గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్: మనోజ్ ముందు బయటపడిన రోహిణి అప్పు- చీకట్లో దెయ్యంలా ప్రభావతి- దడుసుకున్న పిల్లలు!

Best Web Hosting Provider In India 2024

గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్: మనోజ్ ముందు బయటపడిన రోహిణి అప్పు- చీకట్లో దెయ్యంలా ప్రభావతి- దడుసుకున్న పిల్లలు!

 

గుండె నిండా గుడి గంటలు జూన్ 2 ఎపిసోడ్‌లో రోడ్డు మీద మనోజ్, రోహిణి వెళ్తుంటే అప్పుల వాళ్లు వచ్చి అడుగుతారు. దాంతో రోహిణి అప్పు విషయం మనోజ్ ముందు బయటపడుతుంది. ప్రభావతికి రోహిణి ఫేస్ ప్యాక్ వేస్తుంది. దాంతో రాత్రి చీకట్లో ప్రభావతిని చూసి దెయ్యం అనుకుని ఇంటిల్లిపాది దడుసుకుంటారు.

 
గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూన్ 2 ఎపిసోడ్‌
 

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో మౌనికతో బాలుపై ఉన్న కోపం గురించి చెబుతుంది మీనా. తాళి నాకు ఉరితాడులా కనిపించేది. అదే ఇప్పుడు పవిత్రంగా కనిపిస్తుంది. ఆయన ఇలా ఉండటానికి ఏదో కారణం ఉంది అని మీనా అంటే.. అన్నయ్యకు చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేమ దక్కలేదు అని మౌనిక అంటుంది.

 

ఏవైనా పరిస్థితులు కారణమా

ప్రతి ఒక్కరు మారడానికి ఏదో ఒక కారణం ఉంటుంది. ఆ కారణం తెలుసుకుని అర్థం చేసుకుంటే, అలాంటి భార్య దొరికినందుకు ఎవరైన మారుతారు. ఎప్పటికైనా మారక తప్పదు అని మీనా అంటుంది. అంటే నా భర్త ప్రవర్తన వెనుక ఏదైనా కారణం ఉండుంటుందా. ఆయన అలా మారడానికి ఏవైనా పరిస్థితులు కారణమా అని మౌనిక సంజు గురించి ఆలోచిస్తుంది.

నీతో మాట్లాడుతుంటే నాకు ప్రశాంతంగా ఉంది. ఇందుకేనేమో నిన్ను కనిపించేలా చేశాడు దేవుడు అని మీనా అంటుంది. లేదు వదినా అల్లకల్లోలంగా ఉన్న నా మనసును ప్రశాంతంగా చేయడానికే నిన్నే ఆ దేవుడు నా దగ్గరికి పంపించాడు అని మౌనిక అనుకుంటుంది. ఓ పెద్ద ఆర్డర్ మీ అన్నయ్య తీసుకొచ్చాడు. వెళ్లనా అని వెళ్తుంది మీనా. నీ మాటలతో నాకు ఓ దారి చూపించావ్ వదినా. నిన్ను ఆదర్శంగా నా జీవితాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాను అని మౌనిక అనుకుంటుంది.

మరోవైపు కెనడా గురించి మాట్లాడుతాడు మనోజ్. వెంటనే 14 లక్షలు కడితే వెళ్లొచ్చు అని మనోజ్ అంటే.. ఇక్కడే జాబ్ చేసుకోవచ్చుగా. నేను ఇక్కడే పార్లర్ రన్ చేస్తున్నా. నువ్ కెనడా వెళ్తే మనమిద్దరం దూరంగా ఉండాల్సి వస్తుందని రోహిణి అంటుంది. నిన్ను కూడా తీసుకెళ్తా అని మనోజ్ అంటాడు. ఇక్కడ అందరిని వదిలి వెళ్లడం అక్కడికి ఎలా వెళ్తాం. కలిసి ఉందాం. ముందు ఆరు నెలలు జాబ్ చేయి అని రోహిణి అంటుంది.

 

నీకోసమే వెతుకుతున్నా

రోహిణిని చూసిన అప్పులవాళ్లు వస్తారు. అప్పు తీసుకుని వడ్డి కట్టకుండా తిరుగుతుందని అనుకుంటారు. నీకోసమే వెతుకున్నా నువ్వే కనిపించావ్ అని అతను అంటే.. రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు అని మనోజ్ అంటాడు. అప్పు తీసుకుని ఎగ్గోట్టేవాళ్లకు మర్యాదా ఏంటీ అని అతను అంటాడు. అప్పు ఏంటీ, నేను తన హస్బండ్‌ను అని మనోజ్ అంటాడు.

