కార్తీక దీపం 2 సీరియ‌ల్ టుడే ఎపిసోడ్‌: దీప ట్విస్ట్‌కు జ్యోత్స్న మైండ్‌బ్లాక్- మ‌ర‌ద‌లి పెళ్లికి పెద్ద‌గా మారిన కార్తీక్

Best Web Hosting Provider In India 2024

కార్తీక దీపం 2 సీరియ‌ల్ టుడే ఎపిసోడ్‌: దీప ట్విస్ట్‌కు జ్యోత్స్న మైండ్‌బ్లాక్- మ‌ర‌ద‌లి పెళ్లికి పెద్ద‌గా మారిన కార్తీక్

 

కార్తీక దీపం 2 సీరియ‌ల్ జూన్ 5 ఎపిసోడ్‌లో దీప‌ను రెచ్చ‌గొట్టి గౌత‌మ్‌ను ఇంట్లో నుంచి వెళ్ల‌గొట్టించాల‌ని జ్యోత్స్న ప్లాన్ చేస్తుంది. కానీ ఆమెకు ఊహించిన షాకిస్తుంది దీప‌. గౌత‌మ్‌కు సారీ చెబుతుంది. కార్తీక్‌, దీప క‌లిసి గౌత‌మ్‌తో జ్యోత్స్న పెళ్లిని ఖాయ‌మ‌య్యేలా చేస్తారు.

 
కార్తీక దీపం 2 సీరియ‌ల్ జూన్ 5 ఎపిసోడ్‌
 

జ్యోత్స్న రూట్‌లోనే వెళ్లి ఆమెను దెబ్బ కొట్టాల‌ని ప్లాన్ చేస్తాడు కార్తీక్‌. గౌత‌మ్‌తో చేతులు క‌లిపి జ్యోత్స్న‌తో అత‌డి పెళ్లి నిశ్చయ‌మ‌య్యేలా ప్లాన్ చేస్తాడు. జ్యోత్స్న‌తో పెళ్లి గురించి మాట్లాడ‌టానికి గౌత‌మ్‌ను శివ‌న్నారాయ‌ణ ఇంటికి ర‌ప్పిస్తాడు.దీప‌ను అడ్డుపెట్టుకొని మ‌రోసారి గౌత‌మ్‌ను ఇంట్లో నుంచి వెళ్ల‌గొట్టాల‌ని జ్యోత్స్న, పారిజాతం అనుకుంటారు. దీప‌ను కాఫీ తెమ్మ‌ని చెబుతారు. కాఫీ క‌ప్‌తో వ‌స్తోన్న దీప‌ను చూసి గౌత‌మ్ షాక‌వుతాడు. దీప ఈ ఇంట్లో ఉండ‌ట‌మేంటి అని భ‌య‌ప‌డ‌తాడు. న‌న్ను మ‌ళ్లీ ఈ ఇంటికి రాకుండా దీప చేస్తుంద‌ని అనుకుంటాడు. కాఫీ క‌ప్ మొహాన కొడుతుంది కావ‌చ్చున‌ని వ‌ణికిపోతాడు.

 

ఊహించ‌ని షాక్‌…

గౌత‌మ్ మొహంపై దీప కాఫీ కొట్టే సీన్ కోసం ఆశ‌గా ఎదురుచూస్తారు. వారికి ఊహించ‌ని షాకిస్తుంది దీప‌. గౌత‌మ్‌కు సారీ చెబుతుంది. ఆ మాట‌ల‌తో గౌత‌మ్‌తో పాటు జ్యోత్స్న కూడా ఉలిక్కిప‌డుతారు. ఎవ‌రో చెప్పిన మాట‌లు న‌మ్మి నీపై నింద‌లు వేశాన‌ని, నీ విష‌యంలో త‌ప్పు చేశాన‌ని గౌత‌మ్‌తో అంటుంది దీప‌.

