రెండో ఓటీటీలో దుమ్ముదులుపుతున్న తెలుగు హారర్ కామెడీ మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్.. టాప్ 3లో ట్రెండింగ్!

Best Web Hosting Provider In India 2024

రెండో ఓటీటీలో దుమ్ముదులుపుతున్న తెలుగు హారర్ కామెడీ మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్.. టాప్ 3లో ట్రెండింగ్!

Sanjiv Kumar HT Telugu

ఓటీటీలో దుమ్ముదులుపుతోంది తెలుగు హారర్ కామెడీ మూవీ టుక్ టుక్. ఇటీవల రెండో ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చేసిన టుక్ టుక్ మూవీ ఏకంగా 100 మిలియిన్ స్ట్రీమింగ్ మినిట్స్ దక్కించుకుంది. అంతేకాకుండా ఓటీటీ ట్రెండింగ్‌లో టాప్ 3 స్థానంలో దూసుకుపోతోంది టుక్ టుక్. మరి టుక్ టుక్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో చూద్దాం.

రెండో ఓటీటీలో దుమ్ముదులుపుతున్న తెలుగు హారర్ కామెడీ మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్.. టాప్ 3లో ట్రెండింగ్!

థియేటర్లలో సినిమాలకు ఎలాంటి రెస్పాన్స్ ఉన్నా ఓటీటీల్లో మాత్రం అదిరిపోయే ఆదరణ ఉంటుంది. థియేటర్లలో మంచి ఆదరణకు గురి కాని ఎన్నో సినిమాలను ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో మాత్రం హిట్ చేస్తుంటారు ఆడియెన్స్. ఇక చిన్న సినిమాలు ఎంతో ప్రభావం చూపించిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి.

ఆశించిన స్థాయిలో

అలాంటి వాటిలోకి మరో చిన్న సినిమా చేరింది. ఆ మూవీనే టుక్ టుక్. తెలుగులో హారర్ కామెడీ మూవీగా వచ్చింది ఈ సినిమా. మార్చి 21న థియేటర్లలో విడుదలైన టుక్ టుక్ సినిమాకు రెస్పాన్స్ పర్వాలేదనిపించుకుంది.అయితే, కాన్సెప్ట్ బాగున్నప్పటికీ పలు కారణాల వల్ల ఆశించిన స్థాయిలో టుక్ టుక్ సరైన ఫలితాన్ని అందుకోలేకపోయింది.

ఇక థియేట్రికల్ రిలీజ్‌ అయిన 20 రోజులకే ఓటీటీలోకి వచ్చేసింది టుక్ టుక్. ఏప్రిల్ 10 నుంచి ఈటీవీ విన్‌లో టుక్ టుక్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఈటీవీ విన్ ఓటీటీలో టుక్ టుక్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్ని రోజులకే మరో ఓటీటీలోకి సైతం టుక్ టుక్ వచ్చేసింది.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో

అమెజాన్ ప్రైమ్ వీడియోలో టుక్ టుక్ ఓటీటీ రిలీజ్ అయింది. ఇటీవలే అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ స్ట్రీమింగ్‌‌కు వచ్చిన టుక్ టుక్ దుమ్ము దులుపుతోంది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ట్రెండింగ్‌లో నెంబర్ మూడో స్థానం సంపాదించి ఆశ్చర్యం కలిగించింది. అంతే కాకుండా ఇప్పటి వరకు టుక్ టుక్ మూవీని అమెజాన్ ప్రైమ్‌లో 100 మిలియన్‌కు పైగా వ్యూస్‌ వచ్చినట్టు సమాచారం.

ఇలా రెండో ఓటీటీలో దంచికొడుతోన్న టుక్ టుక్ 100 మిలియిన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ వ్యూస్ సాధించడంపై మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది చిన్న సినిమాకు పెద్ద గౌరవం అంటూ తెలిపారు. వీక్షకులు ఈ సినిమాను అంతగా ఆదరించడమే కాకుండా, ప్రతి క్యారెక్టరును, ప్రతి నటుడి నటనను ప్రశంసిస్తున్నారు.

ప్రతి ఒక్కరికి గుర్తింపు

కథకు న్యాయం చేసిన డైరెక్షన్, నాటకీయతతో పాటు హ్యూమర్‌ను సమపాళ్లలో మేళవించిన స్క్రీన్‌ప్లే, అద్భుతమైన సంగీతం ఇలా ప్రతీ అంశం సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమా ద్వారా నటించిన ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు వచ్చింది.

ముఖ్యంగా, యువతర నటీనటులు తమ పాత్రల ద్వారా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. కొంతమంది నటులు తమ డైలాగ్ డెలివరీతో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు. టుక్ టుక్ సినిమాలో పెద్ద స్టార్ క్యాస్ట్ లేదు. భారీ బడ్జెట్ లేదు. కానీ, స్నేహితుల కృషి, కొత్త దృక్పథం, మనసుకు హత్తుకునే కథ, ప్రేక్షకుల హృదయాలను తాకింది.

టుక్ టుక్ నటీనటులు

మంచి కంటెంట్‌కు ఎప్పుడూ ఆదరణ ఉంటుందనే విషయాన్ని టుక్ టుక్ మరోసారి నిరూపించింది. కాగా హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, సాన్వీ మేఘన, నిహాల్ కోధాటి ప్రధాన పాత్రలు పోషించిన టుక్ టుక్ సినిమాకు సి. సుప్రీత్‌ కృష్ణ దర్శకత్వం వహించారు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024