బ్రహ్మముడి ప్రోమో శోభనం రోజు అప్పు కల్యాణ్ గొడవ- రాజ్‌ను లొంగదీసుకున్న యామిని- రిసార్టుకు కావ్య- ప్రియురాలికి భార్య నగలు

Best Web Hosting Provider In India 2024

బ్రహ్మముడి ప్రోమో శోభనం రోజు అప్పు కల్యాణ్ గొడవ- రాజ్‌ను లొంగదీసుకున్న యామిని- రిసార్టుకు కావ్య- ప్రియురాలికి భార్య నగలు

Sanjiv Kumar HT Telugu

బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో శోభనం గదిలో అప్పు పట్టనట్లు ఉండటంతో కల్యాణ్‌కు కోపం వస్తుంది. దాంతో ఇద్దరు గొడవ పడతారు. రాజ్ చెప్పడంతో రిసార్టుకు కావ్య వస్తుంది. అక్కడ రాజ్‌ను యామిని లొంగదీసుకుంటుంది. మరోవైపు ప్రియురాలికి భార్య స్వప్న నగలను ఇస్తాడు రాహుల్. దాంతో రాహుల్ లవర్ సంతోషిస్తుంది.

బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో

బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో శోభనం గదిలోకి మళ్లీ వెళ్తారు అప్పు, కల్యాణ్. ఇద్దరు బెడ్‌పై కూర్చొంటారు. కల్యాణ్ సంతోషంగా ఉంటాడు. కానీ, అప్పుకు మెసేజ్ రావడంతో పక్కకు వెళ్లి ఫోన్ చూస్తుంటుంది. పక్కనే అప్పు స్పర్శ తగలకపోయేసరికి పక్కకు చూస్తాడు కల్యాణ్. అక్కడ అప్పు ఏం పట్టనట్లు ఉండేసరికి కల్యాణ్ షాక్ అవుతాడు.

కల్యాణ్‌కు కోపం

ఏంటీది పొట్టి అలా దూరంగా ఉండిపోయావ్. ఈ రాత్రి కోసం ఎన్నో రాత్రులు ఎదురుచూశాను తెలుసా అని కల్యాణ్ అంటాడు. కవిగారికి మంచి మూడ్ వచ్చినట్లుంది. కానీ, నాకు అంత ఓపిక లేదని అప్పు అంటుంది. ఫస్ట్ నైట్ రోజును అప్పు ఏమాత్రం పట్టించుకోకపోయేసరికి కల్యాణ్‌కు కోపం వస్తుంది. అప్పుపై సీరియస్ అవుతాడు. దాంతో అప్పు కూడా కోప్పడతుంది. ఇద్దరు వాదించుకుంటూ శోభనం రోజున గొడవ పడతారు.

రెండేళ్ల వరకు శోభనమే కాదు ముద్దు ముచ్చట కూడా లేదని అప్పు గట్టిగా చెబుతుంది. దాంతో కల్యాణ్ చాలా నిరాశపడతారు. అన్ని అవాంతరాలు దాటి శోభనానికి వచ్చిన అప్పు, కల్యాణ్ గొడవ పడటంతో ఫస్ట్ నైట్ క్యాన్సిల్ అయిపోతుంది. మరోవైపు యామినిని రాజ్ రిసార్టుకు తీసుకెళ్తుంటాడు. అయితే, యామినితో రాజ్ రిసార్ట్‌కు వెళ్లడం గురించి కావ్యకు చెబుతారు అపర్ణ, ఇందిరాదేవి.

యామిని ఏదో ప్లాన్ చేసింది

ఈ ముదనష్టపుది ఏదో ప్లానే చేసింది, అందుకే రిసార్టుకు రాజ్‌ను తీసుకెళ్తుంది అని ఇందిరాదేవి అంటుంది. అక్కడ జరగరానిది జరిగిదే రాజ్ మనకు కాకుండా పోతాడు. ఏదో ఒకటి చేయి కావ్య అని అపర్ణ అంటుంది. మీరేం కంగారుపడకండి అత్తయ్య నేను చూసుకుంటాను అని కావ్య అంటుంది. రాజ్‌కు కాల్ చేసి మాట్లాడుతుంది కావ్య. దాంతో యామినితో రిసార్టుకు వెళ్తున్న విషయం కావ్యకు చెబుతాడు రాజ్.

అంటే, కాబోయే భార్యను షికారుకు తీసుకెళ్తున్నారన్నమాట, ఇన్నాళ్లు నాతో అన్న మాటలు అన్ని అబద్ధాలేనా అని కావ్య అంటుంది. కాదు, మీతో చెప్పినవన్నీ నిజాలే. మీరు కూడా రిసార్టుకు రండి. అక్కడ నా మనసులో మాట చెబుతాను అని రాజ్ అంటాడు. దాంతో కావ్య సరే అని చెబుతుంది. తర్వాత రిసార్టుకు కారులో యామిని, రాజ్ వెళ్తారు.

పూర్తిగా నా సొంతం చేసుకుంటా

కళావతి గారు రిసార్టుకు రాగానే నా గుండెల్లో ఉన్నది నువ్వే అని చెప్పి, నా మనసులోని ప్రేమను కళావతి గారికి ఎక్స్‌ప్రెస్ చేసి తన ప్రేమను గెలుచుకుంటాను అని మనసులో అనుకుంటాడు రాజ్. లేదు బావ.. నిన్ను ఆ కావ్యకు ఎట్టి పరిస్థితుల్లో దగ్గర కానివ్వను. ఏది ఏమైనా సరే నిన్ను ఈరోజు పూర్తిగా నా సొంతం చేసుకుని ఆ కావ్యను నీ జీవితంలోనే లేకుండా, మళ్లీ నీ లైఫ్‌లోకి రాకుండా చేస్తాను అని రాజ్ మాటలు విన్నట్లుగా అనుకుంటుంది యామిని.

రాజ్, యామిని రిసార్టుకు వెళ్తారు. అంతా నేను ప్లాన్ చేసినట్లుగానే జరుగుతుందిగా అని తన మనుషులను అడుగుతుంది యామిని. వాళ్లు అంతా ఓకే అంటారు. మరోవైపు రిసార్టుకు కావ్య వస్తుంది. ఇక రాజ్, యామిని ఒక గది తీసుకుని అందులోకి వెళ్తారు. బెడ్‌పై ఇద్దరు కూర్చొంటారు. రాజ్ ఇబ్బందిగా ఫీల్ అవుతుంటాడు. మెల్లిగా రాజ్ వైపుకు యామిని వస్తుంది.

ప్రియురాలికి నగలు

రాజ్ భుజంపై చేయి వేసి రాజ్‌ను లొంగదీసుకుంటుంది. రాజ్‌కు ముద్దు పెట్టేందుకు ట్రై చేస్తుంటుంది యామిని. మరోవైపు రిసార్ట్ లోపలికి కావ్య కంగారుగా వచ్చేస్తుంది. మరోవైపు భార్య స్వప్న ఏడు వారాల నగలు కొట్టేసిన రాహుల్ వెళ్లి తన ప్రియురాలికి ఇస్తాడు. అవి చూసిన రాహుల్ గర్ల్‌ఫ్రెండ్ తెగ సంతోషిస్తుంది. అనుకున్నది సాధించావ్‌గా. ఇక నేను నీ సొంతం అని రాహుల్‌తో అంటుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ముగుస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024