ఆర్సీబీ విక్టరీ పరేడ్.. ఎప్పుడంటే? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? లైవ్ స్ట్రీమింగ్ వివరాలు

Best Web Hosting Provider In India 2024


ఆర్సీబీ విక్టరీ పరేడ్.. ఎప్పుడంటే? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? లైవ్ స్ట్రీమింగ్ వివరాలు

ఐపీఎల్ 2025 ఛాంపియన్ గా ఆర్సీబీ నిలిచింది. ఆ టీమ్ 18 ఏళ్ల తర్వాత తొలిసారి ఐపీఎల్ టైటిల్ ముద్దాడింది. దీంతో సొంత నగరం బెంగళూరులో ఈ రోజు విక్టరీ పరేడ్ నిర్వహించనుంది. ఆ పరేడ్ లైవ్ స్ట్రీమింగ్ వివరాలు మీకోసం.

ఛాంపియన్ ఆర్సీబీ టీమ్ (ANI)

ఆర్సీబీ ఫ్యాన్స్ కు ఇన్ని రోజులకు గుడ్ టైమ్ స్టార్ట్ అయింది. ఇన్నాళ్లుగా ట్రోల్స్ ఎదుర్కొంటూ, విమర్శలు తీసుకుంటూ అవమానాల పాలైన ఆ టీమ్ ఫ్యాన్స్.. ఇప్పుడు గర్వంగా కాలర్ ఎగరేసుకునే రోజు వచ్చింది. ఐపీఎల్ లో ఆర్సీబీ ఫస్ట్ టైమ్ విజేతగా నిలిచింది. ఇప్పుడు ఆ టీమ్ ఫ్యాన్స్ ‘ఈ సాలా కప్ నమ్దు’ అని గర్వంగా చెప్పుకుంటున్నారు. ఈ సంబరాలను మరింత పెంచేలా ఈ రోజు (జూన్ 4) బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తోంది.

ఓపెన్ టాప్ బస్ పరేడ్

మంగళవారం (జూన్ 3) రాత్రి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ పై గెలిచి ఆర్సీబీ ట్రోఫీ సొంతం చేసుకుంది. ఈ విజయంతో బెంగళూరు నగరానికి ట్రోఫీని తీసుకువచ్చిన తమ హీరోలను గౌరవించుకునే అవకాశం ఆర్సీబీ ఫ్యాన్స్ కు దక్కింది. ఆర్సీబీ విక్టరీతో ఆ నగరంలో రాత్రంతా సంబరాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఆ సంబరాలు మరో లెవల్ కు చేరబోతున్నాయి. బుధవారం బెంగళూరులో ట్రోఫీతో ఆర్సీబీ ఓపెన్ టాప్ బస్సులో విజయ యాత్ర నిర్వహించనుంది.

సీఎం సన్మానంతో

టైటిల్ తో బెంగళూరుకు తిరిగొస్తున్న ఆర్సీబీ ఆటగాళ్లను కర్ణాటక ముఖ్యమంత్రి సన్మానించనున్నారు. విధానసౌధాలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అక్కడి నుంచి చిన్నస్వామి స్టేడియం వరకూ ఓపెన్ టాప్ బస్ లో విక్టరీ పరేడ్ కొనసాగుతుంది. గంటపాటు ఈ విజయోత్సవ ర్యాలీ ఉంటుంది. ఆ తర్వాత చిన్నస్వామి స్టేడియంలో స్పెషల్ ఈవెంట్ నిర్వహిస్తారు.

విక్టరీ పరేడ్ స్ట్రీమింగ్ వివరాలు ఇలా

ఆర్సీబీ ఐపీఎల్ 2025 విక్టరీ పరేడ్ ఎక్కడ జరుగుతుంది?

ఆర్సీబీ ఐపీఎల్ 2025 విక్టరీ పరేడ్ బెంగళూరులోని విధానసౌధలో ప్రారంభమై చిన్నస్వామి స్టేడియంలో ముగుస్తుంది.

ఆర్సీబీ ఐపీఎల్ 2025 విక్టరీ పరేడ్ ఎప్పుడు జరుగుతుంది?

ఆర్సీబీ ఐపీఎల్ 2025 విక్టరీ పరేడ్ జూన్ 4, 2025 మధ్యాహ్నం 3:30 గంటల తర్వాత ప్రారంభం కానుంది. సాయంత్రం 5 గంటలకు ర్యాలీ ప్రారంభమవుతుందని, సాయంత్రం 6 గంటలకు చిన్నస్వామి స్టేడియంలో జరిగే కార్యక్రమంతో ఈ ఊరేగింపు ముగుస్తుందని సమాచారం.

ఆర్సీబీ ఐపీఎల్ 2025 విక్టరీ పరేడ్ కు ఎవరు హాజరు కావచ్చు?

ఆర్సీబీ ఐపీఎల్ 2025 విక్టరీ పరేడ్ బెంగళూరు నగరం గుండా సాగుతుంది. ప్రజలందరూ ఇందులో పాల్గొనవచ్చు.

ఆర్సీబీ ఐపీఎల్ 2025 విక్టరీ పరేడ్ ను లైవ్ లో ఎక్కడ చూడొచ్చు?

ఆర్సీబీ ఐపీఎల్ 2025 విక్టరీ పరేడ్ స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం


Best Web Hosting Provider In India 2024


Source link