ప్రైమ్ వీడియోలో సంచలనం రేపుతున్న థ్రిల్లర్ మూవీ.. తొలి రోజే ఐఎండీబీలో 7 రేటింగ్

Best Web Hosting Provider In India 2024

ప్రైమ్ వీడియోలో సంచలనం రేపుతున్న థ్రిల్లర్ మూవీ.. తొలి రోజే ఐఎండీబీలో 7 రేటింగ్

Hari Prasad S HT Telugu

అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి వచ్చిన ఓ థ్రిల్లర్ మూవీ తొలి రోజే ప్రేక్షకులను ఆకట్టుకుంది. బుధవారం (జూన్ 4) ప్రీమియర్ అయిన ఈ సినిమా ఐఎండీబీలో 7 రేటింగ్ సొంతం చేసుకుంది. మరి ఈ సినిమా ఏంటి? అసలు స్టోరీ ఏంటో తెలుసుకుందాం.

ప్రైమ్ వీడియోలో సంచలనం రేపుతున్న థ్రిల్లర్ మూవీ.. తొలి రోజే ఐఎండీబీలో 7 రేటింగ్

థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందో మనకు తెలుసు. తాజాగా ప్రైమ్ వీడియోలోకి అలాంటి థ్రిల్లర్ మూవీయే ఒకటి నేరుగా స్ట్రీమింగ్ కు వచ్చింది. ఎలాంటి హడావుడి, ప్రచారం లేకుండానే ప్రైమ్ వీడియోలో బుధవారం (జూన్ 4) విడుదలైన ‘స్టోలెన్’ (Stolen) అనే సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్టాండింగ్ ఒవేషన్ పొందిన ఈ మూవీ, ఇండియాలోని గ్రామీణ ప్రాంతాల కఠిన వాస్తవాలను, మానవత్వం కోసం జరిగే పోరాటాన్ని చాలా వాస్తవిక రీతిలో చూపించింది.

స్టోలెన్ సినిమా వివరాలు

కరణ్ తేజ్‌పాల్ దర్శకత్వం వహించిన తొలి సినిమా ఇది. ఈ థ్రిల్లర్ చిత్రంలో ఇద్దరు సోదరులు (అభిషేక్ బెనర్జీ, శుభమ్ వర్ధన్) ఒక గిరిజన మహిళకు చెందిన బిడ్డ కిడ్నాప్ కేసులో ఎలా చిక్కుకుంటారు అనేది ప్రధాన కథాంశం. సినిమాలోని సస్పెన్స్‌తో కూడిన కథనం, ప్రతి సన్నివేశంలో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ చివరి వరకు ఉత్కంఠగా నడిపిస్తుంది.

ఐఎండీబీ రేటింగ్ 7

దర్శకుడు కరణ్ తేజ్‌పాల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రేక్షకులు ఇందులోని పాత్రల శ్వాసను కూడా వినగలిగేలా సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను ఉద్దేశపూర్వకంగా తగ్గించినట్లు తెలిపారు. కరణ్ పాటించిన ఈ టెక్నిక్ విజయవంతమైందని స్పష్టమవుతోంది. అందుకే ఈ చిత్రానికి ఐఎండీబీలో 7 రేటింగ్ లభించింది.

నిజానికి ఈ సినిమా 2023లోనే పూర్తయింది. ఆ తర్వాత వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో దీని వరల్డ్ ప్రీమియర్ జరిగింది. 2024లో లండన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రత్యేక ప్రదర్శన జరిగింది. ఇప్పుడు 2025లో ఇది ఓటీటీలో విడుదలైంది.

మూవీ టీమ్ కృషి

ఈ సినిమా కోసం అభిషేక్ బెనర్జీ ఛత్తీస్‌గఢ్‌లోని గిరిజన సమాజంలో 4 నెలల పాటు ఉండి అక్కడి యాసను, బాడీ లాంగ్వేజ్‌ను నేర్చుకున్నారు. అదేవిధంగా, శుభమ్ వర్ధన్ తన పాత్ర కోసం 12 కిలోల బరువు తగ్గారు. ఈ స్టోలెన్ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో హిందీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో చూడొచ్చు.

ఇప్పటికే పలు ఓటీటీల్లోని వెబ్ సిరీస్‌ల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన అభిషేక్ బెనర్జీ.. ఈ స్టోలెన్ సినిమా ద్వారా మరింత పేరు దక్కించుకున్నాడు. విలక్షణ నటుడిగా పేరుగాంచిన అభిషేక్ నటించిన ఈ స్టోలెన్ మూవీని మిస్ కాకుండా చూడండి.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024