Best Web Hosting Provider In India 2024

జియోహాట్స్టార్ ఓటీటీలో దూసుకెళ్తున్న థ్రిల్లర్ మూవీ.. కోర్టు డ్రామా సిరీస్.. ట్రెండింగ్లో ఇవే రెండు.. మీరు చూశారా?
జియోహాట్స్టార్ ఓటీటీలో ఓ రివేంజ్ థ్రిల్లర్ మూవీ.. మరో కోర్టు ఇన్వెస్టిగేటివ్ డ్రామా సిరీస్ దూసుకెళ్తున్నాయి. ఒక్క రోజు గ్యాప్ లో వచ్చిన ఈ సినిమా, సిరీస్ డిజిటల్ స్ట్రీమింగ్ లో ఫ్యాన్స్ ను అలరిస్తున్నాయి. మరి ఈ సిరీస్, సినిమాను మీరు కూడా చూశారా? అవి రెండు ఏంటో ఇక్కడ చూసేయండి.
ఓటీటీలోకి ఎప్పటికప్పుడూ కొత్త కంటెంట్ వస్తూనే ఉంటోంది. థియేటర్లలో రిలీజైన సినిమాలతో పాటు ఆయా ఓటీటీల స్పెషల్ మూవీస్, సిరీస్ ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నాయి. అలా గత వారం జియోహాట్స్టార్ ఓటీటీలో అడుగుపెట్టిన ఓ సినిమా, మరో సిరీస్ ట్రెండింగ్ లో దూసుకెళ్తున్నాయి. ఈ థ్రిల్లర్ మూవీ, వెబ్ సిరీస్ కు ఫ్యాన్స్ నుంచి గొప్ప రెస్పాన్స్ వస్తోంది.
ఓటీటీ ఒరిజినల్
జియోహాట్స్టార్ స్పెషల్ వెబ్ సిరీస్ గా వచ్చిన క్రిమినల్ జస్టిస్ ఏ ఫ్యామిలీ మ్యాటర్ ఓటీటీలో దూసుకెళ్తోంది. ఈ ఓటీటీ ఒరిజినల్ వెబ్ సిరీస్ ఫ్యాన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ ఫ్రాంఛైజీ క్రిమినల్ జస్టిస్ లో భాగంగా నాలుగో సీజన్ గా ఇది నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మే 29ను జియోహాట్స్టార్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. లాయర్ మాధవ్ మిశ్రాగా సీనియర్ యాక్టర్ పంకజ్ త్రిపాఠి అదరగొట్టారు.
మూడు భాషల్లో
ఇండియాలో మూడు భాషల్లో క్రిమినల్ జస్టిస్ నాలుగో సీజన్ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. నంబర్ వన్ గా ఉంది. జియోహాట్స్టార్ ఓటీటీలో హిందీతో పాటు బెంగాలి, మరాఠి భాషల్లో ఈ వెబ్ సిరీస్ నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది. ఈ మూడు భాషల్లోనే కాకుండా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఈ వెబ్ సిరీస్ ను రిలీజ్ చేశారు. ముందుగా మూడు ఎపిసోడ్లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ప్రతి గురువారం మరో కొత్త ఎపిసోడ్ రానుంది.
అదరగొట్టే థ్రిల్లర్
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న సినిమా తుడరుమ్. మోహన్ లాల్ అద్భుతమైన యాక్టింగ్ కు నిలువెత్తు నిదర్శనంలా నిలిచిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు కొల్లగొట్టింది. ఏప్రిల్ 25న థియేటర్లలో రిలీజైంది ఈ సినిమా. సుమారు రూ.30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.235 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లు అంచనా. కేరళ బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లు కలెక్ట్ చేసిన ఫస్ట్ మలయాళ మూవీగా తుడరుమ్ హిస్టరీ క్రియేట్ చేసింది.
ఇందులో ట్రెండింగ్
తుడరుమ్ సినిమా మే 30న జియోహాట్స్టార్ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రివేంజ్ థ్రిల్లర్ కు డిజిటల్ స్ట్రీమింగ్ లోనూ ఫ్యాన్స్ పట్టం కడుతున్నారు. ఇంటెన్సివ్ ఫ్యామిలీ డ్రామాతో పాటు అదిరిపోయే ట్విస్ట్ లు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ మూవీ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఒరిజినల్ లాంగ్వేజ్ మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఈ మూవీ జియోహాట్స్టార్ ఓటీటీలో నంబర్ వన్ ప్లేస్ లో ఉంది. హిందీలో సెకండ్ ప్లేస్ లో కొనసాగుతోంది.