కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ జూన్ 3: దీక్ష చేస్తా: రచ్చ చేసిన శ్రీధర్.. చిరాకు తెప్పించిన కార్తీక్, దీప.. జ్యోకు అనుమానం

Best Web Hosting Provider In India 2024

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ జూన్ 3: దీక్ష చేస్తా: రచ్చ చేసిన శ్రీధర్.. చిరాకు తెప్పించిన కార్తీక్, దీప.. జ్యోకు అనుమానం

కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్ జూన్ 3: శివన్నారాయణ ఇంటికి వచ్చి గొడవ పెట్టుకుంటాడు శ్రీధర్. మర్యాదతో దీప చిరాకు పెట్టేస్తుంది. కార్తీక్ కూడా కౌంటర్లు వేస్తాడు. జ్యోత్స్న సతమతమవుతుంది. జ్యోకు డౌట్ బలపడుతుంది. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.

 
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ జూన్ 3: దీక్ష చేస్తా: రచ్చ చేసిన శ్రీధర్.. చిరాకు తెప్పించిన కార్తీక్, దీప
 

కార్తీక దీపం 2 నేటి (జూన్ 3,2025) ఎపిసోడ్‍లో.. జ్యోత్స్న కాఫీ తాగుతుండగా.. ఇల్లు క్లీన్ చేస్తూ ఉంటుంది దీప. జ్యో చూస్తుంటే ఏమైనా కావాలా అని దీప అడుగుతుంది. చెప్పినవన్నీ తీసుకొచ్చా.. పచ్చిరొయ్యలు, గోంగూర అదిరిపోయే కాంబినేషన్ అని హుషారుగా దీపతో చెబుతాడు కార్తీక్. వీళ్లు పని చేయడానికి వచ్చినట్టు లేదే, పిక్నిక్‍కు వచ్చినట్టు ఉందని పారిజాతం అంటుంది. నువ్వు కూడా పని చేయవచ్చు కదా అంటూ పారు వెటకారంగా కౌంటర్లు వేస్తాడు కార్తీక్.

 

‘నువ్వు దున్నపోతా’

పెళ్లాం పొగరుబోతు, వీడి వదరుబోతు అంటూ దీప, కార్తీక్‍ను పారిజాతం అంటుంది. మరి నువ్వు దున్నపోతా అని కార్తీక్ అంటాడు. చూశావా వాడు నన్ను ఎంత మాట అన్నాడో జ్యోత్స్నకు పారిజాతం చెబుతుంది. జ్యో చిరాకు పడుతుంది. కార్తీక్ తన మాటలతో మరింత చిరాకు తెప్పిస్తాడు. సినిమా టికెట్స్ బుక్ చేయించనా అంటాడు. కొత్తగా ఏ సినిమాలు ఉన్నాయని పారిజాతం అడిగితే.. కొడితే దిమ్మ తిరిగిపోద్ది అని కార్తీక్ అంటాడు. పారు భయపడుతుంది. అదే సినిమా పేరు అని కార్తీక్ చెబుతాడు. స్టోరీ సూపర్‌గా ఉంటుందని అంటాడు.

రివీల్ చేసే ట్విస్టులతో చెమటలే

విలన్లు కలిసి హీరోహీరోయిన్‍ను వేసేద్దామని అనుకుంటారు, చివర్లో హీరోహీరోయిన్లే కలిసి విలన్లను లేపేస్తారు అని కార్తీక్ అంటాడు. ఇదేదో మనకు కనెక్ట్ అవుతోందని జ్యో కంగారు పడుతుంది. ఇదే కథ చాలా సినిమాల్లో ఉంటుందని కదా అని పారు అంటే.. స్క్రీన్‍ప్లే, ట్విస్టులు అదిరిపోతాయని కార్తీక్ కౌంటర్ వేస్తాడు. హీరో రివీల్ చేసే ట్విస్టులకు విలన్లకు చెమటలే అని చెబుతాడు. సినిమాను అడ్డం పెట్టుకొని తన గురించే చెబుతున్నాడా అన్నట్టుగా జ్యో కంగారు పడుతుంది. ఏదో ఒక రోజు మీకు స్పెషల్ షో ఉంటుందని కార్తీక్ అంటే.. పారిజాతం వెళదామా అంటుంది. జ్యో చిరాకు పడుతుంది.

