




Best Web Hosting Provider In India 2024

ఓటీటీలో అదరగొడుతున్న తెలుగు క్రైమ్ కామెడీ సినిమా.. ట్రెండింగ్‍లో ఫస్ట్ ప్లేస్.. నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
సారంగపాణి జాతకం సినిమా ఓటీటీలో అదరగొడుతోంది. థియేటర్లలో పెద్దగా సక్సెస్ కాలేకపోయినా.. డిజిటల్ వేదికపై సత్తాచాటుతోంది. ఈ మూవీ ట్రెండింగ్‍లో దూసుకొచ్చింది.
టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి హీరోగా నటించిన ‘సారంగపాణి జాతకం’ మంచి అంచనాలను నెలకొల్పింది. కోర్ట్ తర్వాత దర్శి నుంచి వచ్చిన మూవీ కావడం, ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించడంతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఏప్రిల్ 25న ఈ సారంగపాణి జాతకం చిత్రం థియేటర్లలో విడుదలైంది. అయితే, ఈ క్రైమ్ కామెడీ మూవీ మిక్స్డ్ టాక్ దక్కించుకొని.. ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది. ఇప్పుడు ఓటీటీలో మాత్రం ఈ చిత్రం అదరగొడుతోంది.
ట్రెండింగ్‍లో హవా
సారంగపాణి జాతకం మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో సినిమాల ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్‍కు దూసుకొచ్చింది. ఈ మూవీ మే 23వ తేదీన ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళంలోనూ ఈ చిత్రం ఎంట్రీ ఇచ్చింది.
సారంగపాణి జాతకం మూవీకి ప్రైమ్ వీడియోలో క్రమంగా వ్యూస్ పెరిగాయి. రెస్పాన్స్ కూడా బాగానే వచ్చింది. నాలుగు భాషల్లో రావడంతో వ్యూస్‍కు మరింత ప్లస్ అయింది. మొత్తంగా ఈ మూవీ ట్రెండింగ్‍లో అదరగొడుతోంది. ప్రస్తుతం (జూన్ 2) ప్రైమ్ వీడియోలో ఇండియా వైడ్ సినిమాల ట్రెండింగ్ లిస్టులో టాప్ ప్లేస్‍లో ఉంది. మరిన్ని రోజులు జోరు కొనసాగొచ్చు.
జాతకం నమ్మి హత్య చేసేందుకు..
క్రైమ్, కామెడీ ఎలిమెంట్లతో సారంగపాణి జాతకం చిత్రాన్ని డైరెక్టర్ ఇంద్రగంటి తెరకెక్కించారు. జాతకం ప్రకారం భవిష్యత్తులో హత్య చేస్తావని జ్యోతిషుడు చెప్పడంతో.. ఓ చెడు వ్యక్తిని చంపేందుకు సారంగపాణి (ప్రియదర్శి) ప్రయత్నాలు చేయడం చుట్టూ ఈ చిత్రం సాగుతుంది. ఈ మూవీలో ప్రియదర్శి సరసన రూప కొడవయూర్ హీరోయిన్‍గా నటించారు. వెన్నెల కిశోర్, శ్రీనివాస్ అవసరాల, తనికెళ్ల భరణి కీలకపాత్రలు పోషించారు.
సారంగపాణి జాతకం మూవీని శ్రీదేవీ మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ ప్రొడ్యూజ్ చేశారు. వివేక్ సాగర్ సంగీతం అందించగా.. పీజీ వింద సినిమాటోగ్రఫీ చేశారు.
సారంగపాణి జాతకం స్టోరీలైన్
సారంగపాణి (ప్రియదర్శి).. హైదరాబాద్‍లోని ఓ ఆటోమొబైల్స్ షోరూమ్‍లో సేల్స్‌మెన్‍గా పని చేస్తుంటాడు. జాతకాలను ఎక్కువగా నమ్ముతుంటాడు. తనకు కాబోయే బాస్ మైథిలి (రూపా కొడువాయూర్)తో అతడి ఎంగేజ్‍మెంట్ జరుగుతుంది. భవిష్యత్తులో కచ్చితంగా హత్య చేస్తావని సారంగపాణికి జ్యోతిషుడు జోగేశ్వర్ (శ్రీనివాస్ అవసరాల) చెబుతాడు. అది నిజమవుతుందని, మైథిలితో తన భవిష్యత్తు ఎలా అని సారంగపాణి కంగారు పడతాడు. ఎవరికీ బాధ కలిగించని విధంగా ఓ వ్యక్తిని చంపాలని అనుకుంటాడు. చెడు వ్యక్తిని చంపితే అది నేరం కాదని భావిస్తాడు. మర్డర్ ప్లాన్ చేస్తాడు. సారంగపాణి ఏం చేశాడు? జాతకం నిజమైందా? మైథిలికి ఈ విషయం తెలిసిందా? అనేవి సారంగపాణి జాతకం చిత్రంలో ఉంటాయి.
సంబంధిత కథనం