




Best Web Hosting Provider In India 2024
30 కోట్లు విలువ చేసే లాటరీ కొట్టాడు- గర్ల్‌ఫ్రెండ్‌కి మొత్తం ఇచ్చేశాడు.. ఆ వెంటనే లవర్‌తో మహిళ జంప్!
ఆ వ్యక్తికి లాటరీ వచ్చింది. తన గర్ల్‌ఫ్రెండ్‌కి ఇచ్చాడు. ఆమె ఆ తర్వాత కనిపించలేదు! చివరికి, తన లవర్‌తో కలిసుండగా ఆ వ్యక్తి చూశాడు. తాను మోసపోయానని తెలుసుకున్నాడు. కెనడాలో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలు.
కెనడాలో జరిగిన ఒక ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి రూ. 30కోట్లు విలువ చేసే లాటరీని దక్కించుకున్నాడు. అది తన గర్ల్‌ఫ్రెండ్ పేరు మీద మార్చాడు. ఆ తర్వాత, ఆమె కనిపించకుండా పోయింది. చివరికి, తన గర్ల్‌ఫ్రెండ్‌ని ఆమె లవర్‌తో కలిసి బెడ్ మీద చూశాడు ఆ కెనడా వ్యక్తి.
అసలేం జరిగిందంటే..
విన్నిపెగ్కి చెందిన లారెన్స్ క్యాంప్‌బెల్ 2024లో ఒక లాటరీ టికెట్ కొన్నాడు. లాటరీ గెలిచాడు. అందులో భాగంగా అతనికి 5 మిలియన్ల కెనెడియన్ డాలర్లు (సుమారు రూ. 30కోట్లు)లభించాయి. అయితే ఆ వ్యక్తికి సరైన ఐడీ లేదు. అందుకే సొంతంగా ప్రైజ్ మనీని పొందలేకపోయాడు.
2024లో క్రిస్టల్ ఆనా మెక్కే అనే మహిళతో క్యాంప్‌బెల్ రొమాంటిక్ రిలేషన్లో ఉన్నాడు. ఆమె చాలా లాయల్ అని, నమ్మకస్తురాలని విశ్వసించాడు.
ప్రైజ్ మనీ తనకు రావడం లేదని, ఏదైనా సలహా ఇవ్వమని లాటరీ అధికారులను క్యాంప్‌బెల్ అడిగాడు. క్యాంప్‌బెల్ తరపున అతని గర్ల్‌ఫ్రెండ్ క్రిస్టల్ ప్రైజ్ మనీని తీసుకోవాలని సలహా ఇచ్చారు.
క్యాంప్బెల్కి బ్యాంక్ అకౌంట్ కూడా లేదట! ఫలితంగా ఆ రూ. 30కోట్లను క్రిస్టల్ తన బ్యాంక్ అకౌంట్లో వేసుకుంది. దీనికి క్యాంప్‌బెల్ కూడా ఒప్పుకున్నాడు.
తొలుత అంతా బాగానే ఉంది. పెద్ద సైజు చెక్‌తో ఇద్దరు కలిసి ఫొటోలు కూడా దిగారు. “క్రిస్టల్‌కి క్యాంప్‌బెల్ ఇస్తున్న బర్త్‌డే గిఫ్ట్ ” అని క్యాంప్‌బెల్ చెప్పుకొచ్చాడు.
కానీ కొంత కాలానికి క్రిస్టల్ అనుమానాస్పదంగా ప్రవర్తించడం మొదలుపెట్టిందని క్యాంప్‌బెల్ ఆరోపించాడు.
“ఇద్దరం ఒక హోటల్లో కలిసుండేవాళ్లం. కానీ డబ్బులు పడిన కొన్ని రోజుల తర్వాత క్రిస్టల్ రూమ్‌కి రాలేదు. నా ఫోన్ కాల్స్ ఎత్తలేదు. ఆమెను నేను ట్రాక్ చేసుకుంటూ వెళ్లా. చివరికి ఆమె ఒక వ్యక్తితో మంచం మీద నాకు కనిపించింది,” అని క్యాంప్‌బెల్ చెప్పుకొచ్చాడు.
క్రిస్టల్ తనని మోసం చేసిందని భావించిన క్యాంప్‌బెల్ కోర్టులో కేసు వేశాడు.
“క్యాంప్బెల్ని ఆమె ఒత్తిడికి గురుచేసింది. ఫోన్స్ ఎత్తలేదు. సోషల్ మీడియా అకౌంట్స్‌లో బ్లాక్ చేసింది, ప్రొటెక్షన్ ఆర్డర్ కూడా తీసుకుంది,” అని క్యాంప్‌బెల్ తరపు న్యాయవాది మీడియాకు వివరించారు.
అంతేకాదు సంబంధిత లాటరీ అధికారులపైనా క్యాంప్‌బెల్ కేసు వేశాడు. తన లాటరీని వేరొకరికి ఇవ్వాలన్న చెత్త ఐడియా ఇచ్చారని, అలా ఇస్తే వచ్చే నష్టం గురించి తనకు చెప్పలేదని క్యాంప్‌బెల్ తన పిటిషన్లో పేర్కొన్నాడు.
ఈ పూర్తి వ్యవహారంపై క్రిస్టల్ స్పందించింది. క్యాంప్‌బెల్ చెబుతున్నవన్నీ తప్పని పేర్కొంది.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link