ఒక రోజు ముందే ఓటీటీలోకి 120 కోట్ల యాక్షన్ థ్రిల్లర్.. ఓ రేంజ్ లో ఎలివేషన్లు.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. మనోడే డైరెక్టర్

Best Web Hosting Provider In India 2024

ఒక రోజు ముందే ఓటీటీలోకి 120 కోట్ల యాక్షన్ థ్రిల్లర్.. ఓ రేంజ్ లో ఎలివేషన్లు.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. మనోడే డైరెక్టర్

120 కోట్ల బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ ఓటీటీలోకి దూసుకొచ్చింది. తెలుగు డైరెక్టర్ తీసిన ఈ మూవీ ఈ రోజు (జూన్ 5) డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఆ మూవీ ఏదో చూసేయండి.

ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ (x/NetflixIndia)

బాలీవుడ్ లో తెలుగు కథలు, తెలుగు టెక్నీషియన్లు, డైరెక్టర్లు, హీరోల ఆధిపత్యం కొనసాగుతోంది. మన కథలు బాలీవుడ్ ను ఏలుతున్నాయి. సందీప్ రెడ్డి వంగా లాంటి మన డైరెక్టర్లు హిందీ సినిమాను షేక్ చేస్తున్నారు. ఇప్పుడు మరో తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని బాలీవుడ్ లో తీసిన ఫస్ట్ మూవీ ‘జాట్’ ఓటీటీలోకి వచ్చేసింది.

ఒక రోజు ముందే

నిజానికి బాలీవుడ్ లేటెస్ట్ ఫిల్మ్ జాట్ జూన్ 6న ఓటీటీలోకి వస్తుందన్నారు. కానీ ఒక రోజు ముందుగానే నేడు (జూన్ 5) డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది ఈ సినిమా. గురువారం ఓటీటీలో అడుగుపెట్టింది జాట్. తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని బాలీవుడ్ డెబ్యూ మూవీ జాట్ ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజైంది. ఈ ఫిల్మ్ లో సన్నీ డియోల్ హీరో.

యాక్షన్ థ్రిల్లర్ గా రిలీజైన ఈ మూవీ మాస్ ఆడియన్స్ తో విజిల్స్ కొట్టించింది. కలెక్షన్ల మోత మోగించింది. సుమారు రూ.100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన జాట్ మూవీ థియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా రూ.120 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది.

ఆ ఓటీటీలోనే

జాట్ సినిమా ఓటీటీ బాట పట్టింది. ఈ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే నెట్‌ఫ్లిక్స్‌లో జాట్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతో పాటు తెలుగులోనూ ఈ మూవీ వచ్చేసింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ ఓటీటీలో కచ్చితంగా ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేసే అవకాశముంది.

కథ ఏమిటంటే?

రణతుంగ, అతని బ్రదర్ శ్రీలంక నుంచి భారీ నిధి దోచుకుని పారిపోయి భారత్ కు వస్తారు. ఏపీలోని మోటుపల్లిని స్థావరంగా చేసుకుని అక్రమాలకు తెరతీస్తారు. చుట్టుపక్కల గ్రామాలనూ గుప్పిట్లో ఉంచుకుని నియంతలా వ్యవహరిస్తారు. మరోవైపు హీరో బ్రిగేడియర్ బల్బీర్ ప్రతాప్ వెళ్లున్న రైలు మోటుపల్లి సమీపంలో ఆగిపోతుంది. దగ్గర్లో ఉన్న ఓ హోటల్లో హీరో టిఫిన్ చేస్తుండగా.. రౌడీలు గొడవ చేస్తారు.

హీరో టిఫిన్ కింద పడిపోతుంది. దీంతో రౌడీలను హీరో చితక్కొడతాడు. అందరినీ కొట్టుకుంటూ లాస్ట్ కు మెయిన్ విలన్ దగ్గరకు వెళ్తాడు. అప్పుడే ఆ ఊర్లో విలన్ అరాచకాల గురించి హీరోకు తెలుస్తుంది. అప్పుడు హీరో ఏం చేశాడు? విలన్లను ఎలా ఎదురించాడన్నదే కథ. ఈ ఏడాది ఇప్పటివరకూ అత్యధిక గ్రాస్ కలెక్షన్లు రాబట్టిన ఆరో బాలీవుడ్ సినిమాగా జాట్ కొనసాగుతోంది.

మనదే హవా

పేరుకే జాట్ బాలీవుడ్ సినిమా.. కానీ దీని కోసం పని చేసిన టెక్నిషియన్స్ లో ఎక్కువ శాతం తెలుగు వాళ్లే. గోపీచంద్ మలినేని ఈ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టగా.. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందించారు. శ్రీవినాస్ గవిరెడ్డి, కుందన్ పాండేతో కలిసి గోపీచంద్ మలినేని స్క్రీన్ ప్లే బాధ్యతలూ చూసుకున్నారు. సౌరభ్ గుప్తాతో కలిసి సాయి మాధవ్ బుర్రా డైైలాగ్స్ రాశారు. మైత్రి మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ కలిసి మూవీ నిర్మించాయి. నవీన్ నూలి ఎడిటర్.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024