నాకు యాక్టింగ్ రాకున్నా సినిమాలో అవకాశం ఇచ్చారు, నా తండ్రి గురించి మాట్లాడినట్లే ఉంటుంది: నిర్మాత బండ్ల గణేష్ కామెంట్స్

Best Web Hosting Provider In India 2024

నాకు యాక్టింగ్ రాకున్నా సినిమాలో అవకాశం ఇచ్చారు, నా తండ్రి గురించి మాట్లాడినట్లే ఉంటుంది: నిర్మాత బండ్ల గణేష్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా, నిర్మాతగా క్రేజ్ తెచ్చుకున్నారు బండ్ల గణేష్. పలు సూపర్ హిట్ సినిమాలను అందించిన బండ్ల గణేష్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి, పవన్ కల్యాణ్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఎస్వీ కృష్ణారెడ్డి బర్త్ డే సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న ఆయన స్పీచ్‌తో అలరించారు.

నాకు యాక్టింగ్ రాకున్నా సినిమాలో అవకాశం ఇచ్చారు, నా తండ్రి గురించి మాట్లాడినట్లే ఉంటుంది: నిర్మాత బండ్ల గణేష్ కామెంట్స్

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా, నిర్మాతగా ఎంతో క్రేజ్ తెచ్చుకున్నారు బండ్ల గణేష్. నటుడిగా పలు సినిమాలతో అలరించిన బండ్ల గణేష్ ఆంజనేయులు, తీన్‌మార్, గబ్బర్ సింగ్, బాద్‌షా, ఇద్దరమ్మాయిలతో, గోవిందుడు అందరివాడేలే, టెంపర్ వంటి సినిమాలను నిర్మించారు.

ఎస్వీ కృష్ణారెడ్డి బర్త్ డే

అయితే, తెలుగులో సూపర్ హిట్ సినిమాలను అందించిన దిగ్గజ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు జూన్ 1. ఆదివారం నాడు ఎస్వీ కృష్ణారెడ్డి బర్త్ డే సెలబ్రేషన్స్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. హైదరాబాద్ ఎఫ్ఎన్ సీసీలో నిర్వహించిన ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలకు నిర్మాత బండ్ల గణేష్‌తోపాటు రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం తదితరులు హాజరయ్యారు.

బండ్ల గణేష్ కామెంట్స్

ఈ వేడుకల్లో దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై నిర్మాత బండ్ల గణేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దానికంటే ముందుగా స్టేజ్ ఎక్కిన బండ్ల గణేష్ తనకు నట జీవితం ప్రసాదించిన ఎస్‌వి కృష్ణారెడ్డి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశారు.

ఎలా ఉండాలో నేర్పారు

అనంతరం నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ.. “ఎస్వీ కృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడితే నా తండ్రి గురించి మాట్లాడినట్లు ఉంటుంది. నాకు యాక్టింగ్ రాకున్నా వినోదం సినిమాలో అవకాశం ఇచ్చి ప్రోత్సహించారు. ఇండస్ట్రీలో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో నేర్పించారు” అని అన్నారు.

ఊహించని విధంగా మారింది

“అలా నటుడిగా కొనసాగిన నేను పవర్ స్టార్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారి వల్ల నిర్మాతను అయ్యాను. దాంతో నా జీవితం ఊహించని విధంగా మారిపోయింది”అని ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ తెలిపారు.

మా ఇంట్లో వేడుక ఉన్నా

ఇదే వేడుకలో నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ.. “ఎస్వీ కృష్ణారెడ్డి గారు పుట్టినరోజు మా అందరికీ పండుగ రోజు. మా ఇంట్లో ఇవాళ ఇంపార్టెంట్ వేడుక ఉన్నా ఇక్కడికి వచ్చాను. కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు ఈవెంట్‌లో పాల్గొనకపోతే తప్పుచేసిన భావం కలుగుతుంది. ఆయనతో మాకున్న అనుబంధం అలాంటిది. కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు రామలక్ష్మణుల లాంటి వారు” అని తెలిపారు.

ఒకదానితో మరొకటి సంబంధం లేకుండా

“ఎస్వీ కృష్ణా రెడ్డి ఎదుగుదలను చూసి ఎంతో గర్వపడిన వ్యక్తిని నేను. ఒకదానితో మరొకటి సంబంధం లేకుండా ఎన్నో గొప్ప చిత్రాల రూపొందించారు ఎస్వీ కృష్ణారెడ్డి. ఆ సినిమాల గురించి ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు మాట్లాడుకుంటారు. ఈ రోజు ఎస్వీ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది” అని నటుడు రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు.

ఎస్‌వీ కృష్ణారెడ్డి సినిమాలు

ఇదిలా ఉంటే, డైరెక్టర్ ఎస్‌వీ కృష్ణారెడ్డి కొబ్బరిబొండాం, రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, యమలీల, నంబర్ వన్, శుభలగ్నం, టాప్ హీరో, ఘటోత్కచుడు, వినోదం, వజ్రం, సంప్రదాయం, మావిచిగురు, ఎగిరే పావురమా వంటి అనేక సూపర్ హిట్ తెలుగు సినిమాలకు డైరెక్షన్ చేశారు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024