30 కోట్లు విలువ చేసే లాటరీ కొట్టాడు- గర్ల్​ఫ్రెండ్​కి మొత్తం ఇచ్చేశాడు.. ఆ వెంటనే లవర్​తో మహిళ జంప్​!

Best Web Hosting Provider In India 2024


30 కోట్లు విలువ చేసే లాటరీ కొట్టాడు- గర్ల్​ఫ్రెండ్​కి మొత్తం ఇచ్చేశాడు.. ఆ వెంటనే లవర్​తో మహిళ జంప్​!

Sharath Chitturi HT Telugu

ఆ వ్యక్తికి లాటరీ వచ్చింది. తన గర్ల్​ఫ్రెండ్​కి ఇచ్చాడు. ఆమె ఆ తర్వాత కనిపించలేదు! చివరికి, తన లవర్​తో కలిసుండగా ఆ వ్యక్తి చూశాడు. తాను మోసపోయానని తెలుసుకున్నాడు. కెనడాలో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలు.

మాజీ గర్ల్​ఫ్రెండ్​తో క్యాంప్​బెల్​.. (FB/ Radio Tarana)

కెనడాలో జరిగిన ఒక ఘటన ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఓ వ్యక్తి రూ. 30కోట్లు విలువ చేసే లాటరీని దక్కించుకున్నాడు. అది తన గర్ల్​ఫ్రెండ్​ పేరు మీద మార్చాడు. ఆ తర్వాత, ఆమె కనిపించకుండా పోయింది. చివరికి, తన గర్ల్​ఫ్రెండ్​ని ఆమె లవర్​తో కలిసి బెడ్​ మీద చూశాడు ఆ కెనడా వ్యక్తి.

అసలేం జరిగిందంటే..

విన్నిపెగ్​కి చెందిన లారెన్స్​ క్యాంప్​బెల్​ 2024లో ఒక లాటరీ టికెట్​ కొన్నాడు. లాటరీ గెలిచాడు. అందులో భాగంగా అతనికి 5 మిలియన్ల కెనెడియన్​ డాలర్లు (సుమారు రూ. 30కోట్లు)లభించాయి. అయితే ఆ వ్యక్తికి సరైన ఐడీ లేదు. అందుకే సొంతంగా ప్రైజ్​ మనీని పొందలేకపోయాడు.

2024లో క్రిస్టల్​ ఆనా మెక్​కే అనే మహిళతో క్యాంప్​బెల్​ రొమాంటిక్​ రిలేషన్​లో ఉన్నాడు. ఆమె చాలా లాయల్​ అని, నమ్మకస్తురాలని విశ్వసించాడు.

ప్రైజ్​ మనీ తనకు రావడం లేదని, ఏదైనా సలహా ఇవ్వమని లాటరీ అధికారులను క్యాంప్​బెల్​ అడిగాడు. క్యాంప్​బెల్ తరపున అతని​ గర్ల్​ఫ్రెండ్​ క్రిస్టల్​ ప్రైజ్​ మనీని తీసుకోవాలని సలహా ఇచ్చారు.

క్యాంప్​బెల్​కి బ్యాంక్​ అకౌంట్​ కూడా లేదట! ఫలితంగా ఆ రూ. 30కోట్లను క్రిస్టల్​ తన బ్యాంక్​ అకౌంట్​లో వేసుకుంది. దీనికి క్యాంప్​బెల్​ కూడా ఒప్పుకున్నాడు.

తొలుత అంతా బాగానే ఉంది. పెద్ద సైజు చెక్​తో ఇద్దరు కలిసి ఫొటోలు కూడా దిగారు. “క్రిస్టల్​కి క్యాంప్​బెల్​ ఇస్తున్న బర్త్​డే గిఫ్ట్​ ” అని క్యాంప్​బెల్​ చెప్పుకొచ్చాడు.

కానీ కొంత కాలానికి క్రిస్టల్ అనుమానాస్పదంగా ప్రవర్తించడం మొదలుపెట్టిందని క్యాంప్​బెల్​ ఆరోపించాడు.

“ఇద్దరం ఒక హోటల్​లో కలిసుండేవాళ్లం. కానీ డబ్బులు పడిన కొన్ని రోజుల తర్వాత క్రిస్టల్​ రూమ్​కి రాలేదు. నా ఫోన్​ కాల్స్​ ఎత్తలేదు. ఆమెను నేను ట్రాక్​ చేసుకుంటూ వెళ్లా. చివరికి ఆమె ఒక వ్యక్తితో మంచం మీద నాకు కనిపించింది,” అని క్యాంప్​బెల్​ చెప్పుకొచ్చాడు.

క్రిస్టల్​ తనని మోసం చేసిందని భావించిన క్యాంప్​బెల్​ కోర్టులో కేసు వేశాడు.

“క్యాంప్​బెల్​ని ఆమె ఒత్తిడికి గురుచేసింది. ఫోన్స్​ ఎత్తలేదు. సోషల్​ మీడియా అకౌంట్స్​లో బ్లాక్​ చేసింది, ప్రొటెక్షన్​ ఆర్డర్​ కూడా తీసుకుంది,” అని క్యాంప్​బెల్​ తరపు న్యాయవాది మీడియాకు వివరించారు.

అంతేకాదు సంబంధిత లాటరీ అధికారులపైనా క్యాంప్​బెల్​ కేసు వేశాడు. తన లాటరీని వేరొకరికి ఇవ్వాలన్న చెత్త ఐడియా ఇచ్చారని, అలా ఇస్తే వచ్చే నష్టం గురించి తనకు చెప్పలేదని క్యాంప్​బెల్​ తన పిటిషన్​లో పేర్కొన్నాడు.

ఈ పూర్తి వ్యవహారంపై క్రిస్టల్​ స్పందించింది. క్యాంప్​బెల్​ చెబుతున్నవన్నీ తప్పని పేర్కొంది.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link