బ్రహ్మముడి జూన్ 2 ఎపిసోడ్: భర్త కోసం కావ్య ఆపరేషన్ మాంగళ్య- 5 కోట్ల విల్లాకు గాలం వేసిన రాహుల్ లవర్- రాజ్ ముద్దులు!

Best Web Hosting Provider In India 2024

బ్రహ్మముడి జూన్ 2 ఎపిసోడ్: భర్త కోసం కావ్య ఆపరేషన్ మాంగళ్య- 5 కోట్ల విల్లాకు గాలం వేసిన రాహుల్ లవర్- రాజ్ ముద్దులు!

 

బ్రహ్మముడి సీరియల్ జూన్ 2 ఎపిసోడ్‌లో అలకలు బుజ్జిగింపుల తర్వాత అప్పు, కల్యాణ్ శోభనం జరుగుతుంది. చీరలో అప్పు అందాన్ని చూసి మైమరిచిపోతాడు కల్యాణ్. మరోవైపు భర్త కోసం ఆపరేషన్ మాంగళ్య స్టార్ట్ చేస్తుంది కావ్య. రిసార్టుకు కావ్య వస్తున్నట్లు రాజ్‌కు ఇందిరాదేవి చెబితే ఫోన్‌లోనే రాజ్ ముద్దులు కురిపిస్తాడు.

 
బ్రహ్మముడి సీరియల్‌ జూన్ 2వ తేది ఎపిసోడ్
 

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో అప్పు శోభనం పక్కన పెట్టిన మెసేజ్ చేస్తుంటే కల్యాణ్ వచ్చి చూస్తాడు. దొంగ దొరికాడుగా, ఇంకా మెసేజ్‌లు చేసుకుంటూ ఉంటావేంటీ. ఇంకా రెండేళ్ల అయిన మన శోభనం జరగదు అని కల్యాణ్ అంటాడు. దొంగ దొరికినట్లు మా సీఐకి మెసేజ్ చేస్తున్నా అని చేసి ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందని అప్పు అంటుంది.

 

బుజ్జగింపులు

నాకు మాత్రం లేదు అని వెళ్లి అలిగి కూర్చొంటాడు. అప్పు వెళ్లి బుజ్జగిస్తుంది. నా టైమ్ అంత ఆవిరైపోతుందని కల్యాణ్ అంటే.. కానివ్వను కానీ ముందు ఈ పాలు తాగు అని అప్పు అంటుంది. నేను నీ భర్తను. జైలులో ఖైదీని అడిగినట్లు ఏంటది. స్మూత్‌గా స్మైల్‌తో, సిగ్గుపడుతూ ఏవండి పాలు తీసుకోండి అని అడిగితే ఏమవుతుంది కల్యాణ్ అంటాడు.

నీలో రొమాంటిక్ యాంగిల్ ఎక్కడిది. పెళ్లికి ఎన్ని కష్టాలు పడ్డానో. శోభనానికి ఇన్ని తిప్పలు పడాల్సి వస్తుంది. ఇక ఫ్యూచర్‌లో ఎన్ని కష్టాలు పడాలో అని కల్యాణ్ అంటాడు. నేను నీ దురదృష్టాన్ని అని ఇన్‌డైరెక్ట్‌గా చెబుతున్నావా.. నాతో మాట్లాడకు అని అలిగి పక్కకు వెళ్లి నిల్చుంటుంది అప్పు. వెనుక నుంచి వెళ్లి వాటేసుకుని బుజ్జగిస్తాడు కల్యాణ్. తర్వా రొమాంటిక్‌గా పాట పాడుతూ మచ్చిక చేసుకుంటాడు.

నడుముపై చేయి వేయగానే అప్పు కూల్ అవుతుంది. అప్పు, కల్యాణ్ శోభనం అవుతుంది. మరోవైపు స్వప్న దగ్గర కొట్టేసిన ఏడు వారాల నగలను గర్ల్‌ఫ్రెండ్‌కు అలంకరిస్తాడు రాహుల్. స్వప్న కన్నా నీకే అందంగా ఉన్నాయి అని పొగుడుతాడు రాహుల్. ఈరోజు నాకు అందంగా ఉంది. ఇటు నీకు నగలు తీసుకొచ్చాను. అటు రాజ్, కావ్య విడిపోయేలా మా మమ్మీ చేసింది. రాజ్యానికి రాజు లేకుంటే నాలాంటి సైన్యాధిపతి సింహాసనం మీద కూర్చుంటాడుగా అని రాహుల్ అంటాడు.

 

50 లక్షలకుపైగా

అంటే, ఆ కోటకు నువ్వే వారసుడు అయిపోతావా అని గర్ల్ ఫ్రెండ్ అంటుంది. అంతేగా అని రాహుల్ చెబుతాడు. నువ్వేమో కోటకు వారసుడు అయి కోటీశ్వరుడైపోతావ్. నాకేమే ఈ ముష్టి నగలు తీసుకొచ్చి ఇచ్చావా అని లవర్ అంటుంది. 50 లక్షలకుపైగా ఉంటాయి ఇవి అని రాహుల్ అంటే.. నీకోమో కోట్లు, నాకేమో ముష్టి లక్షల అని ప్రియురాలు అంటుంది.