 

టీపాయ్ క్లీన్ చేసిన కార్తీక్.. శ్రీధర్ ఎంట్రీ

టీపాయ్ మీద మరకలు పోవడం లేదని దీప అంటుంది. అవి జిడ్డు మరకలు అని కార్తీక్ అంటాడు. వాడు మనల్నే అంటున్నాడని పారిజాతం అంటుంది. మొత్తంగా కార్తీక్, దీప తమ మాటలతో జ్యోత్స్న, పారును చిరాకు పెట్టడం కంటిన్యూ చేస్తారు. ఇంతలో శ్రీధర్ వస్తాడు. టీపాయ్‍ను కార్తీక్ క్లీన్ చేయడం చూసి.. ఆపరా అని అరుస్తాడు.

శివన్నారాయణ ఇంట్లో శ్రీధర్ గొడవ

మహారాజ శ్రీధర్ ముద్దుల కొడుకు.. శివన్నారాయణ ఇంట్లో టీపాయ్ తుడవడమా అని శ్రీధర్ అంటాడు. నీ ముద్దుల కొడుకు ఇప్పుడు నీ ఇంట్లో డ్రైవర్, నీ కోడలు ఈ ఇంట్లో పని మనిషి అని పారిజాతం అంటుంది. చూడు జ్యోత్స్న నువ్వు నా మేనకోడలివి.. వీడి నీ బావ అని జ్యోత్స్నతో శ్రీధర్ అంటాడు. అగ్రిమెంట్‍కు వరసలు వర్తించవని జ్యో అంటుంది. శ్రీధర్ గొప్పలు చెప్పుకుంటాడు.

ఇంతకు ముందు కొట్టించాం కదా..

శివన్నారాయణను అరుస్తూ పిలుస్తాడు శ్రీధర్. సుమిత్ర, దశరథ్ పిలిస్తే కోపంగా అరుస్తాడు శ్రీధర్. ఎందుకొచ్చావని శివన్నారాయణ అడుగుతాడు. నా కొడుకు కోసం వచ్చానని శ్రీధర్ అంటాడు. నా కోసం రానక్కర్లేదు అని కార్తీక్ అంటాడు. మిస్టర్ శివన్నారాయణ అని శ్రీధర్ అరిస్తే.. ఏయ్ అంటూ శివన్నారాయణ ఆగ్రహిస్తాడు. ఇంతకు ముందు కొట్టించాం కదా అంటాడు. నేను ఈ ఇంటి ఇల్లుడిగా రాలేదు అని శ్రీధర్ అంటే.. మా ఇద్దరి తరఫున వచ్చానని మాత్రం చెప్పొద్దని కార్తీక్ అంటాడు.

 

కుట్ర పన్నారు

నా కొడుకుతో బలవంతంగా అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించుకొని ఇంటి పనులు చేయిస్తారా, టీపాయ్ క్లీన్ చేసేందుకా లండన్‍లో చదువుకుందని శ్రీధర్ కోపంగా అంటాడు. ఏంటి నీ గోల అని కార్తీక్ చెబుతాడు. కుట్ర పన్నారని శ్రీధర్ అంటే.. ఇష్టప్రకారమే అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాడని జ్యో అంటుంది. ఇంతలో టీ తాగుతారా అని అడిగి శ్రీధర్‌కు చిరాకు తెప్పిస్తుంది దీప. ఇక్కడ ఏం జరుగుతుందో తెలిసే అడుగుతున్నావా అని అంటాడు.

ఆమరణ నిరాహార దీక్ష చేస్తా

అగ్రిమెంట్‍ను క్యాన్సిల్ చేసి కార్తీక్‍ను పంపకపోతే నట్టింట్లోనే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని శ్రీధర్ అంటాడు. ఇంట్లో కూర్చుంటాడు. అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తే రూ.10కోట్లు ఇవ్వాలని జ్యో అంటుంది. అవన్నీ కుదరవని కార్తీక్‍ను తనతో పంపాలని అంటాడు. తాను ఇవన్నీ ఇష్టపడే చేస్తున్నానని కార్తీక్ చెబుతాడు. టీ, కాఫీ, మజ్జిగ తాగుతారా అని మాటిమాటికీ అడుగుతూ శ్రీధర్‌కు చికాకు తెప్పిస్తుంది దీప.

