




Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి సమంత హారర్ కామెడీ మూవీ శుభం.. సీరియళ్ల పిచ్చితో దెయ్యాలయ్యే భార్యలు.. ఇవాళ అఫీషియల్ అనౌన్స్‌మెంట్!
స్టార్ హీరోయిన్ సమంత నిర్మాతగా వ్యవహరించిన తొలి సినిమా శుభం ఓటీటీలోకి రానుంది.. హారర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన శుభం సినిమాకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. సీరియళ్ల మీద పిచ్చితో దెయ్యాలయ్యే భార్యల కథాంశంగా తెరకెక్కిన శుభం ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఆ సంస్థ ఇవాళ అధికారికంగా ప్రకటించింది.
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు నిర్మాతగా మారి రూపొందించిన మొదటి సినిమా శుభం. తెలుగు హారర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన శుభం మూవీకి సినిమా బండి డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై సమంత ఈ సినిమాను నిర్మించింది.
శుభంపై మంచి అంచనాలు
శుభం సినిమాలో హర్షిత్ రెడ్డి, చరణ్, శ్రీనివాస్ గవిరెడ్డి, శ్రియా కొంతం, షాలిని కొండేపూడి, శ్రావణి లక్ష్మీ ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే, సమంత కూడా ఓ కీ రోల్‌లో ప్రేక్షకులను అలరించారు. మాతగా సమంత శుభం సినిమాలో క్యామియో రోల్ చేసింది. శుభం టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
కామెడీ హైలెట్ అంటూ
ఈ భారీ అంచనాల మధ్య మే 9న థియేటర్లలో శుభం మూవీ విడుదలైంది. అయితే, శుభం సినిమాకు మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ, సినిమాలో కామెడీ మాత్రం చాలా బాగుందని ప్రశంసలు వచ్చాయి. అలాగే, స్టోరీ పాయింట్ కూడా చాలా విభిన్నంగా ఉందని పలువురు రివ్యూవర్స్ తెలిపారు. కానీ, సెకండాఫ్‌లో సినిమా గాడి తప్పిందని, స్లోగా సాగిందని కాస్త నెగెటివిటీ వచ్చింది.
జూన్ 13 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్
ఇక శుభం సినిమాకు బాక్సాఫీస్ కలెక్షన్స్ అంతంత మాత్రంగానే వచ్చినట్లు పలు రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇదిలా ఉంటే, శుభం ఓటీటీ స్ట్రీమింగ్‌కు రానుంది. అందుకు మరికొన్ని రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. జూన్ 13న శుభం ఓటీటీ రిలీజ్ కానుంది. అంటే, మే 9న థియేటర్లలో విడుదలైన శుభం నెల రోజులు దాటిన తర్వాతే ఓటీటీలోకి వచ్చేయనుంది.
జియో హాట్‌స్టార్‌లో శుభం
జియో హాట్‌స్టార్‌లో శుభం ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని జియో హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇవాళ (జూన్ 1) అధికారికంగా ప్రకటించింది. “జియో హాట్‌స్టార్‌లో జూన్ 13న కథ ఆరంబం. చచ్చిన చూడాల్సిందే” అంటూ ట్విటర్ వేదికగా సదరు ప్లాట్‌ఫామ్ శుభం ఓటీటీ రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.
సీరియల్స్‌కు అడిక్ట్ అయి
దీంతో శుభం ఓటీటీ స్ట్రీమింగ్ కోసం తెలుగు ఆడియెన్స్ ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. థియేటర్లలో మిస్ అయినవాళ్లు శుభం సినిమాను ఓటీటీలో వీక్షించేందుకు సిద్ధమయ్యారు. ఇక శుభం కథ విషయానికొస్తే.. ఒక ఊరిలో భార్యలందరూ సీరియల్స్‌కు బాగా అడిక్ట్ అవుతారు. అన్నివేళల్లో భర్తలను దేవుళ్లుగా భావించే భార్యలు సీరియల్స్ చూసే సమయంలో మాత్రం దెయ్యాలుగా మారిపోతారు.
మాత పరిష్కారం
ఆ టైమ్‌లో భర్తలను పట్టించుకోవడమే కాకుండా దాన్ని అడ్డుకున్న వారిపై అటాక్ కూడా చేస్తారు. అలా సీరియళ్ల మీద పిచ్చితో దెయ్యాలుగా మారిపోతారు భార్యలు. దీనికి పరిష్కారం కోసం ఓ మాత దగ్గరికి భర్తలంతా వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? దీనికి పరిష్కారం ఏంటీ? అనేదే శుభం కథ.
సంబంధిత కథనం
టాపిక్