Best Web Hosting Provider In India 2024

గుండెనిండా గుడిగంటలు టుడే ఎపిసోడ్: పోలీసుల ముందు బాలును ఇరికించిన మీనా – గుణ రివేంజ్ – ప్రభావతికి శృతి స్ట్రోక్
గుండె నిండా గుడి గంటలు జూన్ 3 ఎపిసోడ్‌లో మినిస్టర్ ఆర్డర్‌ను అడ్డం పెట్టుకొని బాలును ఆట ఆడుకుంటుంది మీనా. పోలీసుల ముందు బాలు తన భర్త కాదని చెప్పి ఇరికిస్తుంది. మరోవైపు శృతి, రవి ఎప్పుడు గొడవపడుతూనే కనిపించడంతో ప్రభావతి కంగారు పడుతుంది.
ప్రభావతికి రోహిణి ఫేస్‌ప్యాక్ చేస్తుంది. రాత్రి ఇంట్లో కరెంట్ పోవడంతో అందరూ బయటకు వస్తారు. చీకట్లో ప్రభావతిని చూసి దయ్యమనుకొని జడుసుకుంటారు. దయ్యం కాదని అత్తయ్య అని మీనా సెటైర్లు వేస్తుంది. శృతి .ఎవరో ఏసీ స్విఛ్ ఆన్ ఆఫ్ చేయడంతో ఫ్యూజు పోయిందని బాలు కోప్పడుతాడు. మీలో ఎవరు ఆ ఎదవ పనిచేసిందని బాలు అడుగుతాడు. నేను కాదని తప్పించుకుంటుంది శృతి.
రవితో శృతి గొడవ…
రూమ్‌లోకి వచ్చిన తర్వాత డోర్ వేసే విషయంలో శృతి, రవి గొడవపడతారు. నేనేం పనిమనిషినా…నాపై ఆర్డర్స్ వేస్తున్నావని రవితో అంటుంది శృతి. మీ అమ్మలాగే నీది పెద్ద నోరు అంటూ రవిపై పంచ్‌లు వేస్తుంది. మీనా ఎంత పనిచేసిన మీ అమ్మ టార్చర్ పెడుతూనే ఉంటుందని, అవే బుద్దులు నీకు వచ్చాయని అంటుంది.
వారి గొడవను ప్రభావతి వింటుంది. వాళ్లు వాళ్లు గొడవపడకుండా తనను మధ్యలోకి లాగడమేంటి అని తల పట్టుకుంటుంది. ఇద్దరి మాటలు వినలేక చెవులు మూసుకుంటుంది ప్రభావతి. ఇలాగే గొడవలు పడితే శృతి పుట్టింటికి వెళ్లిపోతుందని కంగారు పడుతుంది.
బాలును చంపేస్తా…
బాలు తన మెడపై కత్తి పెట్టి బెదిరించడం సంజు సహించలేకపోతాడు. బాలు నా కాళ్ల మీద పడాలని అనుకున్ప ప్రతిసారి వాడే గెలుస్తున్నాడని, బాలును చంపాలని అనిపిస్తుందని అంటాడు. వాళ్లను చంపడం కాదు…వీడు పెట్టిన టార్చర్‌కు మౌనిక ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే మనం జైలులో ఉండేవాళ్లం అని సువర్ణ అంటుంది.. ప్రస్టేషన్‌లో ఉన్నాం.
నువ్వు నోరు మూసుకొని పోతే నీకు, మాకు మంచిది అని భార్యకు వార్నింగ్ ఇస్తాడు నీలకంఠం. ఈ సారి మనపై డౌట్ రాకుండా మౌనికను పుట్టింటికి పంపించేయమని, బాలుపై రివేంజ్ తీర్చుకోమని కొడుకుకు సలహా ఇస్తాడు. మినిస్టర్ కూతురితో నీ పెళ్లి జరిపిస్తానని సంజుతో అంటాడు నీలకంఠం.
