రెండు నెలల తర్వాత ఓటీటీలోకి తెలుగు కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు.. ఎక్కడంటే..

Best Web Hosting Provider In India 2024

రెండు నెలల తర్వాత ఓటీటీలోకి తెలుగు కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు.. ఎక్కడంటే..

పెళ్లి కాని ప్రసాద్ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది.

రెండు నెలల తర్వాత ఓటీటీలోకి తెలుగు కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు.. ఎక్కడంటే..

కమెడియన్ సప్తగిరి హీరోగా నటించిన పెళ్లి కాని ప్రసాద్ చిత్రం థియేటర్లలో ఈ ఏడాది మార్చి 21వ తేదీన విడుదలైంది. ప్రమోషన్లను మూవీ టీమ్ బాగానే చేసింది. అయితే, మిక్స్డ్ టాక్ రావటంతో ఆశించిన స్థాయిలో కలెక్షన్లు దక్కలేదు. ఈ కామెడీ డ్రామా సినిమాకు అభిలాశ్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ పెళ్లి కాని ప్రసాద్ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది.

పెళ్లి కాని ప్రసాద్ స్ట్రీమింగ్ వివరాలివే

పెళ్లి కాని ప్రసాద్ సినిమా జూన్ 5న ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆ ప్లాట్‍ఫామ్ నేడు (జూన్ 1) అధికారికంగా వెల్లడించింది. దీంతో మరో నాలుగు రోజుల్లో ఈటీవీ విన్‍లో ఈ మూవీని చూడొచ్చు.

రెండు నెలల తర్వాత..

పెళ్లి కాని ప్రసాద్ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు ఆలస్యమైంది. ముందుగా ఓటీటీ కాకపోవడం వల్ల ఇలా జరిగింది. ఎట్టకేలకు ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులను ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఈటీవీ విన్‍లో జూన్ 5న ఈ చిత్రం ఎంట్రీ ఇవ్వనుంది.

పెళ్లి కాని ప్రసాద్ చిత్రంలో సప్తగిరికి జోడీగా ప్రియాంక శర్మ నటించారు. మురళీధర్ గౌడ్, అన్నపూర్ణమ్మ, లక్ష్మణ్ మీసాల, ప్రమోదిని, వడ్లమాని శ్రీనివాస్ కీలకపాత్రలు పోషించారు. పెళ్లి కోసం ఓ యువకుడు పడే తిప్పల చుట్టూ ఈ చిత్రాన్ని కామెడీతో తెరకెక్కించారు డైరెక్టర్ అభిలాశ్ రెడ్డి.

పెళ్లి కాని ప్రసాద్ మూవీని కేవై బాబు, వైభవ్ రెడ్డి ముత్యాల భాను ప్రకాశ్ గౌడ్, సుక్క వెంకటేశ్వర గౌడ్ కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించగా.. సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ చేశారు.

పెళ్లి కాని ప్రసాద్ స్టోరీలైన్

మలేషియాలో ఉద్యోగం చేసే కట్నం ప్రసాద్ (సప్తగిరి)కు 38 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి అయి ఉండదు. అతడి తండ్రి (మురళీధర్ గౌడ్) భారీ కట్నం ఆశిస్తుండటంతో ప్రసాద్‍కు సంబంధం ఏ సంబంధం సెట్ అవదు. ఇండియాకు వచ్చి ఇంకా పెళ్లి ప్రయత్నాలు చేస్తుంటాడు ప్రసాద్. అమెరికాకు వెళ్లే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని ప్రియ (ప్రియాంక శర్మ) అనుకుంటుంది. కట్నం తీసుకోకుండా ప్రియను పెళ్లి చేసుకుంటానని ప్రసాద్ నిర్ణయించుకుంటాడు. దీంతో ప్రసాద్ తండ్రి ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఆ తర్వాత అనూహ్యమైన విషయాలు బయటపడతాయి. ఆ తర్వాత ఏం జరిగింది? ప్రియ, ఆమె కుటుంబం గురించి ఏ విషయాలు బయటపడ్డాయి? మొత్తానికి ప్రసాద్‍కు పెళ్లయిందా అనే విషయాలు పెళ్లి కాని ప్రసాద్ చిత్రంలో ఉంటాయి.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024