




Best Web Hosting Provider In India 2024

టీటీడీ ఎస్వీ సంగీత, నృత్య కళాశాలలో అడ్మిషన్లు – ఇవిగో వివరాలు
తిరుపతి శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాలలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు టీటీడీ ప్రకటన జారీ చేసింది.జూన్ 2వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు.
టీటీడీ అనుబంధ కాలేజీల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదలవుతున్నాయి. తాజాగా తిరుపతి శ్రీవేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాలలో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయింది. 2024-25 విద్యా సంవత్సరానికి పలు కోర్సుల్లో ప్రవేశానికి అర్హులైన విద్యార్థుల దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది.
జూన్ 2 నుంచి దరఖాస్తులు…
జూన్ 2వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ కళాశాలలో గాత్రం, వీణ, వేణువు, వయోలిన్, నాదస్వరం, డోలు, భరతనాట్యం, కూచిపూడి, నృత్యం, హరికథ, మృదంగం, ఘటం విభాగాల్లో ఫుల్‌టైమ్, విశారద(డిప్లొమా), ప్రవీణ(అడ్వాన్డ్స్ డిప్లొమా) కోర్సులు ఉన్నాయి. ఎస్వీ నాదస్వరం, డోలు పాఠశాలలో ఫుల్‌టైమ్ సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులు ఉన్నాయి.
జూన్ 27 నుంచి తరగతులు…
జూన్ 27వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. ఇతర ప్రాంతాల విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించడం జరుగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు కళాశాల కార్యాలయ పనివేళల్లో రూ.50 చెల్లించి దరఖాస్తు పొందొచ్చు. రెగ్యులర్ కోర్సులకు 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సాయంత్రం కోర్సులకు 5వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
ఇతర వివరాలకు కళాశాల కార్యాలయానికి సంబందించిన 9440793205, 9848374408 నంబర్లను సంప్రదించవచ్చు. కళాశాల కార్యాలయ పనివేళల్లో మాత్రమే సంప్రదించాలని టీటీడీ సూచించింది.
సంబంధిత కథనం
టాపిక్