నిన్ను కోరి టుడే ఎపిసోడ్ జూన్ 3: చంద్రకళను పొగిడిన శ్యామల.. నిజం దాచాలన్న జగదీశ్వరి.. విరాట్‍ను కౌగిలించుకున్న చంద్ర

Best Web Hosting Provider In India 2024

నిన్ను కోరి టుడే ఎపిసోడ్ జూన్ 3: చంద్రకళను పొగిడిన శ్యామల.. నిజం దాచాలన్న జగదీశ్వరి.. విరాట్‍ను కౌగిలించుకున్న చంద్ర

నిన్ను కోరి సిరీయల్ నేటి ఎపిసోడ్ జూన్ 3: చంద్రకళను శ్యామల పొగిడేస్తుంది. శాలినీ, శృతి, కామాక్షిని మాటలతో ఓ ఆటాడుకుంటుంది. విరాట్ పెళ్లి ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో శ్యామలకు తెలియకూడదని జగదీశ్వరి గట్టిగా చెబుతుంది. ఏం జరిగిందో ఇక్కడ తెలుసుకోండి.

 
నిన్ను కోరి టుడే ఎపిసోడ్ జూన్ 3: చంద్రకళను పొగిడిన శ్యామల.. నిజం దాచాలన్న జగదీశ్వరి
 

నిన్ను కోరి సీరియల్ నేటి (జూన్ 3) ఎపిసోడ్‍లో పెద్దోడి పెళ్లికి కూడా నన్ను పిలవలేదు కదా అని బాధగా జగదీశ్వరిని అడుగుతుంది భీమవరం శ్యామల. మమ్మల్నే పిలవలేదని వెటకారంగా అంటుంది కామాక్షి. నేను వచ్చా కదా.. మా అన్నయ్య రఘురాం లేచి ఎగిరి గంతేలా చేస్తానని శ్యామల చెబుతుంది. అంతా గందరగోళంగా అయిందని, అందుకే నీదాక ఈ విషయం రాలేదని జగదీశ్వరి సర్దిచెబుతుంది. ఇంతలో చంద్రకళ అక్కడికి వస్తుంది. లోపలికి వచ్చి మీ ఆయన పక్కన నిలబడు అని శ్యామల చెబుతుంది.

 

చంద్రను పిలిచిన జగదీశ్వరి.. పొగిడిన శ్యామల

విరాట్ చంద్రను పెళ్లి చేసుకోవడం అత్తయ్యకు ఇష్టం లేదని శృతి చెప్పాలనుకుంటే.. జగదీశ్వరి అడ్డుకుంటుంది. అమ్మా చంద్ర.. లోపలికి రా అని పిలుస్తుంది. దీంతో అందరూ ఆశ్చర్యపోతారు. శ్యామల కాళ్లకు చంద్ర నమస్కరిస్తుంది. చంద్రుడిలో ఉన్న కళే నీలో ఉందని చంద్రను పొగిడేస్తుంది శ్యామల. విరాట్‍కు పెళ్లయిందని తన వాళ్లకు ఫోన్‍ సంబరంగా చెప్పేస్తుంటుంది శ్యామల. అమ్మాయిలో లక్ష్మీకళ ఉట్టిపడుతోందని చంద్రను చూసి అంటుంది.

శ్యామలకు నిజాలు తెలియకూడదు

ఇలాంటి వాళ్ల మధ్య బతకడం కష్టమే, వీళ్లకు పట్టిన వైరస్‍కు యాంటీవైరస్ కూడా పని చేయదని శాలినీ, శృతి, కామాక్షి గురించి చంద్రకళతో శ్యామల చెబుతుంది. వాళ్ల మాటలు పట్టించుకోవద్దని అంటుంది. విరాట్, చంద్రకళకు ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లి అయిందో శ్యామలకు నిజాలు చెప్పొద్దని అందరికీ జగదీశ్వరి చెబుతుంది. శ్యామలకు నిజాలు తెలిసేందుకు వీలులేదని గట్టిగా హెచ్చరిస్తుంది.

నేను కుండను కాదు.. కొండను

తినేందుకు డైనింగ్ టేబుల్ దగ్గర ఏర్పాట్లు చేస్తుంటుంది చంద్ర. కామాక్షి, శృతి, శాలినీ వచ్చి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతుంటారు. చంద్ర కౌంటర్లు ఇస్తుంది. కొత్తగా వచ్చిన కుండను చూసుకొనేనా నీ ధైర్యం అని శ్యామల గురించి శాలినీ అంటుంది. ఈ మాటను వెనుక నుంచి శ్యామల వింటుంది. ఇది చూసి చంద్ర రెచ్చిపోతుంది. ఆవిడ వయసుకైనా గౌరవం ఇవ్వు అని శాలినీతో చంద్ర అంటుంది. కామాక్షి, శృతి కూడా శ్యామలను మాటలు అంటారు. ఇదంతా శ్యామల వింటూ ఉంటుంది. వెనకే శ్యామలను చూసి శాలినీ, శృతి, కామాక్షి భయపడిపోతారు. కుండ అని ఏదో అంటున్నావ్.. నేను కుండను కాదు కొండను అని శ్యామల అంటుంది. ఆ ముగ్గురినీ మాటలతో ఓ ఆట ఆడుకుంటుంది.

 

ముందు మీరు కూర్చొండి పిన్ని అని చంద్ర అంటే.. ఇదీ మర్యాద అంటే అని శ్యామల సంతోషిస్తుంది. తిందాం రా అని శ్యామల పిలిస్తే.. ఆకలి లేదని జగదీశ్వరి అంటుంది. మీకు ఇష్టమైన మిర్యాల చారు చేశానని చంద్ర చెబుతుంది. అప్పుడే అత్త ఇష్టాలు తెలుసుకున్నావా అని శ్యామల అంటుంది.

చంద్రతో గొడవ ఉందా..

విరాట్‍, చంద్రను కూడా తినేందుకు శ్యామల పిలుస్తుంది. ఒకరి పక్కన ఒకరు కూర్చోవాలని అంటుంది. కామాక్షి, శృతిని వడ్డించాలని చెబుతుంది. నీ భార్య గురించి ఎందుకు ఏమీ మాట్లాడడం లేదని విరాట్‍ను శ్యామల అడుగుతుంది. నీకు చంద్రకు ఏమైనా గొడవ ఉందా అని ప్రశ్నిస్తుంది.

విరాట్‍ను హగ్ చేసుకున్న చంద్ర

కమింగ్ అప్‍లో.. విరాట్, చంద్రను ఒకరికొకరు తినిపించుకోవాలని శ్యామల చెబుతుంది. ఇద్దరూ తినిపించుకుంటారు. చంద్ర సంతోషిస్తుంది. గదిలోకి వెళ్లిన తర్వాత.. ఓవర్ చేస్తున్నావని చంద్రకళపై కోప్పడతాడు విరాట్. బావా.. శ్యామల అత్తయ్య చూస్తున్నారని చంద్ర అంటుంది. దీంతో నువ్వంటే నాకు ఎంత ఇష్టమని మాట మార్చేస్తాడు విరాట్. చిలిపి అంటూ విరాట్‍ను హగ్ చేసుకుంటుంది చంద్ర. విరాట్ కూడా దగ్గరికి తీసుకుంటాడు. చంద్రను చూస్తే 25ఏళ్ల క్రితం నిన్ను చూసినట్టు ఉందని జగదీశ్వరితో శ్యామల అంటుంది. చంద్రను ప్రశంసిస్తుంది.

 

Best Web Hosting Provider In India 2024