Best Web Hosting Provider In India 2024

చాహల్‌కు సూర్య వికెట్.. ఎగిరి గంతేసిన గర్ల్‌ఫ్రెండ్.. రూమర్ ప్రేయసి మహ్వాశ్ ఆనందం చూశారా! ప్రీతి జింటా కూడా హ్యాపీ
ఐపీఎల్ 2025 ఫైనల్లో పంజాబ్ కింగ్స్ అడుగుపెట్టింది. ఉత్కంఠభరిత పోరులో ముంబయి ఇండియన్స్ పై గెలిచింది. ఈ మ్యాచ్ లో సూర్య వికెట్ చాహల్ తీశాడు. ఆ తర్వాత చాహల్ రూమర్ గర్ల్ ఫ్రెండ్ మహ్వాశ్ రియాక్షన్ వైరల్ గా మారింది.
ఐపీఎల్ 2025లో ఆదివారం (జూన్ 1) పంజాబ్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ మ్యాచ్ థ్రిల్ ను అందించింది. ఈ క్వాలిఫయర్ 2లో గెలిచిన పంజాబ్ ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే ఈ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ డేంజరస్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ వికెట్ స్పిన్నర్ చాహల్ కు దక్కింది. ఆ వికెట్ పడ్డాక చాహల్ గాసిప్ గర్ల్ ఫ్రెండ్ మహ్వాశ్, పంజాబ్ కో ఓనర్ ప్రీతి జింటా రియాక్షన్ వైరల్ గా మారింది.
ఆనందంతో గంతులు
ఇంటర్నెట్ సెన్సేషన్, నటి ఆర్‌జే మహ్వాశ్ ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పంజాబ్ కింగ్స్ కు సపోర్ట్ చేస్తోంది. ఆ టీమ్ లో ఉన్న స్పిన్నర్ చాహల్ తో ఆమె రిలేషన్ షిప్ లోనే ఉన్నారనే రూమర్స్ బలంగా వినిపిస్తున్నాయి. ముంబయి ఇండియన్స్ తో పంజాబ్ కింగ్స్ క్వాలిఫయర్ 2 మ్యాచ్ కు కూడా మహ్వాశ్ అటెండ్ అయింది. మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ వికెట్ చాహల్ తీయడంతో మహ్వాశ్ ఆనందంతో ఉప్పొంగింది.
ప్రీతి జింటా ఇలా
స్టాండ్స్‌లో తన స్నేహితురాలితో కూర్చున్న ఆర్‌జే మహ్వాశ్.. సూర్య వికెట్ చాహల్ తీయగానే సీటు నుంచి లేచి ఎగిరి గంతులేసింది. తెల్లని టాప్, షార్ట్స్ ధరించిన ఆమె కేకలు వేస్తూ చేతులు ఊపింది. అదే వీడియో క్లిప్‌లో ప్రీతి జింటా చప్పట్లు కొడుతూ, నవ్వుతూ కనిపించింది. ఆమె తెలుపు, ఎరుపు రంగు దుస్తులు ధరించింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆ పోస్ట్
ఆర్‌జే మహ్వాశ్ తరచుగా పీబీకేఎస్ ఆడే మ్యాచ్ ల్లో కనిపిస్తోంది. ఇటీవల చాహల్ జట్టు.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడినప్పుడు ఆమె ముల్లాన్ పూర్ లో పంజాబ్ కోసం చీర్ చేసింది. ఇక పంజాబ్ కింగ్స్ ఓటమి పాలైనప్పుడు అనేక వీడియోలు, ఫొటోల్లో ఆర్‌జే మహ్వాశ్ బాధగా కనిపించింది.
ఇటీవల ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ఒకటి వైరల్ గా మారింది. ‘‘ఎవరి పట్ల తప్పుగా ప్రవర్తించలేదని మీకు మీరు తెలుసుకోవడం ముఖ్యం. విలువలతో జీవించాలి. ఇతరులు ఏమన్నా పట్టించుకోవద్దు’’ అని అందులో పేర్కొంది.
గాసిప్ సంబంధం
మహ్వాశ్, చాహల్ 2024లో మొదటిసారి కలిసి కనిపించారు. ఆ సమయంలో అతను ఇంకా ధనశ్రీ వర్మ నుంచి విడాకులు తీసుకోలేదు. ఆమె అతనితో డేటింగ్ చేస్తుందని గాసిప్స్ వచ్చాయి. కానీ మహ్వాశ్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో దీన్ని ఖండించింది. ఈ ఏడాది మార్చిలో చాహల్ విడాకులు తీసున్న తర్వాత ప్రస్తుత ఐపీఎల్ సమయంలో మహ్వాశ్ తో కలిపి చాలా సార్లు కనిపించాడు.
మహ్వాశ్ మే 7న అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్‌లో ప్రీమియర్ అయిన ప్యార్ పైసా ప్రాఫిట్ సీజన్ 1లో యాక్ట్ చేసింది.