





Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి మూడు నెలల తర్వాత వస్తున్న తెలుగు రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్.. ఐఎండీబీలో 8.2 రేటింగ్
ఓటీటీలోకి ఇప్పుడో తెలుగు రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది. థియేటర్లలో రిలీజైన మూడు నెలల తర్వాత ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కానుండటం విశేషం. రొమాన్స్, సస్పెన్స్, థ్రిల్లర్ కలగలసిన ఈ సినిమాకు ఐఎండీబీలో 8.2 రేటింగ్ ఉంది.
తెలుగు రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ మూవీ మార్చిలో థియేటర్లలో రిలీజై మొత్తానికి ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమా పేరు జిగేల్ (jigel). త్రిగుణ్, మేఘా చౌదరి లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమాను మల్లి యేలూరి డైరెక్ట్ చేశాడు. మరి ఈ సినిమా ఏ ఓటీటీలోకి వస్తోంది? మూవీ విశేషాలేంటో ఇక్కడ చూడండి.
జిగేల్ ఓటీటీ రిలీజ్ డేట్
ఈ ఏడాది మార్చి 7న థియేటర్లలో రిలీజైన మూవీ జిగేల్. ఓ లోబడ్జెట్ మూవీగా రిలీజైనా.. ప్రేక్షకులను కంటెంట్ తో ఆకట్టుకున్న సినిమా ఇది. ఇప్పుడీ మూవీ గురువారం (జూన్ 5) నుంచి సన్ నెక్ట్స్ (Sun nxt) ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఆ విషయాన్ని మంగళవారం (జూన్ 3) ఆ ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.
“స్టైల్, థ్రిల్, రొమాన్స్. ఇదో జిగేల్ రైడ్. కూలెస్ట్ లాకర్ టెక్నీషియన్ అయిన నందు ఈ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ ద్వారా మీ స్క్రీన్లలోకి రానున్నాడు. జిగేల్ మూవీ గురువారం, జూన్ 5 నుంచి సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మ్యాడ్‌నెస్ మిస్ కావద్దు” అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ ఈ విషయం వెల్లడించింది. సుమారు 3 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
జిగేల్ మూవీ స్టోరీ ఏంటంటే?
జిగేల్ మూవీ ఓ వెరైటీ ప్లాట్ తో తెరకెక్కింది. చిన్న చిన్న దొంగతనాలు చేసుకునే ఓ ప్రేమ జంట చుట్టూ తిరిగే స్టోరీ ఇది. లాకర్లను తన నైపుణ్యంతో తెరిచే నందు (త్రిగుణ్).. మీనా (మేఘా చౌదరి) ప్రేమలో పడతాడు. అదే అతని జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఆమె కూడా చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటుంది. ఈ ఇద్దరూ ప్రేమలో పడిన తర్వాత రాజా చంద్ర వర్మ ప్యాలెస్ లో ఓ పాతకాలం నాటి లాకర్ ఒకటి ఉందని మీనా తెలుసుకుంటుంది.
దాని గురించి మరింత సమాచారం రాబట్టడానికి జేపీ (సాయాజీ షిండే) అనే వ్యక్తికి పీఏగా వెళ్తుంది. అతడు కూడా ఆ ఖజానాపై కన్నేస్తాడు. మరి నందు, మీనా ఆ ఖజానాను కొల్లగొడతారా? ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఈ జిగేల్ మూవీలో చూడొచ్చు. ఈ జిగేల్ మూవీ గురువారం (జూన్ 5) నుంచి సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ కానుంది. మిస్ కాకుండా చూడండి. మంచి థ్రిల్ పొందండి.
సంబంధిత కథనం