ఓటీటీలోకి వచ్చేసిన తమిళ బ్లాక్‍‍బస్టర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడొచ్చంటే..

Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి వచ్చేసిన తమిళ బ్లాక్‍‍బస్టర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడొచ్చంటే..

 

టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. చాలా మంది ఎదురుచూసిన ఈ సూపర్ హిట్ సినిమా స్ట్రీమింగ్ షురూ అయింది. ఐదు భాషల్లో ఈ మూవీ అందుబాటులోకి వచ్చింది.

 
ఓటీటీలోకి వచ్చేసిన తమిళ బ్లాక్‍‍బస్టర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
 

తమిళ మూవీ ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ భారీ హిట్ కొట్టింది. శశికాంత్, సిమ్రన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ ఫ్యామిలీ డ్రామా చిత్రం పెద్దగా అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్‍బస్టర్ సాధించింది. ప్రేక్షకులను మనసులను గెలిచి ప్రశంసలు దక్కించుకుంది. ఈ మూవీకి అభిషాన్ జీవినిత్ దర్శకత్వం వహించారు. మే 1న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా సెన్సేషన్ సక్సెస్ సాధించింది.

 

టూరిస్ట్ ఫ్యామిలీ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం చాలా మంది ఎదురుచూశారు. ఎట్టకేలకు నేడు (జూన్ 2) ఈ మూవీ స్ట్రీమింగ్ మొదలైంది. ఐదు భాషల్లో అందుబాటులోకి వచ్చింది.

స్ట్రీమింగ్ ఎక్కడంటే..

టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా నేడు జియోహాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలోనూ అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రానికి భారీ పాజిటివ్ బజ్ ఉండటంతో హాట్‍స్టార్ ఓటీటీలోనూ టూరిస్ట్ ఫ్యామిలీ దుమ్మురేపే ఛాన్స్ అధికంగా ఉంది.

శ్రీలంక టూ చెన్నై

టూరిస్ట్ ఫ్యామిలీ మూవీని హృదయాలకు హత్తుకునేలా కామెడీ, ఎమోషన్‍తో తెరకెక్కించారు డైరెక్టర్ అభిషాన్ జీవినిత్. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం రావడంతో అనుమతి లేకుండా వలస వచ్చే ఓ కుటుంబం చుట్టూ ఈ మూవీ స్టోరీ ఉంటుంది. ధర్మదాస్, వసంతి పాత్రల్లో శశికాంత్, సిమ్రన్ మెప్పించారు. ఈ చిత్రంలో మిథున్ జై శంకర్, యోగిబాబు, కమలేశ్, ఎంఎస్ భాస్కర్, రామ్‍కుమార్ ప్రసన్న, రమేశ్ తిలక్ కీరోల్స్ చేశారు.

కమర్షియల్ సక్సెస్

టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా ప్రశంసలను దక్కించుకోవడంతో పాటు కమర్షియల్‍గానూ అంచనాలకు మించి సక్సెస్ అయింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో అదరగొట్టింది. సుమారు రూ.16కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ చిత్రం రూ.75కోట్ల గ్రాస్ కలెక్షన్లకు పైగా దక్కించుకొని బంపర్ హిట్ సాధించింది. సూర్య హీరోగా నటించిన రెట్రోకు పోటీలో ఉన్నా.. టూరిస్ట్ ఫ్యామిలీ మాత్రం సత్తాచాటింది.

 

ప్రశంసల వర్షం.. రాజమౌళి కూడా..

టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాను ప్రేక్షకులతో పాటు చాలా మంది సెలెబ్రిటీలు కూడా ప్రశంసించారు. దర్శక ధీరుడు రాజమౌళి.. ఈ మూవీ గురించి ఓ ట్వీట్ చేశారు. హృదయాన్ని హత్తుకునేలా ఈ మూవీ ఉందని, అద్భుతమని అన్నారు. ఈ సినిమాను తప్పకుండా అందరూ చూడాలంటూ.. దర్శకుడు అభిషాన్‍ను అభినందించారు. తన చిత్రానికి పోటీగా వచ్చినా కూడా టూరిస్ట్ ఫ్యామిలీ టీమ్‍ను సూర్య ప్రశంసించారు. మరికొందరు ప్రముఖులు కూడా ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు.

టూరిస్ట్ ఫ్యామిలీ మూవీని మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్‌పీ ఎంటర్‌టైన్‍మెంట్స్ బ్యానర్లపై నజరత్ పసిలియన్, మగేశ్ రాజ్ పసిలియన్, యువరాజ్ గణేషన్ నిర్మించారు. ఈ చిత్రానికి సీన్ రొనాల్డ్ మ్యూజిక్ ఇవ్వగా.. అరవింద్ విశ్వనాధన్ సినిమాటోగ్రఫీ చేశారు. ఈ సినిమాను ఇక జియోహాట్‍స్టార్ ఓటీటీలో చూసేయవచ్చు.

Best Web Hosting Provider In India 2024