హో నీకు తెలియకుండా అప్పు చేసిందన్నమాట. నీ వైఫ్ అప్పు తీసుకుని వడ్డి కట్టకుండా తిరుగుతుంది. కాల్ చేస్తే కట్ చేస్తుంది అని అతను అంటాడు. ఇద్దరు ఆధార్ కార్డ్‌లు మొహంపై పెట్టమని చెప్పి ఫొటో తీసుకుంటారు. వెంటనే అప్పు కట్టకపోతే నీ మొగుడిని జైలులో చూడాల్సి వస్తుందని అప్పులవాళ్లు వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతారు. ఏంటిదంతా అని మనోజ్ అడుగుతాడు.

మూడేళ్ల క్రితం అప్పు తీసుకున్నా. ఇంట్రెస్ట్ లేట్ అయ్యేసరికి ఇలా. పెద్ద విషయం కాదు అని చెప్పలేదు అని రోహిణి అంటుంది. ఇలా రోడ్డు మీద అడిగితే పెద్ద విషయం కాదంటావేంటీ. అయినా మన మధ్య దాపరికం ఉండకూడదని అనుకున్నాం కదా. మీ నాన్నను అడగమంటే అడగవు కానీ బయట వాళ్ల దగ్గర ఎలా తీసుకున్నావ్ అని మనోజ్ అంటాడు.

 

విద్య ఎమర్జెన్సీ కోసం

విద్యకు ఎమర్జెన్సీ వస్తే తనకోసం తీసుకున్నా. ఈ మధ్య ఇంట్రెస్ట్ కట్టట్లేదు. లోన్ నా పేరు మీద ఉంది కాబట్టి నన్ను అడుగుతున్నారు. అసలు 2 లక్షలు, వడ్డీతో నాలుగు లక్షలు అయిందని రోహిణి అంటుంది. రోడ్డు మీద అడుగుతుంటే ఎంత అవమానంగా ఉందని మనోజ్ అంటాడు. నువ్ పోగొట్టుకున్న 40 లక్షలతో పోలిస్తే ఇది చాలా చిన్నది. భూతద్దంలో పెట్టి చూడకు అని వెళ్తుంది రోహిణి.

తర్వాత వెనక్కి వచ్చి సారీ మనోజ్ తొందర్లో అన్నా అని రోహిణి అంటుంది. ఇన్నాళ్లు బాలుగాడు అన్నాడు. ఇప్పుడు నువ్ అని కోపంగా వెళ్తాడు మనోజ్. మరోవైపు మౌనిక దొరకలేదని సంజు ఇంట్లో చెబుతాడు. మౌనిక అన్నయ్య బాలుకు కనిపిస్తే ఇంకేమైనా ఉందా అని తల్లి భయపడుతుంది. ఇంతలో బాలు వస్తాడు. నా చెల్లి ఎక్కడరా అని సంజు కాలర్ పట్టుకుంటాడు బాలు.

మౌనిక పెళ్లిలో అన్నమాటలు గుర్తుకుతెచ్చుకుని ఆగిపోతాడు బాలు. ఇంట్లో మౌనిక కోసం వెతుకుతాడు బాలు. సంజు అత్తను అడిగితే నీలకంఠం బెదిరిస్తాడు. ఇలా అడిగితే చెప్పర్రా అని కత్తి తీసుకుని సంజు పీకమీద పెడతాడు బాలు. ఇంతలో మౌనిక వస్తుంది. మౌనికను చూసి బాగానే ఉన్నావుగా, నీ ఫొటో పట్టుకుని వీళ్లు ఎందుకు వెతుకుతున్నారు అని అడుగుతాడు బాలు.

 

గుడికి వెళ్లాను

ట్రిప్ విషయం మా ఇద్దరికి గొడవ అయింది. నేను చెప్పకుండా గుడికి వెళ్లాను. అందుకే వెతుకున్నారు అని మౌనిక అబద్దం చెబుతుంది. నువ్వేదో దాస్తున్నావ్. ఇక్కడేదో జరుగుతుంది అని బాలు అంటాడు. నేను కనపడకపోయేసరికి ఇలా వెతికారంటే అర్థం చేసుకో ఎలా చూసుకుంటున్నారో అని మౌనిక అంటుంది. తర్వాత బాలును బయటకు తీసుకెళ్తుంది.

నాకేమైనా అయితే దేవుడికి చెప్పడం మర్చిపోతానేమో కానీ నీకు చెప్పకుండా ఉంటానా అని మౌనిక అంటుంది. నిజంగానే గుడికి వెళ్లాను. అక్కడ వదిన కూడా కనిపించింది అని మౌనిక చెప్పడంతో బాలు వెళ్లిపోతాడు. మరోవైపు ప్రభావతికి రోహిణి ఫేషియల్ చేస్తుంది. ఇది వీఐపీ కస్టమర్స్‌కు వేసే స్పెషల్ ఫేస్ ప్యాక్. మీరు కూడా నాకు వీఐపీనే కదా. ఉదయం చూడండి ఐదు సంవత్సరాలు తగ్గినట్లు కనిపిస్తారు అని రోహిణి అంటుంది.

