



Best Web Hosting Provider In India 2024

మీ లివర్‌ను కాపాడుకోవాలా? ఈ 3 చెడ్డ ఆహారాలకు దూరంగా ఉండండి: డాక్టర్ సలహా
మీ కాలేయానికి హాని కలిగించే, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలకు దారితీసే ‘3 చెత్త ఆహారాలు’ మానేయాలని డాక్టర్ సేథీ హెచ్చరిస్తున్నారు. ఆ ఆహారాల గురించి ఇక్కడ తెలుసుకోండి.
మీరు రోజు తినే కొన్ని రకాల ఆహారాలు మీ లివర్‌కు హాని చేస్తాయని మీకు తెలుసా? కాలిఫోర్నియాకు చెందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, హెపటాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి చెప్పిన దాని ప్రకారం, మూడు రకాల ఆహార పదార్థాలు మీ లివర్‌ను దెబ్బతీస్తాయి. జూన్ 3న ఆయన పోస్ట్ చేసిన ఒక వీడియోలో, లివర్ స్పెషలిస్ట్‌గా తను కూడా లివర్ ఆరోగ్యం కోసం ఆ ఆహారాలకు దూరంగా ఉంటానని చెప్పారు.
లివర్ ఆరోగ్యానికి చెడు చేసే ఆహారాలు:
‘నా లివర్‌ను కాపాడుకోవడానికి లివర్ స్పెషలిస్ట్‌గా నేను దూరంగా ఉండే 3 చెత్త ఆహారాలు’ అనే టైటిల్‌తో డాక్టర్ సేథి ఒక వీడియో విడుదల చేశారు. ఆ ఆహార పదార్థాలు ఏంటో చూద్దాం.
ఫ్రక్టోజ్:
తీపి పానీయాలు, చాలా రకాల ప్యాకేజ్డ్ స్నాక్స్‌లో ఫ్రక్టోజ్ ఉంటుంది. ఇది లివర్‌లో కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతుంది. గ్లూకోజ్‌లా కాకుండా, ఫ్రక్టోజ్ ప్రధానంగా లివర్‌లోనే జీర్ణమవుతుంది. దీనివల్ల ఫ్యాటీ లివర్ సమస్య వస్తుందని డాక్టర్ సేథి చెప్పారు.
సీడ్ ఆయిల్స్ (విత్తన నూనెలు):
సోయాబీన్, మొక్కజొన్న, సన్‌ఫ్లవర్ ఆయిల్ వంటి చాలా సీడ్ ఆయిల్స్‌లో ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. “ఒమేగా-6 ఎక్కువగా తీసుకుంటే లివర్‌లో మంటను, ఆక్సిడేటివ్ ఒత్తిడిని పెంచుతుంది” అని ఆయన అన్నారు.
ఫ్రూట్ జ్యూస్‌లు:
డాక్టర్ సేథి ప్రకారం, 100 శాతం పండ్ల రసాల్లో కూడా ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటుంది. కానీ పీచు పదార్థం తక్కువగా ఉంటుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. ఇలా చక్కెర పెరగడం కూడా ఫ్యాటీ లివర్‌కు దారితీస్తుంది.
ఫ్యాటీ లివర్ వస్తే ఏం జరుగుతుంది?
పైన చెప్పిన ఆహార పదార్థాలన్నీ ఫ్యాటీ లివర్‌కు దారితీస్తాయి. కానీ ఫ్యాటీ లివర్ వస్తే శరీరానికి ఏం జరుగుతుంది? డాక్టర్ వెండీ (Dr Wendi) అనే మరో గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ చెప్పిన దాని ప్రకారం, ఫ్యాటీ లివర్ వచ్చినప్పుడు లివర్ కణాలలో పసుపు కొవ్వు పేరుకుపోవడం మొదలవుతుంది. కాలక్రమేణా, ఈ కొవ్వు స్కార్ టిష్యూగా మారుతుంది. దీనిని స్టేజ్ 1 ఫైబ్రోసిస్ అంటారు. చాలా కాలం పాటు చికిత్స తీసుకోకపోతే లివర్ ఎలా దెబ్బతింటుందో వివిధ దశలను కూడా ఆమె వివరించారు.
(పాఠకులకు ముఖ్య గమనిక: ఈ ఆర్టికల్ కేవలం సమాచారం కోసమే. ఇది డాక్టర్ సలహాకు ప్రత్యామ్నాయం కాదు. మీ ఆరోగ్య సమస్యల గురించి ఏవైనా ప్రశ్నలు ఉంటే ఎప్పుడూ మీ డాక్టర్‌ను సంప్రదించండి.)