ఓటీటీలోకి ప్రియమణి నటించిన లీగల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. తెలుగు సహా 7 భాషల్లో స్ట్రీమింగ్

Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి ప్రియమణి నటించిన లీగల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. తెలుగు సహా 7 భాషల్లో స్ట్రీమింగ్

Hari Prasad S HT Telugu

ఓటీటీలోకి ప్రియమణి నటించిన తమిళ లీగల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాబోతోంది. ఈ సిరీస్ తెలుగు సహా మొత్తంగా ఏడు భాషల్లో స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం. అమెరికన్ షో ఆధారంగా ఈ సిరీస్ రూపొందించినట్లు తెలుస్తోంది.

ఓటీటీలోకి ప్రియమణి నటించిన లీగల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. తెలుగు సహా 7 భాషల్లో స్ట్రీమింగ్

ప్రియమణి నటించిన మరో వెబ్ సిరీస్ ఓటీటీలోకి వస్తోంది. ఇప్పటికే ఆమె నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. ఇప్పుడామె ఓ తమిళ లీగల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. తాజాగా జియోహాట్‌స్టార్ ఓటీటీ ఈ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ కానుందంటూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది.

గుడ్ వైఫ్ ఓటీటీ రిలీజ్ డేట్

ప్రియమణి నటిస్తున్న వెబ్ సిరీస్ గుడ్ వైఫ్ (Good Wife). ఇదే పేరుతో వచ్చిన అమెరికన్ షో ఆధారంగా ఈ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. హాట్‌స్టార్ స్పెషల్స్ గుడ్ వైఫ్ త్వరలోనే స్ట్రీమింగ్ చేయనున్నట్లు జియోహాట్‌స్టార్ మంగళవారం (జూన్ 4) వెల్లడించింది. “ఒక్క రాత్రి అంతా మార్చేసింది. ఇప్పుడిక కుటుంబం కోసం ఆమె పోరాటం మొదలైంది.

గుడ్ వైఫ్ త్వరలోనే జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది” అని ఆ ఓటీటీలో వెల్లడించింది. దీంతోపాటు ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. అందులో ప్రియమణి కోర్టులో కేసు వాదించడానికి సిద్ధమవుతున్నట్లుగా చూడొచ్చు. వెనుక ఆమె ఫ్యామిలీని కూడా చూపించారు. భర్త జైల్లో ఉండగా.. ఇద్దరు పిల్లలు ఆమె వెనుక ఉన్నారు.

గుడ్ వైఫ్ వెబ్ సిరీస్ ఏకంగా ఏడు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. తమిళ భాషలో రూపొందుతున్నా.. ఇది తెలుగుతోపాటు కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, బెంగాలీ భాషల్లోనూ స్ట్రీమింగ్ కానున్నట్లు జియోహాట్‌స్టార్ తెలిపింది.

గుడ్ వైఫ్ స్టోరీ ఇదేనా?

నిజానికి గుడ్ వైఫ్ ఓ అమెరికన్ షో ఆధారంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ షో 2009 నుంచి 2016 మధ్య స్ట్రీమింగ్ అయింది. ఇందులో ఓ మాజీ లాయర్ అయిన మహిళ.. సెక్స్ స్కాండల్‌లో చిక్కుకొని జైలుకు వెళ్లిన తన భర్తను విడిపించుకోవడానికి మళ్లీ కోర్టు మెట్లు ఎక్కుతుంది. ఇప్పుడు ప్రియమణి లీడ్ రోల్లో అదే టైటిల్ తో ఈ సిరీస్ వస్తోంది.

ఫస్ట్ లుక్ పోస్టర్ స్టోరీ లైన్ ఇదే అనేలా హింట్ ఇచ్చింది. ఇంగ్లిష్ లో స్ట్రీమింగ్ అయిన ది గుడ్ వైఫ్ షోకి ఐఎండీబీలో 8.2 రేటింగ్ నమోదైంది. ఆ లెక్కన ప్రియమణి నటిస్తున్న ఈ గుడ్ వైఫ్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే ఈ సిరీస్ నుంచి టీజర్, ట్రైలర్, స్ట్రీమింగ్ తేదీలాంటి అప్డేట్స్ రానున్నాయి.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024