రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి తెలుగులో వస్తున్న మలయాళ హీస్ట్ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Best Web Hosting Provider In India 2024

రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి తెలుగులో వస్తున్న మలయాళ హీస్ట్ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

కొల్లా సినిమా తెలుగు వెర్షన్ అందుబాటులోకి వచ్చేస్తోంది. ఓటీటీలో తెలుగు డబ్బింగ్ రానుంది. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ థ్రిల్లర్ మూవీని తెలుగులో ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే..

రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి తెలుగులో వస్తున్న మలయాళ హీస్ట్ థ్రిల్లర్ సినిమా

మలయాళ హీస్ట్ థ్రిల్లర్ చిత్రం ‘కొల్లా’.. 2023 జూన్‍లో థియేటర్లలో రిలీజైంది. రజిషా విజయన్, ప్రియా ప్రకాశ్ వారియర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీకి సూరజ్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ కొల్లా మూవీ తెలుగు వెర్షన్ ఇప్పుడు అందుబాటులోకి వస్తోంది.

స్ట్రీమింగ్ వివరాలు ఇవే

కొల్లా సినిమా తెలుగు డబ్బింగ్‍లో జూన్ 19వ తేదీన ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఈటీవీ విన్ నేడు రివీల్ చేసింది.

రెండేళ్ల తర్వాత తెలుగులో..

కొల్లా చిత్రం మలయాళంలో 2023 జూన్ 9న థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు రెండేళ్ల తర్వాత ఈ మూవీ తెలుగు డబ్బింగ్‍లో వస్తోంది. ఈ మూవీ తెలుగు వెర్షన్ ఈటీవీ విన్‍ ఓటీటీ జూన్ 19న ఎంట్రీ ఇవ్వనుంది.

బ్యాంక్ చోరీకి ఇద్దరు అమ్మాయిలు

కొల్లా మూవీని దొంగతనం చుట్టూ సాగే హీస్ట్ మూవీగా తెరకెక్కించారు దర్శకుడు సూరజ్ వర్మ. బ్యాంకులో చోరీ చేసేందుకు ఇద్దరు అమ్మాయి వేసే ప్లాన్‍ల చుట్టూ ఈ మూవీ సాగుతుంది. ట్విస్టులతో, థ్రిల్లింగ్ ఎలిమెంట్లతో ఈ చిత్రం ఉంటుంది. ఈ మూవీలో ప్రియా ప్రకాశ్ వారియర్, రజిషా విజయన్‍తో పాటు వినయ్ ఫోర్ట్, కొల్లమ్ సుధి, జోర్డి పూన్‍జర్ కీలకపాత్రలు పోషించారు.

కొల్లా సినిమాను రాజీశ్ ప్రొడక్షన్స్, రవి మాథ్యూ ప్రొడక్షన్స్ పతాకాలపై రాజీశ్ కేవీ ప్రొడ్యూజ్ చేశారు. ఈ మూవీకి షాన్ రహమాన్ సంగీతం అందించారు. రాజ్‍వేల్ మోహన్ సినిమాటోగ్రఫీ చేయగా.. అర్జు బెన్ ఎడిటర్‌గా వ్యవహరించారు.

కొల్లా సినిమా కథ ఇలా..

యానీ (రజిషా విజయన్), శిల్ప (ప్రియా ప్రకాశ్ వారియర్) ఓ బ్యూటీ పార్లర్ పెట్టాలని అనుకుంటారు. ఓ కోఆపరేటివ్ బ్యాంక్ వద్దే పార్లర్ మొదలుపెట్టాలని ప్రయత్నిస్తారు. ఇందుకోసం ఆ ప్రాంతానికి మారతారు. అయితే, వారు పార్లర్ పెట్టాలనే ముసుగులో బ్యాంకులో చోరీకి ప్లాన్ చేస్తారు. మరో ఇద్దరితో కలిసి బ్యాంకులో దోపిడీ చేస్తారు యానీ, శిల్పా.

ఈ చోరీ కేసును పోలీసులు తీవ్రంగా విచారిస్తుంటారు. డబ్బు, బంగారు ఆభరణాలను ఓ వ్యక్తి సాయంతో యానీ, శిల్ప దాచేస్తారు. ఏమీ తెలియనట్టు అదే ప్రాంతంలో ఉంటారు. ఎవరో చోరీ చేశారని పోలీసులను నమ్మిస్తుంటారు. ఈ క్రమంలో ఓ ట్విస్ట్ ఎదురవుతుంది. యానీ, శిల్ప చేసిన చోరీ పోలీసులకు తెలుస్తుందా? ఆ డబ్బు విషయంలో ఎదురైన సవాళ్లు ఏంటి? దర్యాప్తులో ఎలాంటి విషయాలు రివీల్ అయ్యాయి? చివరికి ఏమవుతుందనేవి కొల్లా సినిమాలో ఉంటాయి.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024