Best Web Hosting Provider In India 2024

గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్: శ్రుతికి రవి సర్ప్రైజ్- కామాక్షికి మళ్లీపెళ్లి- మౌనికతో నిజం తెలిసిపోయిందన్న బాలు
గుండె నిండా గుడి గంటలు జూన్ 5 ఎపిసోడ్లో శ్రుతి డబ్బింగ్ చెప్పే స్టూడియోకు వెళ్లి రవి సర్ప్రైజ్ చేస్తాడు. తనకు నచ్చిన ఫుడ్ వండి తీసుకెళ్తాడు. ప్రభావతి ఇంటికి వచ్చిన కామాక్షి పూలు చూసి తనకు మళ్లీ పెళ్లి చేసుకోవాలని ఉందని చెబుతుంది. మౌనికకు కాల్ చేసిన బాలు తనకు నిజం తెలిసిపోయిందని అంటాడు.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఇంట్లో పూలదండలు అల్లడాన్ని మనోజ్‌తో ఫొటోలు తీయిస్తాడు సత్యం. మనోజ్‌కు సత్యం డైరెక్షన్ చేస్తూ అన్ని కవర్ చేయాలని చెబుతాడు. ఏంటీ ఇప్పుడు గిన్నీస్ బుక్ రికార్డ్‌కు పంపాల అని ప్రభావతి అంటుంది. 500 పూలదండలు కట్టడం రికార్డే అని సత్యం అంటాడు. ఇన్ని పూలు మీనా పెళ్లిలో కూడా కట్టలేదని బస్తీ ఆమె అంటుంది.
సత్యంతో సరదాగా
సుమతి నీ పెళ్లిలో కడదాం. చదువు తర్వాత పెళ్లేగా అని బస్తీ ఆమె అంటే.. లేదు. జాబ్ చేస్తానని సుమతి అంటుంది. జాబ్ చేయకపోతే అత్తారింట్లో పని మనిషిలా చూస్తారు అని బస్తీ ఆమె అంటుంది. చూశావా అది నన్నే ఇన్‌డైరెక్ట్‌గా ఎలా అంటుందో అని రోహిణితో అంటుంది ప్రభావతి. బస్తీ వాళ్లతో సత్యం సరదాగా మాట్లాడుతాడు. ఒక అమ్మాయి స్పీడ్‌గా పూలు కడితే సత్యం మెచ్చుకుని పెళ్లి అయిందా అని అడుగుతాడు.
లేదని ఆమె చెబితే.. ఇప్పుడు ఈయన్ని పెళ్లి చేసుకుంటావా ఏంటీ. ముగ్గురితో ఆపేశారు లేకపోతే నాలుగో వాడికి నిన్నుచ్చి పెళ్లి చేసి ఇల్లంతా పూలతో నింపేవారు. ఇల్లంతా పూలు కట్టుకునేవాళ్లతో సందడిగా ఉండేది అని వెటకారంగా అంటుంది ప్రభావతి. మౌనిక డబ్బింగ్ చెప్పి ఆకలి వేస్తుందని తన సర్‌తో చెబితే వెళ్లి తిని క్యారేజ్ కూడా వచ్చిందని చెబుతాడు.
శ్రుతికి రవి సర్ప్రైజ్ ఇస్తాడు. శ్రుతికి నచ్చిన ఫుడ్ ఐటమ్స్ వండి తీసుకొస్తాడు రవి. దాంతో శ్రుతి చాలా సంతోషంగా ఫీల్ అయి హగ్ ఇస్తుంది. తర్వాత శ్రుతి తింటుంది. శ్రుతి పెట్టిన కిస్ గురించి మాట్లాడుకుంటారు. ఇకనుంచి గొడవలన్నింటిని కిస్సులతో ఫుల్స్టాప్ పెట్టేయాలా అని శ్రుతి అంటే.. నేను రెడీ అని రవి అంటాడు. మరోవైపు సత్యం 500 కరెక్ట్‌గా ఉండాలని లెక్క రాస్తాడు.
ఇల్లు అమ్మేసిందా
ఇంతలో కామాక్షి వస్తుంది. ఇల్లుకానీ అమ్మేసిందా అని కంగారుపడుతుంది కామాక్షి. ప్రభావతి కౌంటర్స్ వేస్తే అందరిముందు కొడుకు కోడలిని తక్కువ చేసి మాట్లాడకు అని కామాక్షి అంటుంది. ఆర్డర్ గురించి కామాక్షి మాట్లాడటం, ప్రభావతి కౌంటర్స్ వేస్తే బాలు మనోజ్‌పై పంచులు వేయడం జరుగుతుంది. అత్త నువ్వు కూడా ఓ చేయి వేయి అని బాలు అంటాడు.
