ఓటీటీలోకి 15 రోజుల్లోనే వస్తున్న సూపర్ హిట్ రొమాంటిక్ కామెడీ మూవీ.. ఇంకా థియేటర్లలో ఉండగానే..

Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి 15 రోజుల్లోనే వస్తున్న సూపర్ హిట్ రొమాంటిక్ కామెడీ మూవీ.. ఇంకా థియేటర్లలో ఉండగానే..

Hari Prasad S HT Telugu

ఓటీటీలోకి ఓ సూపర్ హిట్ రొమాంటిక్ కామెడీ మూవీ 15 రోజుల్లోనే వస్తోంది. బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ అయినా కూడా ఇంకా థియేటర్లలో ఉండగానే మూవీని డిజిటల్ ప్రీమియర్ చేస్తుండటం విశేషం. నిజానికి మొదట నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయాలనుకున్న సినిమా ఇది.

ఓటీటీలోకి 15 రోజుల్లోనే వస్తున్న సూపర్ హిట్ రొమాంటిక్ కామెడీ మూవీ.. ఇంకా థియేటర్లలో ఉండగానే..

థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాత చాలా వరకు సినిమాలు ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి. అప్పుడప్పుడు కొన్ని సినిమాలు 20 రోజుల్లోనే వస్తున్నాయి. అయితే ఇప్పుడో రొమాంటిక్ కామెడీ మాత్రం 15 రోజుల్లోనే వస్తుండటం విశేషం. నిజానికి మొదట్లో నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేద్దామనుకున్న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకువచ్చారు. బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ కూడా సాధించింది.

భూల్ చుక్ మాఫ్ ఓటీటీ రిలీజ్ డేట్

రొమాంటిక్ కామెడీ మూవీ భూల్ చుక్ మాఫ్ (Bhool Chuk Maaf) మే 23న థియేటర్లలో రిలీజైన విషయం తెలిసిందే. రాజ్ కుమార్ రావ్, వామికా గబ్బి నటించిన ఈ సినిమా జూన్ 6 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి రానుంది. అంటే కేవలం రెండు వారాల్లోనే వస్తోంది.

ఇప్పటికీ ఇంకా థియేటర్లలో ఆడుతోంది. అంతేకాదు బాక్సాఫీస్ దగ్గర రూ.75 కోట్లకుపైగా వసూలు చేసింది. అయినా మేకర్స్ మాత్రం మూవీని ఓటీటీ రిలీజ్ చేస్తుండటం విశేషం. ఇప్పటికే ఈ మూవీ లాభాల్లోకి దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో ఓటీటీలో ఈ భూల్ చుక్ మాఫీ మూవీకి మరింత మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

భూల్ చుక్ మాఫ్ స్టోరీ ఏంటంటే?

బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావ్, వామికా గబ్బి లీడ్ రోల్స్ లో నటించిన సినిమా ఈ భూల్ చుక్ మాఫ్. అంటే నా తప్పులను మన్నించు అని అర్థం. ఓ చిన్న పట్టణం నుంచి వచ్చిన యువకుడి పాత్రలో ఇప్పటికే రాజ్ కుమార్ రావ్ ఎన్నో సినిమాలు చేశాడు. ఈ భూల్ చుక్ మాఫ్ కూడా అలాంటిదే. వారణాసిలోనే స్టోరీ మొత్తం జరుగుతుంది.

రంజన్ అనే పాత్రలో అతడు కనిపించాడు. అతడు టిట్లీ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతాడు. కానీ శివుడికి ఇచ్చిన మొక్కును అతడు మరచిపోతాడు. దీంతో టైమ్ లూప్ లో చిక్కుకొని.. పెళ్లికి ముందు జరిగే హల్దీ వేడుకకే పరిమితమవుతాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతడు ఏం చేశాడన్నదే ఈ భూల్ చుక్ మాఫ్ సినిమా స్టోరీ. కామెడీని ఎంజాయ్ చేసే వారికి ఇదో మంచి టైంపాస్ మూవీ. జూన్ 6 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024