మరో ఓటీటీలోకి రానున్న అల్లరి నరేశ్ కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడంటే..

Best Web Hosting Provider In India 2024

మరో ఓటీటీలోకి రానున్న అల్లరి నరేశ్ కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడంటే..

ఆ ఒక్కటి అడక్కు సినిమా మరో ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఓ ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రం మరో ప్లాట్‍ఫామ్‍లోకి అడుగుపెట్టనుంది. డేట్ ఖరారైంది.

మరో ఓటీటీలోకి రానున్న అల్లరి నరేశ్ కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడంటే..

అల్లరి నరేశ్ హీరోగా నటించిన ‘ఆ ఒక్కటి అడక్కు’ చిత్రం గతేడాది మే 3వ తేదీన థియేటర్లలో విడుదలైంది. కొన్నేళ్ల తర్వాత తన మార్క్ కామెడీ చిత్రాన్ని నరేశ్ చేయడంతో ఈ సినిమాకు క్రేజ్ వచ్చింది. కానీ రిలీజయ్యాక ఈ మూవీ మిక్స్డ్ టాక్ దక్కించుకుంది . దీంతో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించలేకపోయింది. ఇప్పటికే ఓ ఓటీటీలో ఈ చిత్రం స్ట్రీమ్ అవుతోంది. ఇప్పుడు ఆ ఒక్కటి అడక్కు చిత్రం మరో ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది.

ఏడాది తర్వాత మరో ఓటీటీలోకి..

ఆ ఒక్కటి అడక్కు సినిమా ఈటీవీ విన్ ఓటీటీలో జూన్ 12వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆ ప్లాట్‍ఫామ్ వెల్లడించింది. ఈ సినిమా గతేడాది మే చివర్లో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. మంచి వ్యూస్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఏడాది తర్వాత ఈ మూవీ మరో ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ఈటీవీ విన్‍లో జూన్ 12న స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇవ్వనుంది.

ఆ ఒక్కటి అడక్కు సినిమాకు మల్లి అంకం దర్శకత్వం వహించారు. పెళ్లి కోసం ఆరాటపడే ఓ ప్రభుత్వ ఉద్యోగి చుట్టూ ఈ సినిమా సాగుతుంది. ఈ మూవీలో అల్లరి నరేశ్‍కు జోడీగా ఫారియా అబ్దుల్లా నటించారు. వెన్నెల కిశోర్, అరియానా గ్లోరీ, హర్షా చెముడు, జామీ లివర్, హరితేజ కీలకపాత్రలు పోషించారు.

బాక్సాఫీస్ ప్లాఫ్

బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్కటి అడక్కు చిత్రం హిట్ కాలేకపోయింది. థియేటర్లలో రిలీజయ్యాక మిక్స్డ్ రెస్పాన్స్ రావడంతో కలెక్షన్లు పెద్దగా రాలేదు. ఈ చిత్రం సుమారు రూ.10కోట్ల బడ్జెట్‍తో రూపొందినట్టు అంచనా. ఈ చిత్రం దాదాపు రూ.9కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. మొత్తంగా కమర్షియల్‍‍గా ప్లాఫ్ అయింది.

ఆ ఒక్కటి అడక్కు మూవీని చిలక ప్రొడక్షన్స్ పతాకంపై రాజీవ్ చిలక ప్రొడ్యూజ్ చేశారు. ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతం అందించగా.. సూర్య సినిమాటోగ్రఫీ చేశారు.

ఈటీవీ విన్‍లో ‘పెళ్లి కాని ప్రసాద్’

కమెడియన్ సప్తగిరి హీరోగా నటించిన పెళ్లి కాని ప్రసాద్ చిత్రం జూన్ 5వ తేదీన ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. మర్చి 21న ఈ చిత్రం థియేటర్లలో విడుదలై అనుకున్న ఫలితాన్ని దక్కించుకోలేకపోయింది. ఈ మూవీకి అభిలాశ్ రెడ్డి దర్శకత్వం వహించగా.. సప్తగిరికి సరసన హీరోయిన్‍గా ప్రియాంక శర్మ చేశారు. ఈ సినిమా కూడా ఓ యువకుడి పెళ్లి కష్టాల చుట్టూ సాగుతుంది. జూన్ 5 నుంచి పెళ్లి కాని ప్రసాద్ మూవీని ఈటీవీ విన్‍లో చూడొచ్చు.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024