





Best Web Hosting Provider In India 2024

రానా నాయుడు 2 ట్రైలర్.. నాగా, రానా ఈజ్ బ్యాక్.. ఈసారి అదిరిపోయిన యాక్షన్
రానా నాయుడు సీజన్ 2 ట్రైలర్ వచ్చేసింది. బాబాయ్, అబ్బాయ్‌లు వెంకటేశ్, రానా మరో సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వచ్చే వారం నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుండగా.. మంగళవారం (జూన్ 3) ట్రైలర్ రిలీజ్ చేశారు.
నెట్‌ఫ్లిక్స్‌లో రెండేళ్ల కిందట వచ్చిన వెబ్ సిరీస్ రానా నాయుడు. వెంకటేశ్, రానాలాంటి తెలుగు హీరోలు నటించిన ఈ సిరీస్ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. బూతు డైలాగులు, మితిమీరిన శృంగార సీన్లతో షాక్‌కు గురి చేసింది. నిజ జీవితంలో బాబాయ్ అబ్బాయ్ అయిన వెంకీ, రానా తండ్రీకొడుకులుగా నటించిన ఈ రానా నాయుడు సీజన్ 2 ట్రైలర్ మంగళవారం (జూన్ 3) రిలీజైంది.
రానా నాయుడు సీజన్ 2 ట్రైలర్
రానా నాయుడు సీజన్ 2 జూన్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ట్రైలర్ రిలీజ్ చేశారు. తొలి సీజన్ కు మించి యాక్షన్ తో ఈ కొత్త సీజన్ రానున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఇందులోనూ తండ్రీకొడుకులైన నాగా నాయుడు, రానా నాయుడు ముఖాముఖి తలపడబోతున్నారు. ఈ సీజన్ కూడా ఫుల్ యాక్షన్ ఉండబోతున్నట్లు ట్రైలర్ తోనే మేకర్స్ చెప్పారు.
కరణ్ అన్షుమన్, సుపర్ణ్ వర్మ, అభయ్ చోప్రా ఈ సిరీస్ ను డైరెక్ట్ చేశారు. ఇక రెండో సీజన్లో వెంకటేశ్, రానాతోపాటు అర్జున్ రాంపాల్, డీనో మోరియా, సుర్వీన్ చావ్లా, అభిషేక్ బెనర్జీ, కృతి కర్బందాలాంటి వాళ్లు నటించారు. జూన్ 13 నుంచి హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
రానా నాయుడు సీజన్ 1లో ఏం జరిగిందంటే?
రానా నాయుడు తొలి సీజన్ మార్చి, 2023లో వచ్చింది. బోల్డ్ కంటెంట్ ఉండటంతో కాస్త విమర్శలు కూడా ఎక్కువగానే వచ్చాయి. దీంతో రెండో సీజన్లో అలాంటి కంటెంట్ ఉండబోదని వెంకటేశ్ కూడా హామీ ఇచ్చాడు. యాక్షన్ అంశాలకు ఫ్యామిలీ ఎమోషన్స్ మేళవించి తొలి సీజన్ రూపొందించారు. కంప్లీట్ మోడ్రన్ సెటప్‌లో కథ సాగుతుంది. అందుకు తగినట్లుగానే ఎక్కువగా మసాలా సీన్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్‌కనిపిస్తాయి.
తండ్రిని ద్వేషించే ఓ కొడుకు, అతడికి గుణపాఠం చెప్పాలని ప్రయత్నించే తండ్రి సింపుల్‌గా ఈ రెండు క్యారెక్టర్స్ చూట్టే ఈ కథ సాగుతుంది. ఈ రెండు పాత్రలతో మిగిలిన క్యారెక్టర్స్‌ను లింక్ చేస్తూ పది ఎపిసోడ్స్‌తో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు దర్శకద్వయం కరణ్ అన్షుమన్, సుపర్ణ్ వర్మ.
ఫస్ట్ ఎపిసోడ్‌తోనే..
బాలీవుడ్ సెలబ్రిటీలకు వచ్చే సమస్యలను పరిష్కరించే వ్యక్తిగా రానా పాత్ర ఎంట్రీ ఇచ్చే సీన్‌తోనే సిరీస్‌పై ఆసక్తిని రేకెత్తించారు దర్శకులు. ఆ తర్వాత జైలు నుంచి నాగనాయుడు రిలీజ్ రిలీజ్ కావడం, తన కొడుకులను కలుసుకునే సీన్స్‌తో ఫస్ట్ ఎపిసోడ్ సాగుతుంది. ఈ ఎపిసోడ్ చివరలో వెంకటేష్, రానా ఎదురుపడే సన్నివేశం నుంచి అసలు కథ మొదలవుతుంది.
కొడుకు రానానే తనను జైలు పాలు చేశాడని గ్రహించిన నాగ అతడిని ఎదుర్కోనడానికి వేసే ఎత్తులు, తండ్రి వేసే సవాళ్లను చిత్తుచేస్తూనే సెలబ్రిటీ సమస్యలను రానానాయుడు ఎలా చక్కదిద్దాడనే అంశాల చుట్టూ చివరి వరకు సిరీస్ సాగుతుంది.
తండ్రి నాగను కొడుకు రానా నాయుడు ఎందుకు ద్వేషిస్తున్నాడో చివరి ఎపిసోడ్‌లో చూపించారు. ఆ తర్వాత కొడుకుకు ఎదురయ్యే సమస్యను నాగ పరిష్కరించే సీన్‌తో సిరీస్‌ను ఎండ్ చేశారు.
సంబంధిత కథనం