అంద‌రి ముందు కొట్టాను కాబ‌ట్టి అంద‌రి ముందే క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నాన‌ని అంటుంది. ఇదేం ట్విస్ట్ అని జ్యోత్స్న అనుకుంటుంది.

కార్తీక్ హంగామా…

నువ్వు స‌డెన్‌గా మ‌న‌సు మార్చుకొని గౌత‌మ్ మంచివాడు అంటే ఎలా…నిశ్చితార్థం ఆగిపోయింది…అంద‌రిలో ప‌రుపుపోయింది…వీళ్లు ఎలాగు పెళ్లికి ఓకే అంటారు…జ్యోత్స్న‌కు ముందు నుంచే ఇష్టం కాబ‌ట్టి ఎలాగు పెళ్లికి అడ్డు చెప్ప‌దు…మ‌రి పోయిన ప‌రువు మాటేంటి అని కావాల‌నే హంగామా చేసి జ్యోత్స్న పెళ్లికి అంద‌రూ ఓకే అనేలా చేస్తాడు కార్తీక్‌.

నిశ్చితార్థం జ‌రిపించండి…

నిశ్చితార్థంలోనే అవ‌మానం జ‌రిగింది కాబ‌ట్టి…మ‌ళ్లీ నిశ్చితార్థం పెట్టండి. అంద‌రి ముందు సారీ చెబుతాన‌ని దీప అంటుంది. నీ భార్య త‌ప్పు చేసింది…అంద‌రిలో ఒప్పుకుంది. గౌత‌మ్‌పై మా మ‌న‌సులో ఉన్న అనుమానాలు పోయాయి. వీలైనంత తొంద‌ర‌లో మంచి ముహూర్తం పెట్టించి గౌత‌మ్‌, జ్యోత్స్న‌కు నిశ్చితార్థం జ‌రిపిస్తాన‌ని…అవ‌స‌రం అయితే అదే రోజు పెళ్లి కూడా జ‌రిపిస్తాన‌ని శివ‌న్నారాయ‌ణ అంటాడు. అత‌డి మాట‌ల‌తో జ్యోత్స్న మైండ్‌బ్లాక్ అవుతుంది. దెబ్బ అదుర్స్ క‌దూ అని పారిజాతం అంటుంది. చిన్న మ‌ర‌ద‌లికి తిక్క కుదిరింద‌ని కార్తీక్ మ‌న‌సులో అనుకుంటాడు.

 

పెళ్లి చేసుకోను…

నేను ఈ పెళ్లి చేసుకోను అని జ్యోత్స్న అంటుంది. కొద్ది రోజులు బిజినెస్ చూసుకుంటాన‌ని త‌ప్పించుకోవాల‌ని చూస్తుంది. పెళ్లి త‌ర్వాతే ఏదైనా అని శివ‌న్నారాయ‌ణ అంటాడు. జ్యోత్స్న చెప్పింది బాగానే ఉంద‌ని కార్తీక్ కావాల‌నే శివ‌న్నారాయ‌ణను రెచ్చ‌గొడ‌తాడు. నువ్వెవ‌డు చెప్ప‌డానికి జ్యోత్స్న పెళ్లి జ‌ర‌గాల్సిందేన‌ని శివ‌న్నారాయ‌ణ తీర్పు ఇస్తాడు. పంతులును పిలిచించి మంచి ముహూర్తం చూడ‌మ‌ని ద‌శ‌ర‌థ్‌కు చెబుతాడు.

మీరే మా పెళ్లి జ‌రిపించాలి…

నిజం చెప్పినందుకు థాంక్స్ అని దీప‌తో అంటాడు గౌత‌మ్‌. మా పెళ్లి మీరే ద‌గ్గ‌రుండి జ‌రిపించాల‌ని కార్తీక్‌తో అంటాడు గౌత‌మ్‌. త‌ప్ప‌కుండా బ్రో అని కార్తీక్ బ‌దులిస్తాడు. ఏం జ్యోత్స్న అంతే క‌దా అని సెటైర్ వేస్తాడు. కార్తీక్‌, దీప కొట్టిన దెబ్బ‌ను త‌ట్టుకోలేక అక్క‌డి నుంచి కోపంగా వెళ్లిపోతుంది జ్యోత్స్న‌.

