నెల రోజుల్లోనే ఓటీటీలోకి వస్తున్న సూపర్ హిట్ మలయాళం కామెడీ మూవీ.. ఐఎండీబీలో 7.6 రేటింగ్

Best Web Hosting Provider In India 2024

నెల రోజుల్లోనే ఓటీటీలోకి వస్తున్న సూపర్ హిట్ మలయాళం కామెడీ మూవీ.. ఐఎండీబీలో 7.6 రేటింగ్

Hari Prasad S HT Telugu

ఓటీటీలోకి ఓ మలయాళం సూపర్ నేచురల్ కామెడీ మూవీ స్ట్రీమింగ్ కు రాబోతోంది. గత నెలలో థియేటర్లలో రిలీజైన ఈ సూపర్ హిట్ సినిమాకు ఐఎండీబీలో 7.6 రేటింగ్ నమోదైంది. మరి ఆ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో చూడండి.

నెల రోజుల్లోనే ఓటీటీలోకి వస్తున్న సూపర్ హిట్ మలయాళం కామెడీ మూవీ.. ఐఎండీబీలో 7.6 రేటింగ్

మలయాళం ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది వచ్చిన మరో సూపర్ హిట్ సూపర్ నేచురల్ ఫ్యాంటసీ కామెడీ మూవీ పదక్కలమ్ (Padakkalam). ఈ మూవీ గత నెల 8న థియేటర్లలో రిలీజ్ కాగా.. మరో వారంలో ఓటీటీలోకి రాబోతోంది. సీనియర్ నటుడు సూరజ్ వెంజరమూడులాంటి వాళ్లు నటించిన ఈ సినిమాకు థియేటర్లలో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

పదక్కలమ్ ఓటీటీ రిలీజ్ డేట్

మలయాళం సూపర్ నేచురల్ ఫ్యాంటసీ కామెడీ మూవీ పదక్కలమ్ జూన్ 10 నుంచి జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ విషయాన్ని ఆ ఓటీటీ సోమవారం (జూన్ 2) వెల్లడించింది. ఐఎండీబీలో 7.6 రేటింగ్ సాధించిన ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.

“జూన్ 10 నుంచి జియోహాట్‌స్టార్ లో కామెడీ ఫైర్ వర్క్స్ పేలనున్నాయి” అనే క్యాప్షన్ తో మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని ఆ ఓటీటీ వెల్లడించింది. పదక్కలమ్ అంటే తెలుగులో పెన్సిల్ అని అర్థం. ఈ వెరైటీ టైటిల్ తో వచ్చిన సినిమాకు తొలి రోజు నుంచే పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. అయితే అప్పటికే థియేటర్లలో తుడరుమ్ లాంటి మూవీ కూడా ఆడుతుండటంతో ఊహించినంత హైప్ రాలేకపోయింది.

పదక్కలమ్ మూవీ గురించి..

పదక్కలమ్ మూవీ మే 8న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాను మను స్వరాజ్ డైరెక్ట్ చేశాడు. సూరజ్ వెంజరమూడుతోపాటు షరాఫుద్దీన్, సందీప్ ప్రదీప్ లాంటి వాళ్లు నటించారు. బాక్సాఫీస్ దగ్గర సుమారు రూ.13 కోట్ల వరకూ వసూలు చేయడం విశేషం. సూపర్ నేచురల్ ఫ్యాంటసీ కామెడీ జానర్లో తెరకెక్కింది. కామిక్ పుస్తకాలను బాగా ఇష్టపడే నలుగురు స్టూడెంట్స్ చుట్టూ తిరిగే స్టోరీ ఇది.

కొత్తగా వచ్చిన ప్రొఫెసర్ కొన్ని సూపర్ నేచురల్ ఈవెంట్స్ తో ఆ నలుగురి ప్రపంచాన్ని తలకిందులు చేస్తాడు. ఈ మూవీలోని ప్రతి సీన్ మొదటి నుంచి చివరి వరకూ బాగా నవ్వించిందని, ఎక్కడా బోర్ కొట్టదని కొందరు ప్రేక్షకులు కామెంట్స్ చేశారు. కేవలం రెండు గంటల నిడివితో ఉన్న ఈ సినిమాకు ఓటీటీలో మరింత మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాను జూన్ 10 నుంచి జియోహాట్‌స్టార్ ఓటీటీలో చూడొచ్చు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024