ఆస్తి రాగానే నా భార్యకు విడాకులు ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటానుగా అని రాహుల్ అంటాడు. రాహుల్ దగ్గరికి వెళ్తే గర్ల్‌ఫ్రెండ్ దూరం పెడుతుంది. నువ్వేమో కోటలో ఉంటావ్. నేను ఇక్కడ ఉండాల. నాకు విల్లా కావాలి అని గర్ల్ ఫ్రెండ్ అంటుంది. ఐదు కోట్లు అవుతుందని రాహుల్ అంటే.. కాబోయే భార్య కోసం ఐదు కోట్లు పెట్టలేవా అని విల్లాకు టెండర్ పెడుతుంది రాహుల్ గర్ల్ ఫ్రెండ్.

నాకు డబ్బు రాని కచ్చితంగా ఆలోచిస్తాను అని రాహుల్ దగ్గరికి వెళ్తే గర్ల్ ఫ్రెండ్ రానివ్వదు. ఆస్తి నీ చేయికి వచ్చి ఇల్లు కొనిస్తేనేగా నీ మీద నాకు నమ్మకం వచ్చేది. అప్పుడేగా నీకు సొంతం అయ్యేది అని గర్ల్ ఫ్రెండ్ అంటుంది. ఆస్తి దక్కుతుందంటే సంతోషిస్తుందనుకుంటే ఇలా ట్విస్ట్ ఇచ్చిందేంటీ అని రాహుల్ అనుకుంటాడు. ఆస్తి వచ్చినప్పుడే నీ మీద చేయి వేస్తాను అని హగ్ అడుగుతాడు. దానికి ఒప్పుకుని హగ్ ఇస్తుంది గర్ల్ ఫ్రెండ్.

 

ఏదో ఒక మాయ చేసి

ఎంతోకష్టపడి నగలు తీసుకొస్తే ఇది ఐదు కోట్ల విల్లాకే గాలం వేస్తుంది. ఏదో ఒక మాయ చేసి దీన్ని నా సొంతం చేసుకోవాలి అని రాహుల్ అనుకుంటాడు. మరోవైపు కావ్యను పిలిచి ఆపరేషన్ చేయాలని అపర్ణ అంటుంది. సైనికులు చేసే ఆపరేషన్. దేశాన్ని కాపాడేందుకు వాళ్లు చేస్తారు. కాపురాన్ని నిలబెట్టుకునేందుకు ఆపరేషన్ చేయాలి అని ఇందిరాదేవి అంటుంది.

యామిని గురించి అపర్ణ చెబుతుంది. కావాలనే డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు నటించిన నా మనవడు రిసార్టుకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేసింది. రాజ్ కూడా వెళ్తున్నారు. యామిని ఆడింది డ్రామా అని తెలియక వెళ్తున్నాడ. యామిని జిత్తులమారి నక్క వాడిని సొంతం చేసుకోడానికి ఎంతకైనా తెగిస్తుంది. పొరపాటున వాడు గానీ ఏదైనా తప్పు చేశాడంటే ఇంకా నీ జీవితం నాశనం అయిపోతుంది అని ఇందిరాదేవి, అపర్ణ చెబుతారు.

అలా ఎప్పటికీ జరగదు అని కావ్య అంటుంది. దాని ప్లాన్‌ను తిప్పికొట్టాలి. అలా జరగాలంటే దానికి తెలియకుండానే నువ్వు ఫాలో అవ్వాలి. నా కొడుకును దానికి దూరంగా పెట్టి యామిని దెబ్బకొట్టాలి అని అపర్ణ అంటుంది. నీ మాంగళ్యాన్ని యామిని లాక్కోకముందే నీ ఆపరేషన్ మాంగళ్యాన్ని అమలు చేయాలి అని ఇందిరాదేవి అంటుంది. చేస్తాను, నా భర్తను కాపాడుకోడానికి చేస్తాను అని కావ్య అంటుంది.

 

నీడ కూడా తాకకుండా

ఏ రిసార్టుకు వెళ్లారు అని కావ్య అడిగితే.. అదంతా తెలుసుకున్నా. లొకేషన్‌ను నీ ఫోన్‌కు సెండ్ చేస్తా. రాజ్‌కు కూడా నువ్వు వస్తున్నట్లు చెబుతా అని ఇందిరాదేవి అంటుంది. ఆయన నీడ కూడా తాకకుండా కాపాడుకుంటా అని కావ్య వెళ్తుంది. మరోవైపు బెడ్ మీద కల్యాణ్ పడుకుని ఉంటాడు. ఫ్రెష్ అయి వచ్చిన అప్పు రాత్రంతా నిద్రపోనివ్వకుండా చేసి వీడు మాత్రం పడుకుంటాడా అని కాఫీ ఇస్తుంది.

