ఈవారం ఓటీటీలో కచ్చితంగా చూడాల్సిన సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే.. అన్నీ తెలుగులోనే..

Best Web Hosting Provider In India 2024

ఈవారం ఓటీటీలో కచ్చితంగా చూడాల్సిన సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే.. అన్నీ తెలుగులోనే..

Hari Prasad S HT Telugu

ఈవారం ఓటీటీలోకి వచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్ లో కచ్చితంగా చూడాల్సినవి కొన్ని ఉన్నాయి. ఇవన్నీ తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతున్నాయి. కాబోతున్నాయి. మరి ఆ మూవీస్, వెబ్ సిరీస్ ఏవి, ఎక్కడ చూడాలో తెలుసుకోండి.

ఈవారం ఓటీటీలో కచ్చితంగా చూడాల్సిన సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే.. అన్నీ తెలుగులోనే..

ఓటీటీలోకి ఈ వారం కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ అడుగుపెట్టబోతున్నాయి. ముఖ్యంగా మూడు సినిమాలు, ఓ వెబ్ సిరీస్ మాత్రం మిస్ కాకుండా చూడాల్సిందే. ఇవి జియోహాట్‌స్టార్, ఆహా వీడియో, సన్ నెక్ట్స్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో అందుబాటులో ఉన్నాయి. వీటి గురించి ఓసారి చూద్దాం.

టూరిస్ట్ ఫ్యామిలీ – జియోహాట్‌స్టార్

టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ జియోహాట్‌స్టార్ ఓటీటీలోకి సోమవారం (జూన్ 2) స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ తమిళ కామెడీ మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. శశి కుమార్, సిమ్రన్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ మూవీ థియేటర్లలోనే కాదు.. ఓటీటీలోనూ సంచలనాలు సృష్టిస్తోంది. ఈ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాను ప్రతి ఒక్కరూ కచ్చితంగా చూడాల్సిందే. శ్రీలంక నుంచి తమిళనాడులోని రామేశ్వరానికి అక్రమంగా శరణార్థులుగా వచ్చిన ఓ కుటుంబం చుట్టూ తిరిగే కథే ఈ టూరిస్ట్ ఫ్యామిలీ.

వడక్కన్ – ఆహా వీడియో ఓటీటీ

మలయాళ హారర్ థ్రిల్లర్ మూవీ వడక్కన్. ఎప్పుడూ మూడు నెలల కిందట థియేటర్లలో రిలీజైంది. ఆ తర్వాత గత నెలలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అడుగుపెట్టింది. అయితే కేవలం మలయాళం, కన్నడలాంటి భాషల్లోనే స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ శుక్రవారం (జూన్ 6) నుంచి ఆహా ఓటీటీలో తెలుగు, తమిళం భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. అతీత శక్తుల గురించి శోధించే ఇద్దరు వ్యక్తులు కేరళలోని ఓ చోట జరిగిన కొన్ని అంతు చిక్కని మరణాల గురించి తెలుసుకోవడానికి వస్తారు. అక్కడ వాళ్లకు ఎలాంటి పరిస్థితి ఎదురైందన్నదే ఈ వడక్కన్ లో చూడొచ్చు.

లాల్ సలామ్ – సన్ నెక్ట్స్ ఓటీటీ

గతేడాది రజనీకాంత్ అతిథి పాత్రలో నటించిన మూవీ లాల్ సలామ్. ఈ సినిమా ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తోంది. శుక్రవారం (జూన్ 6) నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో మొయినుద్దీన్ అనే ఓ గ్యాంగ్‌స్టర్ పాత్రలో రజనీ నటించాడు. అయితే బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచిన మూవీ.. చాలా కాలం తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది.

దేవిక అండ్ డానీ వెబ్ సిరీస్ – జియోహాట్‌స్టార్

ఈ వారం తెలుగులో వస్తున్న మరో వెబ్ సిరీస్ దేవిక అండ్ డానీ. జియోహాట్‌స్టార్ ఓటీటీలో శుక్రవారం (జూన్ 6) నుంచి స్ట్రీమింగ్ కానుంది. రీతూ వర్మ లీడ్ రోల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ ఆసక్తి రేపుతోంది. పెళ్లికి సిద్ధమైన దేవిక జీవితంలోకి డానీ అనే వ్యక్తి వచ్చిన తర్వాత మొత్తం కథ మలుపు తిరుగుతుంది. బి. కిశోర్ డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను కూడా ఈ వీకెండ్ లిస్ట్ లో చేర్చుకోవచ్చు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024