





Best Web Hosting Provider In India 2024

పల్లెటూరి అమ్మాయి ఎలా ఎదిగిందనే కథతో ఓటీటీ వెబ్ సిరీస్.. దేవిక అండ్ డానీ నిర్మాత సుధాకర్ చాగంటి కామెంట్స్
ఓటీటీలోకి డిజిటల్ స్ట్రీమింగ్‌కు రానున్న తెలుగు రొమాంటిక్ హారర్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ దేవిక అండ్ డానీ. జూన్ 6న దేవిక అండ్ డానీ ఓటీటీ రిలీజ్ కానున్న నేపథ్యంలో రెండు ఎపిసోడ్స్‌ను మీడియాకు ప్రదర్శించారు. ఈ ప్రెస్ మీట్‌లో దేవిక అండ్ డానీ నిర్మాత సుధాకర్ చాగంటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఓటీటీ స్ట్రీమింగ్‌కు రానున్న సరికొత్త తెలుగు సూపర్ నాచురల్ హారర్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ దేవిక అండ్ డానీ. హీరోయిన్ రీతు వర్మ ఈ సిరీస్‌తో ఓటీటీ ఎంట్రీ ఇవ్వగా.. సూర్య వశిష్ట, శివ కందుకూరి హీరోలుగా చేశారు. సుబ్బరాజు కీలక పాత్ర పోషించాడు.
జియో హాట్‌స్టార్ ఓటీటీలో
బి కిశోర్ దర్శకత్వం వహించిన ఈ ఓటీటీ వెబ్ సిరీస్‌ను సుధాకర్ చాగంటి నిర్మించారు. జూన్ 6 నుంచి జియో హాట్‌స్టార్‌లో దేవిక అండ్ డానీ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో జూన్ 3న మీడియాకు రెండు ఎపిసోడ్స్‌ను ప్రదర్శించారు. దేవిక అండ్ డానీ ఓటీటీ రిలీజ్ నేపథ్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవిక అండ్ డానీ నిర్మాత సుధాకర్ చాగంటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఏడు ఎపిసోడ్స్ ఉన్న ఓటీటీ సిరీస్
నిర్మాత సుధాకర్ చాగంటి మాట్లాడుతూ.. “దేవిక అండ్ డానీ వంటి సిరీస్‌తో మీ ముందుకు రానుండటం ఎంతో ఆనందంగా ఉంది. ఇది ఏడు ఎపిసోడ్స్ ఉన్న సిరీస్. జియో హాట్‌స్టార్ వారు ఎంతగానో సపోర్ట్ చేశారు. జూన్ 6న స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్‌ను ఎంతగానో ఎంజాయ్ చేస్తారు” అని అన్నారు.
ఎంటర్‌టైన్‌మెంట్ ఎమోషన్స్ అన్నీ
“ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్స్ సహా అన్నీ ఎలిమెంట్స్ ఉండే సిరీస్ ఇది. నందినిగారికి థాంక్స్. ఆమె ఎంతో సపోర్ట్ చేశారు. దర్శకుడు కిశోర్ గారు సిరీస్‌ను చక్కగా తెరకెక్కించారు. వెంకట్ గారు ఫెంటాస్టిక్ విజువల్స్ అందించారు. దీపక్ రాజ్ గారు కథ, డైలాగ్స్ ఇచ్చినందుకు ఆయనకు స్పెషల్ థాంక్స్” అని ప్రొడ్యూసర్ సుధాకర్ చాగంటి తెలిపారు.
దేవిక పాత్రలో రీతు వర్మ
“దేవిక పాత్రలో రీతు వర్మ అద్భుతంగా నటించారు. ఓ పల్లెటూరులో ఉండే ఓ అమ్మాయి ఎలా ఎదిగిందనే కథతో ఇది రూపొందింది. డానీ పాత్రలో సూర్య, సుబ్బు పాత్రలో శివ కందుకూరి చక్కగా నటించారు. అందరికీ థాంక్స్. ప్రతి ఒక్కరూ జియో హాట్‌స్టార్‌లో దేవిక అండ్ డానీని చూడాలని కోరుకుంటున్నాను” అని నిర్మాత సుధాకర్ చాగంటి పేర్కొన్నారు.
దేవిక అండ్ డానీ నటీనటులు
ఇదిలా ఉంటే, ఈ ప్రెస్ మీట్‌లో మౌనిక, నందిని, సినిమాటోగ్రాఫర్ వెంకట్ సి. దిలీప్, మ్యూజిక్ డైరెక్టర్ జై క్రిష్, ఎడిటర్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. ఇక జూన్ 6 నుంచి డిజిటల్ ప్రీమియర్ కానున్న దేవిక అండ్ డానీ ఓటీటీ సిరీస్‌లో హీరో హీరోయిన్స్‌తోపాటు కోవై సరళ, సోనియా సింగ్, గోకరాజు రమణ, శివన్నారాయణ, వివా హర్ష, షణ్ముఖ్, అభినయ శ్రీ, మౌనికా రెడ్డి, ఈశ్వర్య వుల్లింగల ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
సంబంధిత కథనం