కామాక్షి పూలు కట్టడానికి కూర్చుంటుంది. ఇన్ని పూలు చూస్తుంటే నాకు మళ్లీ పెళ్లి చేసుకోవాలని ఉందిరా అని కామాక్షి అంటుంది. అంతా షాక్ అవుతారు. మా మావయ్యకు అన్యాయం చేస్తావా అని బాలు అంటే.. మీ మావయ్యనే మళ్లీ చేసుకుంటానురా. దుర్మార్గుడా అని కామాక్షి అంటుంది. ఇంతలో శ్రుతి, రవి వస్తారు. సుమతిని పలకిరిస్తారు. గదిలోకి వెళ్లి రెస్ట్ తీసుకోండి అని ప్రభావతి అంటుంది.
గదిలో ఏముంది ఇక్కడ పూలతో బాగుంది. రోజు ఇలాగే ఉంటే బాగుంటుంది అని శ్రుతి అంటే.. ఇలాగే రోజు ఉంటే నా ఇల్లు సత్రం అవుతుంది అని ప్రభావతి అంటుంది. సత్యం వారిస్తాడు. రవి, శ్రుతి ఫ్రెష్ అయి వస్తారు. కామాక్షి దగ్గర కూర్చుని శ్రుతి పూలు కడుతుంది. పూలు కట్టడం మీనా నేర్పిస్తుంటే.. కామాక్షికి శ్రుతి చేయి తగులుతుంది. మూతి పగిలిపోయింది. ఏంటమ్మా నా మూతి చపాతీ చేశావ్ అని కామాక్షి నొప్పితో అంటుంది.
నేను వండుతాలే
సారీ అని శ్రుతి అంటుంది. కామాక్షి మళ్లీ పెళ్లి చేసుకోవడంపై బాలు కౌంటర్స్ వేస్తాడు. అందరికి భోజనం కావాలని బాలు అంటే.. బయటి నుంచి తెప్పించమని మీనా అంటుంది. చాలా ఖర్చు అవుతుంది మీనా అని బస్తీ ఆమె అంటుంది. నేనున్నాగా నలభీమున్ని. అందరికి నేను వండుతానులే అని రవి అంటాడు. సరుకులు ఎలా అని ప్రభావతి అంటుంది.
అవి నేను చూసుకుంటా. రవి లిస్ట్ చెప్పు అరేయ్ మనోజ్ కిరాణా కొట్టుకు వెళ్లి తీసుకురా అని బాలు అంటాడు. మనోజ్ ఏమైనా చిన్నపిల్లోడా అని రోహిణి అంటే.. పనిపాట లేని పిల్లోడు. ఎలాగు పార్క్‌లో పల్లీలు తినేవాడుగా. ఆ పల్లీలకు డబ్బులిస్తాలే అని బాలు అంటాడు. సత్యం వెళ్లమంటాడు. నేను టీ పెట్టాను. వాడు సరుకులు తేవాలా. వీడు వండాలా అని ప్రభావతి అంటుంది.
ఈసారికి ఇలా కానివ్వు అని కామాక్షి అంటుంది. కిచెన్‌లో మనోజ్‌ను పల్లీలు తీయమని బాలు అంటాడు. సెటైర్లు వేస్తాడు. సత్యం వచ్చి తలా ఒక పని చేస్తా బాగుటుందని నచ్చజెబుతాడు. మనోజ్ కోప్పడితే పోరా పల్లీ పొట్టు తీయలేనోడా అని బాలు అంటాడు. దాంతో రవి నవ్వుతాడు. ఇంతలో రోహిణి వచ్చి పల్లీల పొట్టు తీస్తుంది. తమకు కిచిడీ నచ్చదని బయటి నుంచి ఆర్డర్ పెట్టుకుంటామని రోహిణి, మనోజ్ అంటారు.
పూలదండలు కొట్టేయాలని
మరోవైపు మీనా అన్న మాటలు తలుచుకుంటూ రగిలిపోతాడు గుణ. మీనా చేసే ఐదు వందల పూల దండలు ఎలాగైనా కొట్టేయాలని ప్లాన్ చేస్తాడు. దాంతో తన పరువు పోతుందని స్కెచ్ వేస్తాడు గుణ. అందరికి వండిన ఫుడ్ తీసుకొస్తాడు రవి. అంతా బాగుంది కానీ మౌనిక కూడా ఉంటే బాగుండు అని సత్యం అంటాడు. దాంతో బాల్ కాల్ చేస్తే సత్యం మాట్లాడుతాడు.
మౌనిక మేము నీకు పరాయి వాళ్లం అయిపోయామా. నాకు అంతా తెలిసింది. మీ ఆయన ఉన్నాడా. మేమంతా మీ ఇంటికి వద్దామనుకున్నాం అని బాలు అంటాడు. అంతా తెలిసిపోయిందని బాలు అనేసరికి నిజం తెలిసిపోయిందా అని మౌనిక కంగారుపడుతుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.