కానీ, కల్యాణ్ నిద్ర లేవడు. దాంతో కాలికి కాఫీ వేడి తగిలిస్తుంది. దాంతో కల్యాణ్ లేచి చీరలో అప్పు అందాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. తర్వాత నీ పెదాలతో కాఫీని ఎంగిలి చేసి ఇవ్వమని కల్యాణ్ అడిగితే.. రాత్రి జరిగింది చాలు అని కల్యాణ్‌ను తోసేసి బయటకు వెళ్తుంది అప్పు. ఎక్కడికి వెళ్తావే.. మళ్లీ నైట్ ఇక్కడికే రావాలి అని కల్యాణ్ అంటాడు.

మరోవైపు యామిని లగేజ్ సర్దుతుంటే వైదేహి భయపడుతుంది. నాకెందుకో మనం చేస్తుంది తప్పు అనిపిస్తుందని అంటుంది. నాకు కాబోయే వాడితోనే వెళ్తున్నాగా అని యామిని అంటుంది. పెళ్లికి ముందే ఇలా తొందరపడటం కరెక్ట్ కాదుగా. నలుగురు ఏమనుకుంటారు అని తల్లి వైదేహి అంటుంది. తప్పక చేస్తున్నా. దీనికంటే మంచి ఐడియా ఉంటే చెప్పు ఇప్పుడే క్యాన్సిల్ చేస్తానంటుంది యామిని.

 

ముగ్గులోకి తెచ్చుకునేలా

దాంతో వైదేహి సైలెంట్ అవుతుంది. మరోవైపు రాజ్‌కు ఇందిరాదేవి కాల్ చేస్తుంది. నువ్ ఎలాగు ప్రపోజ్ చేయవని అర్థమైంది. నేనే నీ దగ్గరికి నా మనవరాలిని పంపిస్తున్నాను అని ఇందిరాదేవి అంటుంది. నానమ్మ నువ్ సూపర్ అంతే. దగ్గరుంటే ముద్దులతో ముంచెత్తేవాన్ని. ఫోన్ ఉందిగా ఫోన్‌లో పెడతా అని ఇందిరాదేవికి ముద్దులు పెడతాడు రాజ్.

ముద్దులు పెట్టడం ఆపి కళావతిని నీ ముగ్గులోకి ఎలా తెచ్చుకోవాలో చూడు. మళ్లీ ఇలాంటి అవకాశం దొరకదు. నీ ప్రేమ విషయం చెప్పు అని ఇందిరాదేవి అంటుంది. అస్సలు వదులుకోను. నిప్పు అంటించావ్‌గా నేను రాకెట్‌లా ఎలా వెళ్తానో చూడు. కళావతి రాగానే షారుక్ ఖాన్‌లా లవ్ ప్రపోజ్ చేస్తాను అని రాజ్ అంటాడు. వికారాబాద్ బ్రాంచ్‌లో పని ఉందని పంపాను. నువ్ తనతో వెళ్లి ప్రేమగా మాట్లాడి విషయం చెప్పు. అప్పుడు ఒప్పుకుంటుంది అని ఇందిరాదేవి అంటుంది.

ఓకే అర్థమైంది అని కాల్ కట్ చేస్తాడు రాజ్. తిరిగి వెనక్కి చూడగానే యామిని ఉంటుంది. ఏంటీ బావ అంత హ్యాపీగా ఉన్నావ్. ఎవరు ఫోన్‌లో అని యామిని అడుగుతుంది. ఫ్రెండ్ అని రాజ్ కవర్ చేస్తాడు. కారులో రాజ్, యామిని వెళ్తారు. ఇద్దరు రిసార్టుకు వెళ్తారు. ఒక రూమ్‌లో బెడ్‌పై రాజ్ కూర్చుంటే పక్కనే వచ్చి యామిని కూర్చుంటుంది. రాజ్ ఇబ్బందిగా ఫీల్ అవుతాడు.

 

ఆలస్యమైన కావ్య

కావ్య నీ మనసులో ఉన్నంతవరకు నన్ను దగ్గరికి రానివ్వవు. కానీ, ఈరోజు నిన్ను నా సొంతం చేసుకుంటాను అని యామిని అనుకుంటుంది. మరోవైపు రిసార్టుకు వచ్చిన కావ్య ఆలస్యమయ్యానా, ఈపాటికి వాళ్లిద్దరు రూమ్‌లోకి వెళ్లి ఉంటారు అని అనుకుంటుంది. మరోవైపు రాజ్ ఏదో చెబుతుంటే పెదాలపై వేలు పెట్టి ఆపుతుంది యామిని. రాజ్‌కు ముద్దు పెట్టేందుకు దగ్గరికి వెళ్తుంది యామిని. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 

Best Web Hosting Provider In India 2024