అక్కడుండే అమ్మాయిలకు చాలా ఇబ్బందులుంటాయి.. బయటకు వెళ్తే ఎలా మారుతారో చెప్పేదే ఓటీటీ సిరీస్: హీరో సూర్య వశిష్ట కామెంట్స్

Best Web Hosting Provider In India 2024

అక్కడుండే అమ్మాయిలకు చాలా ఇబ్బందులుంటాయి.. బయటకు వెళ్తే ఎలా మారుతారో చెప్పేదే ఓటీటీ సిరీస్: హీరో సూర్య వశిష్ట కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

ఓటీటీ రిలీజ్ అవుతోన్న కొత్త తెలుగు వెబ్ సిరీస్ దేవిక అండ్ డానీ. జియో హాట్‌స్టార్‌లో జూన్ 6 నుంచి దేవిక అండ్ డానీ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా రీసెంట్‌గా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో దేవిక అండ్ డానీలో హీరోగా చేసిన సూర్య వశిష్ట్ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పాడు.

అక్కడుండే అమ్మాయిలకు చాలా ఇబ్బందులుంటాయి.. బయటకు వెళ్తే ఎలా మారుతారో చెప్పేదే ఓటీటీ సిరీస్: హీరో సూర్య వశిష్ట కామెంట్స్

జియో హాట్‌స్టార్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ నుంచి జియో హాట్‌స్టార్‌గా పున: నిర్మితమై ఎప్పటికప్పుడు ఓటీటీ ప్రేక్షకులకు తిరుగులేని, బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా హాట్‌స్టార్ స్పెషల్స్‌లో భాగంగా ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘దేవిక అండ్‌ డానీ’ అనే వెబ్ సిరీస్‌ను స్ట్రీమింగ్ చేయనుంది.

దేవిక అండ్ డానీ నటీనటులు

జూన్ 6 నుంచి జియో హాట్‌స్టార్‌లో దేవిక అండ్ డానీ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఈ తెలుగు వెబ్ సిరీస్‌లో రీతు వర్మ, సూర్య వశిష్ట, శివ కందుకూరి హీరో హీరోయిన్స్‌గా నటించారు. సుబ్బరాజు, కోవై సరళ, సోనియా సింగ్, గోకరాజు రమణ, శివన్నారాయణ, వివా హర్ష, షణ్ముఖ్, అభినయ శ్రీ, మౌనికా రెడ్డి, ఈశ్వర్య వుల్లింగల తదితరులు ఇతర కీలక పాత్రల్లో న‌టించారు.

దేవిక అండ్ డానీ ఓటీటీ రిలీజ్

బి. కిషోర్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన దేవిక అండ్ డానీ ఓటీటీ వెబ్ సిరీస్‌ను సుధాక‌ర్ చాగంటి నిర్మించారు. జూన్ 6న జియో హాట్‌స్టార్‌లో దేవిక అండ్ డానీ ఓటీటీ రిలీజ్ కానున్న సందర్భంగా రీసెంట్‌గా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో హీరో సూర్య వశిష్ట ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పాడు.

ఎలా మారుతారనే విషయాన్ని

సూర్య వశిష్ట మాట్లాడుతూ.. “సాధారణంగా ఊర్ల‌లో ఉండే అమ్మాయిల‌కు చాలా ఇబ్బందులుంటాయి. ఈ ప‌ని చేయాల‌ని, ఆ ప‌ని చేయ‌కూడ‌ద‌ని అంటుంటారు. అలాంటి వాళ్లు బ‌య‌ట‌కు వెళితే ఎలా మారుతార‌నే ఓ విష‌యాన్ని చ‌క్క‌గా దేవిక అండ్ డానీ ఓటీటీ సిరీస్‌లో చూపించారు” అని అన్నాడు.

ఫ్యామిలీ మెంబర్‌లా

“దేవిక అనే అమ్మాయి జీవితాన్ని డానీ, సుబ్బు లాంటి పాత్ర‌లు ఎలా మార్చాయ‌నేది కూడా ఇందులో చూడొచ్చు. త‌ప్ప‌కుండా ఈ సిరీస్ అంద‌రికీ న‌చ్చుతుంది. నిర్మాత సుధాక‌ర్ అరుదైన వ్య‌క్తి. మా డైరెక్ట‌ర్ కిషోర్‌ గారు మా ఫ్యామిలీ మెంబ‌ర్‌లా మాతో క‌లిసిపోయారు. సినిమాటోగ్రాఫ‌ర్ దిలీప్‌ గారి ఫ్రేమింగ్‌, లైటింగ్ సూప‌ర్బ్‌. నందిని గారు బిహైండ్ ది సీన్స్ ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు” అని సూర్ వశిష్ట తెలిపాడు.

ఫ్రెష్ కంటెంట్‌ను

“ఫ్రెష్ కంటెంట్‌ను అందిస్తోన్న జియో హాట్‌స్టార్‌కి థాంక్స్‌. రీతూవ‌ర్మ చాలా మంచి కోస్టార్‌. శివ కందుకూరి అయితే నా బ్ర‌ద‌ర్‌లా మారిపోయారు. త‌ను అద్భుతంగా న‌టించాడు. డానీ పాత్ర‌లో చాలా షేడ్స్ ఉంటాయి. ఆడియెన్స్‌కు అన్నీ పాత్ర‌లు చ‌క్క‌గా క‌నెక్ట్ అవుతాయి” అని హీరో సూర్య వశిష్ట చెప్పుకొచ్చాడు.

ఓటీటీ మలయాళం

ఇదిలా ఉంటే, జియో హాట్‌స్టార్‌లో రీసెంట్‌గా మలయాళం బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. మోహన్ లాల్, శోభన నటించిన తుడరుమ్‌తోపాటు సిమ్రాన్ యాక్ట్ చేసిన టూరిస్ట్ ఫ్యామిలీ ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాలు కూడా తెలుగు భాషలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024