నువ్వు ఎందుకు వెళ్లిపోతున్నావో నాకు తెలుసు…కాబోయే పెళ్లి కూతురు క‌దా అంద‌రిలో ఉండ‌టానికి సిగ్గుప‌డుతుంద‌ని కార్తీక్ అంటాడు. గౌత‌మ్‌తో మాట్లాడ‌టానికే వెళుతున్నావ్ క‌దా అని ఆమెను మ‌రింత ఇరికిస్తాడు. త‌న ప్లాన్ అంతా కార్తీక్, దీప నాశ‌నం చేశార‌ని జ్యోత్స్న‌తో లోలోన కోపంతో ర‌గిలిపోతుంది.

సినిమా మొద‌లుపెడితే.

నువ్వు గౌత‌మ్‌ను అడ్డుపెట్టుకొని మొద‌లుపెట్టిన సినిమాకు దీప ప్రీ క్లైమాక్స్ ఫిక్స్ చేసింద‌ని, ఇంకా నువ్వు క్లైమాక్స్‌కు ప్రిపేర్ అవ్వ‌డం త‌ప్ప మ‌రో దారి లేద‌ని, నీ నోటితో నువ్వే నిశ్చితార్థానికి స‌రే అనిపించేలా చేశార‌ని అని జ్యోత్స్న‌తో అంటుంది పారిజాతం. గౌత‌మ్‌తో తాళి క‌ట్టించుకోవ‌డం మిన‌హా నీకు మ‌రో దారి లేద‌ని, పులితో స‌వారి ప్ర‌మాదం అని చెబితే విన‌కుండా మోసం చేయాల‌ని నువ్వే మోస‌పోయావ‌ని జ్యోత్స్న‌ను దెప్పిపొడుస్తుంది పారిజాతం.

 

సీన్ రివ‌ర్స్‌…

దీప ఇలా మారుతుంద‌ని తాను అనుకోలేద‌ని జ్యోత్స్న అంటుంది. కార్తీక్‌, దీప ఇంట్లో ఉంటే ఏడిపించొచ్చు అనుకున్నాన‌ని, కానీ సీన్ రివ‌ర్స్ అవుతుంద‌ని అనుకోలేద‌ని జోత్స్న అంటుంది. గౌత‌మ్‌తో త‌న పెళ్లిని ఎలాగైనా ఆప‌మ‌ని పారిజాతాన్ని బ‌తిమిలాడుతుంది జ్యోత్స్న‌. నువ్వే న‌న్ను గ‌ట్టెక్కించాల‌ని వేడుకుంటుంది. దీప‌ను వ‌దిలిపెట్ట‌కూడ‌ద‌ని, దానికి ఈ జ్యోత్స్న అంటే ఏమిటో తెలియాల‌ని అంటుంది.

న‌న్ను అమ్మ అని పిల‌వొద్దు…

ప‌ని ముగించుకొని ఇంటికి బ‌య‌లుదేరుతారు దీప‌, కార్తీక్‌. అక్క‌డే సుమిత్ర ఉండ‌టంతో వెళ్లొస్తాను అమ్మ అని దీప అంటుంది. త‌న‌ను అమ్మ అని పిల‌వొద్ద‌ని దీపను సుమిత్ర కోప్ప‌డుతుంది. నీ మొహం చూడ‌ట‌మే నాకు ఇష్టం లేద‌ని అవ‌మానిస్తుంది. అక్క‌డితో నేటి కార్తీక దీపం 2 సీరియ‌ల్ ముగిసింది.

 

 
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024