అవునా, నిజమా. అప్పుడు మీ మావయ్య నాకు మావయ్యలా ఉంటారా అని సంతోషంగా అంటుంది ప్రభావతి. దానికి రోహిణి నవ్వుతుంది. ప్రభావతిని మీనా ఆశ్చర్యంగా చూసి ఇదేంటని అడుగుతుంది. రోహిణి చెప్పబోతుంటే ప్రభావతి కౌంటర్ వేస్తుంది. ఇలా మొహంమీద అలికి వేసుకోరు అని మీనా వెళ్తుంది. అలకడం అంటే పేడ అలికినట్లా అని రోహిణి అంటుంది.

 

తనకంటే అందంగా

దానికి కుళ్లు. ఎక్కడా దానికంటే అందంగా కనిపిస్తానో అని దాని భయం అని ప్రభావతి అంటుంది. రాత్రంతా ఉంచి ఉదయం చల్లటి నీరుతో కడిగేయమని రోహిణి చెబుతుంది. రవిని నిద్రలో శ్రుతి కొడుతుంది. తర్వాత శ్రుతిని లేపి ఏసీ రిమోట్ అడుగి ఆఫ్ చేస్తాడు. ఇద్దరూ ఏసీ గురించి గొడవ పడతారు. నాకు చలేస్తుందని రవి, తనకు ఉక్కపోస్తుందని శ్రుతి ఇద్దర ఏసీ గురించి గొడవ పడతారు.

ఇంతలో కరెంట్ పోతుంది. నీ వల్లే ఫీజ్ కొట్టేసినట్లుందని మళ్లీ ఇద్దరు గొడవ పడతారు. మరోవైపు క్యాండిల్ పట్టుకుని ఓ వైపు మీనా, మరోవైపు బాలు ఎదురుపడతారు. క్యాండిల్ వెలుగులో మీనా అందం చూసి అలాగే ఉండిపోతాడు బాలు. అందరి ఇళ్లల్లో కరెంట్ ఉందే. మనదేమైనా ఫ్యూజ్ పోయిందేంటీ అని మీనా అంటుంది. ఇంతలో ప్రభావతి ఫేస్ ప్యాక్‌తో వస్తుంది.

ప్రభావతిని చూసి బాలు దడుసుకుని గట్టిగా అరుస్తాడు. దానికి ప్రభావతి కూడా అరుస్తుంది. మీనా కూడా అరుస్తుంది. దెయ్యం దెయ్యం అని బాలు అంటాడు. అరేయ్ నేనురా అని ప్రభావతి అంటే.. నువ్వేప్పుడు దెయ్యం అయ్యావమ్మా అని బాలు అంటాడు. రోహిణి ఫేస్ ప్యాక్ వేసిందని మీనా చెబుతుంది. ఈ వయసులో ఇవేం పనులని బాలు అంటాడు. ఇంతలో మనోజ్ వచ్చి ప్రభావతిని చూసి దూరంగా పారిపోతాడు.

 

టీ ఇప్పించిన మీనా

రోహిణి దెయ్యం చంపేస్తానంటుంది అని పెళ్లాం వెనుకాల దాక్కుంటాడు మనోజ్. మన ఆంటీనే రోహిణి చెబుతుంది. దెయ్యంలా వేశాం ఎందుకువేసావ్. అసలే నాకు దెయ్యాలంటే భయమని మనోజ్ అంటాడు. ఇంతలో రవి, శ్రుతి వచ్చి కూడా దడుసుకుంటారు. దూరంగా పారిపోతారు. మన అత్తయ్యే అని రోహిణి చెబుతుంది. మొహం కడుక్కోమని చెప్పాను. పిల్లలందరు దడుసుకున్నారు అని సత్యం అంటాడు.

చీకట్లో ఎవరైనా ఇలాగే కనిపిస్తారు అని ప్రభావతి అంటుంది. కరెంట్ ఎందుకు పోయిందని బాలు అంటాడు. తర్వాత ఉదయం బాలు ఆటోలో ప్యాసెంజర్‌లా మీనా వెళ్తుంది. ఓ చోట బాలుకు మీనా టీ ఇప్పిస్తుంది. అది చూసి ఓ ప్యాసెంజర్ నీకు టీ ఇప్పిస్తుందని మీనా గురించి గొప్పగా చెబుతాడు టీ అమ్మే వ్యక్తి. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Best Web Hosting Provider In India 2024