ఎయిమ్స్‌ మంగళగిరిలో 117 ఉద్యోగాలు – మంచి జీతం, నోటిఫికేషన్ వివరాలివే

Best Web Hosting Provider In India 2024

ఎయిమ్స్‌ మంగళగిరిలో 117 ఉద్యోగాలు – మంచి జీతం, నోటిఫికేషన్ వివరాలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu

ఏపీలోని ఎయిమ్స్ మంగళగిరి నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. మొత్తం 117 ఖాళీలు ఉన్నాయి. జూన్‌ 14వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు.

ఎయిమ్స్‌ మంగళగిరి నుంచి ఉద్యోగ నోటిఫికేషన్

ఎయిమ్స్‌(ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌) మంగళగిరిలో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 117 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఖాళీల వివరాలు…

నోటిఫికేషన్ లో తెలిపిన వివరాల ప్రకారం…. మొత్తం 117 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అనస్థీషియాలజీ, అనాటమీ, బయో కెమిస్ట్రీ, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్‌ అండ్ వ్యాస్క్యూలర్‌ సర్జరీ, కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ మెడిసిన్‌, డెర్మటాలజీ, ENT, ఫొరెన్సిక్‌ మెడిసిన్‌ అండ్ టాక్సికాలజీ, జనరల్ మెడిసిన్‌, జనరల్ సర్జరీ, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌, మెడికల్ ఆంకాలజీ, మైక్రోబయాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, న్యూక్లియర్‌ మెడిసిన్‌, ఆర్థోపెడిక్స్‌, పీడియాట్రిక్‌ సర్జరీ, పీడియాట్రిక్స్‌, పాథాలజీ, ఫార్మకాలజీ, ఫిజియాలజీతో పాటు మరికొన్ని విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు…. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎండి, ఎంఎస్‌, డీఎం, ఎంఫిల్‌, ఎమ్ఎస్సీ, ఎంసీహెచ్‌లో పాసై ఉండాలి. అంతేకాకుండా పని చేసిన అనుభవం ఉండాలని నోటిఫికేషన్ లో తెలిపారు. ఈ వివరాలను aiimsmangalagiri.edu.in వెబ్ సైట్ లో చూడొచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.67,000 జీతం చెల్లిస్తారు. ఇక నాన్‌ మెడికల్ వారికి రూ.56,100 జీతం ఇస్తారు.

దరఖాస్తులు, ఎంపిక విధానం…

ఆన్ లైన్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఈ గడువు జూన్ 14వ తేదీ నాటికి పూర్తవుతుంది. అప్లికేషన్లను పరిశీలించి షార్ట్ లిస్ట్ చేస్తారు. వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూలకు వచ్చేవారు అర్హత పత్రాలను తీసుకురావాల్సి ఉంటుంది. అయితే దరఖాస్తులు ఎక్కువగా వస్తే… రాత పరీక్ష నిర్వహించే అవకాశం ఉంటుంది. వాటి ఆధారంగా ఇంటర్వూలకు ఎంపిక చేస్తారు. ఎయిమ్స్ మంగళగిరి(గుంటూరు జిల్లా) అడ్మిన్ అండ్ లైబ్రరీ బిల్డింగ్ లో ఇంటర్వూలను నిర్వహిస్తారు.

దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.1,500 చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే recruitment.helpdesk@aiimsmangalagiri.edu.in మెయిల్ ను సంప్రదించవచ్చు.

అప్లికేషన్ లింక్ : https://forms.gle/NCDekBCzjxj51Dz18

ఈ లింక్ పై క్లిక్ చేసి ఎయిమ్స్ ఉద్యోగ నోటిఫికేషన్ వివరాలను తెలుసుకోవచ్చు

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

టాపిక్

RecruitmentGunturAndhra Pradesh News
Source / Credits

Best Web Hosting Provider In India 2024