





Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి ఆరేళ్ల తర్వాత ఇవాళ తెలుగులో వచ్చిన మలయాళ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్.. ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి తెలుగులో ఇవాళ మలయాళ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ మూవీ ఒక యముడి ప్రేమకథ డిజిటల్ స్ట్రీమింగ్ వచ్చేసింది. 2019లో మలయాళం విడుదలైన ఈ సినిమా ఆరేళ్ల తర్వాత తెలుగు భాషలో ఓటీటీ రిలీజ్ అయింది. దుల్కర్ సల్మాన్, సంయుక్త మీనన్ నటించిన ఒక యముడి ప్రేమకథ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ చూద్దాం.
ఓటీటీ మలయాళ సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో అంతే కొందరు హీరోలకు సైతం మంచి పాపులారిటీ ఉంటుంది. అలా తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న మలయాళ స్టార్ హీరోల్లో దుల్కర్ సల్మాన్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగులో సూపర్ హిట్ కొట్టి అందరి మనసు దోచేశాడు.
బాక్సాఫీస్ విజయాలతో
అలాగే, కల్కి, లక్కీ భాస్కర్ వంటి వరుస హిట్ చిత్రాలతో దుల్కర్ సల్మాన్ ఒక స్ట్రైట్ తెలుగు హీరోగా ఇక్కడ సూపర్ ఫ్యాన్స్ బేస్ నెలకొల్పుకున్నాడు. రోజురోజుకు పెరుగుతున్న అభిమానంతో పాటు బాక్సాఫీస్ విజయాలతో దుల్కర్ సల్మాన్ సత్తా చాటుతున్నాడు. ఇక గతంలో దుల్కర్ సల్మాన్ సూపర్ హిట్ సినిమాలను అందించాడు.
2019లో వచ్చిన
వాటిలో చాలా వరకు మూవీస్ తెలుగులో డబ్ అయి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలా 2019లో దుల్కర్ సల్మాన్ నటించిన రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ మూవీ “ఒరు యమండన్ ప్రేమకథ”. ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేశారు. అది కూడా ఓటీటీ స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చారు.
ఒక యముడి ప్రేమకథ ఓటీటీ రిలీజ్
“ఒరు యమండన్ ప్రేమకథ” సినిమాను తెలుగులో “ఒక యముడి ప్రేమకథ” టైటిల్‌తో విడుదల చేశారు. ఆహాలో ఒక యముడి ప్రేమకథ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇవాళ (జూన్ 5) ఒక యముడి ప్రేమకథ ఓటీటీ రిలీజ్ అయింది. అంటే, 2019లో విడుదలైన ఈ సినిమా ఆరేళ్లకు తెలుగులో ఓటీటీ రిలీజ్ అయింది. ఈ సినిమాను తెలుగులో భవానీ మీడియా విడుదల చేసింది.
హీరోయిన్‌గా సంయుక్త మీనన్
ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్‌కు జోడీగా విరూపాక్ష, సార్ సినిమాల హీరోయిన్ సంయుక్త మీనన్ నటించింది. వీరిద్దరితోపాటు ఒక యముడి ప్రేమకథ సినిమాలో నిఖిల విమల్, బిబిన్ జార్జ్, శివకామి అనంత నారాయణ్, సౌబిన్ షాహిర్, సూరజ్ వెంజరమూడ్, రాజేంద్రన్ ఇతర కీలక పాత్రలు పోషించారు.
వంద కోట్లకు పైగా
ఇదిలా ఉంటే, ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ నటిస్తున్న తెలుగు చిత్రాలు ఒక్కొక్కటీ రూ.100 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మించబడుతున్నాయి. ఈ విధంగా టాలీవుడ్ టాప్ హీరోల సరసన దుల్కర్ సల్మాన్ నిలిచే స్థాయికి ఎదుగుతున్నాడు.
రెండు తెలుగు ప్రాజెక్ట్స్
ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ హల్క్ దగ్గుబాటి రానా స్పిరిట్ మీడియా నిర్మిస్తున్న “కాంతా”, స్వప్న సినిమాస్ నిర్మాణంలో రూపొందుతున్న “ఆకాశంలో ఒక తారా” అనే రెండు తెలుగు ప్రాజెక్టుల్లో నటిస్తున్నాడు. దుల్కర్ సల్మాన్‌కు ఉన్న పాన్ ఇండియా క్రేజ్, నటనలోని నైపుణ్యం భారతదేశంలోని అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ భావిస్తున్నారు.
సంబంధిత కథనం