గుకేష్ సంచలనం.. ప్రపంచ నంబర్ వన్ పై అదిరే విజయం.. కోపంతో టేబుల్ ను కొట్టిన కార్ల్ సన్.. వీడియో వైరల్

Best Web Hosting Provider In India 2024


గుకేష్ సంచలనం.. ప్రపంచ నంబర్ వన్ పై అదిరే విజయం.. కోపంతో టేబుల్ ను కొట్టిన కార్ల్ సన్.. వీడియో వైరల్

ప్రపంచ చెస్ ఛాంపియన్, భారత యువ సంచలనం దొమ్మరాజు గుకేశ్ సత్తాచాటాడు. ప్రపంచ మేటి ఆటగాడు కార్ల్ సన్ ను ఓడించాడు. ఊహించని ఈ ఓటమితో తీవ్ర ఆగ్రహానికి లోనైన కార్ల్ సన్ టేబుల్ ను బలంగా కొట్టాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

టేబుల్ ను కొడుతున్న గుకేష్ (Twitter)

నార్వే చెస్ 2025లో ప్రపంచ ఛాంపియన్ దొమ్మరాజు గుకేష సంచలన విజయం సాధించాడు. ప్రపంచ నంబర్ వన్, మేటి ఆటగాడు మాగ్నస్ కార్ల్ సన్ ను ఓడించాడు. ఎండ్ గేమ్ లో అద్భుతంగా పుంజుకున్న గుకేష్.. ప్రత్యర్థి తప్పిదాన్ని సద్వినియోగం చేసుకుని కార్ల్ సన్ పై తొలి క్లాసికల్ విజయాన్ని నమోదు చేశాడు.

షాకింగ్ వీడియో

క్లాసికల్ ఫార్మాట్లో కార్ల్ సన్ పై ఫస్ట్ విక్టరీని అందుకుంటూ గుకేష్ గెలిచిన శైలిని అభిమానులు, నిపుణులు ‘టర్నరౌండ్ ఆఫ్ ది ఇయర్’ అని పిలుస్తున్నారు. ఈ విజయంతో కార్ల్ సన్ కూడా అంతే ఉలిక్కిపడి కోపంతో టేబుల్ ను కొట్టాడు. ఈ వీడియో ఆన్ లైన్ లో వైరల్ కావడంతో కామెంటేటర్లు, అభిమానులు షాక్ కు గురయ్యారు. కార్ల్ సన్ టేబుల్ కొట్టిన తర్వాత, అతను గుకేష్ తో కరచాలనం చేశాడు.

నమ్మశక్యం కాని విజయం

కార్ల్ సన్ పై గెలుపు తర్వాత గుకేష్ కూడా నమ్మశక్యంగానే చూశాడు. కార్ల్ సన్ పై మొదటి క్లాసికల్ విజయాన్ని సాధించినందుకు షాక్ అయ్యాడు. ఈ భారత యువ గ్రాండ్ మాస్టర్ అయోమయంగా చూస్తూ లేచి నిలబడ్డాడు. ఆ తర్వాత కార్ల్ సన్ తిరిగి వస్తూ గుకేష్ వీపుపై తట్టి వెళ్లిపోయాడు.

తొలిరౌండ్ లో కార్ల్ సన్ చేతిలో ఓటమి పాలైన గుకేష్ కు ఇది సరైన ప్రతీకారం. గుకేష్ 8.5 పాయింట్లతో మూడో స్థానానికి ఎగబాకి కార్ల్ సన్, ఫాబియానో కరువానా కంటే కేవలం ఒక పాయింట్ వెనుకబడి ఉన్నాడు. కార్ల్ సన్ చేతిలో తొలిరౌండ్ లో ఓటమి పాలైన గుకేష్ మంచి ఫామ్ లో కనిపించడం లేదు. అయితే ఆదివారం (జూన్ 1) జరిగిన మ్యాచ్ లో 62 మూవ్స్ లో.. నాలుగు గంటలకు పైగా శ్రమించి కార్ల్ సన్ పై విజయం సాధించాడు.

ప్రశంసలు

గుకేష్ విజయం తర్వాత అతని కోచ్ గ్రెజెగోర్జ్ గాజెవ్స్కీ మాట్లాడుతూ టీనేజ్ సంచలనంపై ప్రశంసలు కురిపించాడు.”ఇది (విజయం) గుకేష్ కు భారీ ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఎందుకంటే మీరు ఒకసారి సాధించిన దాన్ని మళ్లీ మళ్లీ అందుకోగలరని మీకు తెలుసు. అదే ప్లాన్’’ అని కోచ్ పేర్కొన్నాడు.

‘ టోర్నమెంట్ (నార్వే చెస్)లో ఇది (గుకేష్) ఒక బంప్ ఇస్తుంది. మరో తిరుగులేని మార్జిన్ ను బద్దలు కొట్టగలమని ఆశిస్తున్నాం. పర్ఫెక్ట్’ అని కోచ్ తెలిపాడు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం


Best Web Hosting Provider In India 2024


Source link