తెలంగాణ టెట్ 2025 హాల్ టికెట్లు ఎప్పుడు వస్తాయి..? ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి..?

Best Web Hosting Provider In India 2024

తెలంగాణ టెట్ 2025 హాల్ టికెట్లు ఎప్పుడు వస్తాయి..? ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి..?

Maheshwaram Mahendra Chary HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu

తెలంగాణ టెట్ (జూన్ – 2025) పరీక్షలపై విద్యాశాఖ దృష్టి పెట్టింది. నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… ఈనెల 15 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. జూన్ 30వ తేదీతో ముగుస్తాయి. అయితే ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లు జూన్ 9వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి.

తెలంగాణ టెట్ హాల్ టికెట్లు 2025

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) పరీక్షల నిర్వహణకు తెలంగాణ విద్యాశాఖ సిద్ధమవుతోంది. ఇప్పటికే నోటిఫికేషన్ ఇవ్వగా… దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కూడా పూర్తి అయింది. ఈసారి మొత్తం 1,83,653 దరఖాస్తులు అందాయి. వీరిలో పేపర్‌-1కు 63,261 మంది, పేపర్‌-2కు 1,20,392 మంది అప్లయ్ చేశారు. వీరంతా కూడా టెట్ పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నారు.

ఈనెలలోనే ‘టెట్’ పరీక్షలు..

జూన్ 15 నుంచి తెలంగాణ టెట్ 2025 పరీక్షలు ప్రారంభమవుతాయి. జూన్ 30వ తేదీతో ముగుస్తాయి. ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 04.30 గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది. పరీక్షల షెడ్యూల్ వివరాలను రేపోమాపో ప్రకటిస్తారు.

హాల్ టికెట్లు ఎప్పుడంటే…?

ఇక తెలంగాణ టెట్ పరీక్షల హాల్ టికెట్లు జూన్ 9వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://tgtet.aptonline.in/tgtet/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రాసెస్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి…

  1. తెలంగాణ టెట్ అభ్యర్థులు schooledu.telangana.gov.in లేదా https://tstet2024.aptonline.in/tstet/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలో కనిపించే ‘ Hall Tickets(I) Download 2025 ఆప్షన్ పై నొక్కాలి.
  3. జర్నల్ నెంబర్ తో పాటు పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.
  4. సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
  5. డౌన్లోడ్ అనే ఆప్షన్ పై నొక్కి హాల్ టికెట్ కాపీని పొందవచ్చు.
  6. పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలంటే హాల్ టికెట్ తప్పనిసరి.

జూలైలో టెట్ ఫలితాలు…

తెలంగాణ టెట్ పరీక్షలు ఈనెల 30వ తేదీతో పూర్తవుతాయి. వీటికి సంబంధించిన ప్రాథమిక కీలను వెల్లడిస్తారు. వీటిపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. అన్ని పరిశీలించిన తర్వాత…. జూలై 22వ తేదీన టెట్‌ తుది ఫలితాలను విడుదల చేస్తారు.

టెట్ పరీక్షా విధానం…

ఇక తెలంగాణలో టెట్ లో రెండు పేపర్లు ఉంటాయి. అందులో పేపర్‌-1 సెకండరీ గ్రేడ్‌ టీచర్లుగా నియామకానికి, పేపర్‌-2 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల కోసం అర్హత సాధించేందుకు నిర్వహిస్తారు. పేపర్‌-2లో గణితం, సైన్స్‌, సాంఘికశాస్త్రం రెండు వేర్వేరు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌ 150 మార్కులకు ఉంటుంది. పేపర్‌-1కు 1-8 తరగతులు, పేపర్‌-2కు 6-10 తరగతుల ప్రామాణికంగా ప్రశ్నలు ఉంటాయి.

అన్ని పేపర్లు ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటాయి. ప్రతి పేపర్‌కు 2:30 గంటల సమయం అందుబాటులో ఉంటుంది. ఒక్కసారి అర్హత సాధిస్తే జీవిత కాలంపాటు సంబంధిత సర్టిఫికెట్ తో డీఎస్సీ రాయవచ్చు. ఇక టెట్ లో మంచి స్కోర్ సాధిస్తే.. డీఎస్సీలో మార్కులు యాడ్ అవుతాయి. రెండింట్లో వచ్చిన మార్కుల ఆధారంగా తుది జాబితాను రూపొందించి ఫలితాలను విడుదల చేస్తారు.

టెట్ పరీక్షలో జనరల్‌ కేటగిరీలో ఉన్న అభ్యర్థులు 90 మార్కులు సాధించాల్సి ఉంటుంది. అలాగైతేనే టెట్ లో అర్హత సాధించినట్లు అవుతారు. ఇక బీసీ అభ్యర్థులకు 75 మార్కులు రావాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగ అభ్యర్థులకు 60 మార్కులు సాధిస్తే టెట్ అర్హత సాధించినట్లు అవుతుంది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

టాపిక్

Ts TetTelangana NewsEducationExams
Source / Credits

Best Web Hosting Provider In India 2024