలా ఎంజాయ్ చేస్తూ పాడాను. ఇది మంచి స్వింగ్ ఉన్న పాట. కచ్చితంగా మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ను మెప్పిస్తుంది. ఛార్ట్‌బస్ట‌ర్‌గా నిలుస్తుంది” అని చెప్పింది. “బూమ్ బూమ్ పాట‌ను గీతా మాధురి చాలా ఎన‌ర్జీతో పాడారు. రాంబాబు గోశాల సాహిత్యం కూడా బాగా కుదిరింది. అన్నిటికీ మించి సంగీత దర్శకుడు డేవ్ జాండ్ కంపోజ్ చేసిన ట్యూన్ మాస్ ఆడియన్స్ కి మంచి ‘పార్టీ సాంగ్’ గా వారిని అమితంగా ఆకట్టుకునే విధంగా ఉందిష అని ద‌ర్శ‌కుడు అన్నారు.

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 7…

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 7లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న అర్జున్ అంబ‌టి ఫైన‌ల్ చేరుకున్నాడు. టాఫ్ ఫైవ్ కంటెస్టెంట్‌లో ఒక‌రిగా నిలిచాడు. తెలుగులో తెప్ప స‌ముద్రం, సుంద‌రి, వెడ్డింగ్ డైరీస్‌తో పాటు మ‌రికొన్ని సినిమాలు చేశాడు. హ‌రిక‌థ‌, అగ్నిసాక్షి వెబ్‌సిరీస్‌ల‌లో అర్జున్ అంబ‌టి డిఫ‌రెంట్ రోల్స్‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు. బిగ్‌బాస్ బ‌జ్‌తో పాటు ప‌లు టీవీ షోస్‌కు హోస్ట్‌గా ఆక‌ట్టుకున్నాడు.మ‌రోవైపు సీరియ‌ల్స్ కూడా చేస్తున్నాడు.

నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024