న్యూసెన్స్ కేస్ పెడదాం

ఎస్‍ఐకి కాల్ చేసి వీడిపై న్యూసెన్స్ కేసు పడదాం అని శివన్నారాయణ అంటాడు. లాఠీలతో కొట్టించినా.. ఉరికంభం ఎక్కించినా అంటూ ఓవర్‌గా మాట్లాడతాడు శ్రీధర్. అంత ఊహించుకోకండి అని కార్తీక్ చెబుతాడు. తినడానికి ఏమైనా తీసుకురావాలా శ్రీధర్‌ను దీప అడుగుతుంది. ఇదెక్కడి మర్యాదరా బాబు అని శ్రీధర్‌ అంటాడు. ముందు వాడిని గెంటేస్తావా లేదా అని కార్తీక్‍కు శివన్నారాయణ అంటాడు.

 

కార్తీక్ మాటకు శ్రీధర్ బెంబేలు

నేను మా పిన్నికి, చెల్లికి ఫోన్ చేసి దీపను, నన్ను టార్చర్ పెడుతున్నావని చెబుతానని కార్తీక్ అంటాడు. దీంతో వాళ్లకు ఎందుకురా అని శ్రీధర్ బెంబేలెత్తుతాడు. వాళ్లు వచ్చాక ఏం జరుగుతుందో నీకు తెలుసు అని కార్తీక్ అంటాడు. ఇంత మర్యాదగా చెబితే ఎవరైనా వింటారని శ్రీధర్ అంటాడు. మళ్లీ వస్తానని చెబుతాడు. ఏవండి.. ఏదైనా తాగి వెళ్లండి అని దీప అంటే.. నీ మర్యాద పాడుగాను అంటూ శ్రీధర్ చిరాకు పడతాడు. అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

సారీ చెప్పట్లేదుగా..

‘మా నాన్న తరఫున మీ అందరికీ సారీ’.. చెప్పట్లేదుగా అని కార్తీక్ సరదాగా అంటాడు. ఎందుకంటే ఆయనకు, నాకు సంబంధం లేదు కదా అని చెబుతాడు. గోంగూర మటన్‍లో ఇంగువ వేస్తే ఎలా ఉంటుంది అనుకుంటూ కార్తీక్, దీప వెళతారు. మంచి మంచి వాళ్లంతా మన బంధువులే అయినట్టు ఉన్నారని శివన్నారాయణ చిరాకు పడతాడు.

జ్యో బలపడిన అనుమానం

కార్తీక్ ఇంత జాలీగా ఉండడంపై జ్యోత్స్నలో అనుమానం బలపడుతుంది. “బావ కొంచెం కూడా బాధ లేకుండా.. దాసు గురించి పట్టించుకోకుండా ఇంత జాలిగా ఉంటున్నాడంటే ఏదో జరుగుతోంది. బావ మైండ్‍లో ఏదో పెద్ద ప్లానే ఉంది. దాన్ని ఎలా తెలుసుకోవాలి” అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న.

 

మీ అత్తారింట్లో ఏమీ పెట్టలేదా

కాశీ, స్వప్నను ఇంటికి పిలిచి భోజనం వడ్డిస్తుంటుంది కావేరి. ఇంతలో శ్రీధర్ వస్తాడు. ఇంతలో శ్రీధర్ ఇంటికి వస్తాడు. నా పర్మిషన్ లేకుండా ఎందుకు పిలిచావని చెబుతాడు. నా కూతురుని లేపుకెళ్లి దొంగచాటుగా పెళ్లి చేసుకున్నాడు.. వీడికి మర్యాద ఇవ్వాలా అని కాశీని కించపరిచేలా శ్రీధర్ మాట్లాడతాడు. దీంతో స్వప్న ఆగ్రహిస్తుంది. ఆకలేస్తోంది భోజనం పెట్టు అని శ్రీధర్ అడుగుతాడు. మీ అత్తారింట్లో ఏమీ పెట్టలేదా కావేరి అడుగుతుంది. అక్కడికి వెళ్లినట్టు ఎవరు చెప్పారని శ్రీధర్ అడుగుతాడు. అన్నయ్య చెప్పాడని స్వప్న అంటుంది. తనకు ఎక్కడా మర్యాద లేదని శ్రీధర్ అంటాడు. తాను మళ్లీ అక్కడికి వెళతానని చెబుతాడు. దీంతో కార్తీక దీపం 2 నేటి (జూన్ 3) ఎపిసోడ్ ముగిసింది.

 

Best Web Hosting Provider In India 2024