జైలుకు పంపిస్తా…
ఆర్డర్ సరైన టీమ్‌లో ఇవ్వకపోతే జైలుకు పంపిస్తానని మినిస్టర్‌కు బాలు ఇచ్చిన వార్నింగ్‌ను అడ్డుపెట్టుకొని అతడిని ఆడుకుంటుంది మీనా. నీకు ఇంత పెద్ద ఆర్డర్ ఇప్పించిన కృతజ్ఞత కొంచెం కూడా లేదని బాలు అంటాడు. ఇదిగో మీరు ఇచ్చిన అడ్వాన్…
మీ ఆర్డర్ వద్దని అతడు ఇచ్చిన డబ్బులు తిరిగిచ్చేస్తుంది మీనా. మినిస్టర్ ఇచ్చిన వార్నింగ్ గుర్తుచేసుకొని కాళ్లబేరానికి వస్తాడు బాలు. ఇక నుంచి మాటలు అంటే పడనని బాలుతో అంటుంది మీనా. మీనాను మేడమ్ అని పిలుస్తాడు బాలు. మీనా కూడా బాలును ఆటో డ్రైవర్ అంటూ పిలుస్తుంది. బాలు చేత పూలు మోయిస్తుంది. కావాలంటే యాభై రూపాయలు ఎక్కువగా ఇస్తానని అంటుంది.
నా భర్త కాదు…
మార్కెట్‌లో పార్క్ చేసిన బాలు ఆటోను పోలీసులు పట్టుకుంటారు. నో పార్కింగ్‌లో పెట్టినందుకు ఐదు వందలు ఫైన్ వేస్తారు. నా భార్య పూలు కొనడానికి వెళ్లిందని, పూలు మోయడం ఇబ్బంది అవుతుందని ఇక్కడ పార్క్ చేశానని మీనాను చూపిస్తూ పోలీసుకు చెబుతాడు బాలు. ఈ ఆటో డ్రైవర్ మీ ఆయన అని మీనాను పోలీస్ ఆఫీసర్ అడుగతాడు.
అతడు మా అయన కాదని, ఆటో డ్రైవర్ మాత్రమేనని బాలును ఇరికిస్తుంది. ఐదు వందలు ఫైన్ కట్టాల్సిందేనని ఆర్డర్ వేస్తాడు పోలీస్. బాలు, మీనా భార్యభర్తలు అని బయటపడటంతో బాలుపై జాలితో పోలీస్ అతడిని వదిలేసి వెళతాడు.
ప్రభావతి తడబాటు..
శృతి డబ్బింగ్‌కు, రవి రెస్టారెంట్‌కు బయలుదేరుతారు. రెడీ అయ్యే విషయంలో నేను ముందు అంటే నేను ముందు గొడవపడతారు. వారిని చూసి ప్రభావతి ఆలోచనలో పడుతుంది. డబ్బింగ్ చెప్పడానికి వెళుతున్న శృతిని ఆపుతుంది. గొడవ గురించి అడుగుతుంది.
శృతిని ఏమని అడగాలో తెలియక ప్రభావతి తబబడుతుంది. ఓ మై గాడ్ మీకు స్ట్రోక్ వచ్చిందా? అందుకే మాట తడబడుతుందా అని శృతి అంటుంది. అదేం లేదని తాను గుండ్రాయిలా ఉన్నానని ప్రభావతి బదులిస్తుంది.
సరదా…
రవితో జరిగిన గొడవను గురించి శృతిని అడుగుతుంది. మీ మధ్య ఏ సమస్య ఉన్న మాకు చెప్పమని, మేము సాల్వ్ చేస్తావని అంటుంది. అవి గొడవలు కాదని, ఫన్ గేమ్స్ అని శృతి బదులిస్తుంది. రవి కూడా మేము సరదాగానే గొడవలు పడతామని అంటుంది. ఏ గొడవ జరగనట్లు ఇద్దరు కలిసిపోయి కనిపించడంతో ప్రభావతి షాకవుతుంది.
గొడవలు ఇలా కూడా ఉంటాయా అని తలపట్టుకుంటుంది ప్రభావతి. బాలు, మీనాపై రివేంజ్ తీర్చుకోవాలని అనుకుంటాడు గుణ. మీనా కట్టిన పూల దండలు కొట్టేసి ఇద్దరిని ఇరికించాలని అనుకుంటాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.