అడ్వాన్స్ బుకింగ్ లో దుమ్మురేపిన కమల్ హాసన్ థగ్ లైఫ్ మూవీ.. ఆ సినిమా రికార్డు బ్రేక్

Best Web Hosting Provider In India 2024

అడ్వాన్స్ బుకింగ్ లో దుమ్మురేపిన కమల్ హాసన్ థగ్ లైఫ్ మూవీ.. ఆ సినిమా రికార్డు బ్రేక్

కమల్ హాసన్ లేటెస్ట్ ఫిల్మ్ థగ్ లైఫ్ ఈ రోజు (జూన్ 5) థియేటర్లకు దూసుకొచ్చింది. మణిరత్నం, కమల్ హాసన్ చాలా కాలం తర్వాత కలిసి పని చేయడంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లే ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి.

థియేటర్లకు రిలీజైన థగ్ లైఫ్ (x)

ఓ వైపు వివాదం.. మరోవైపు సుదీర్ఘ కాలం తర్వాత మణిరత్నం, కమల్ హాసన్ కాంబో.. ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్లకు వచ్చిన ‘థగ్ లైఫ్’ మూవీ అదరగొడుతోంది. పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. మణిరత్నం మ్యాజిక్, కమల్ హాసన్ స్వాగ్ తో ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆడియన్స్ ను అలరిస్తోంది. జనాలతో విజిల్స్ కొట్టిస్తోంది. గురువారం (జూన్ 5) రిలీజైన ఈ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ వినిపిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ మూవీ సత్తాచాటింది.

అక్కడే రూ.5.3 కోట్లు

38 ఏళ్ల తర్వాత మణిరత్నం, కమల్ హాసన్ కాంబోలో తెరకెక్కిన థగ్ లైఫ్ థియేటర్లలో అదరగొడుతోంది. ఈ తమిళ్ ఒరిజినల్ సినిమా.. తెలుగు, హిందీ భాషల్లోనూ డబ్ అయింది. ఫస్ట్ రోజు కేవలం తమిళ్ లోనే రూ.5.3 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ అయ్యాయి. ఇందులో 2డీ వర్షన్ రూ.5.25 కోట్లు కాగా.. ఐమాక్స్ 2డీ రూ.11.63 లక్షలు, 4డీఎక్స్ రూ.70.470.

తెలుగులో ఇలా

సక్నిల్క్ వెబ్ సైట్ ప్రకారం థగ్ లైఫ్ మూవీ తెలుగులో అడ్వాన్స్ బుకింగ్స్ తో రూ. 54 లక్షలు వచ్చాయి. హిందీలో అది రూ.26 లక్షలుగా ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే అన్ని భాషల్లో కలిపి ఫస్ట్ రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.6.16 కోట్లు వచ్చాయి. ఇక థగ్ లైఫ్ మూవీకి ఇప్పటివరకూ అయిన మొత్తం అడ్వాన్స్ సేల్స్ రూ.13.89 కోట్లుగా ఉంది.

ఆ సినిమాను దాటి

అడ్వాన్స్ సేల్స్ విషయంలో థగ్ లైఫ్.. గత మణిరత్నం సినిమాను దాటేసింది. మణిరత్నం లాస్ట్ మూవీ పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ తో రూ.11 కోట్లు వచ్చాయి. ఈ సినిమా అడ్వాన్స్ సేల్స్ ను థగ్ లైఫ్ దాటేసింది. అయితే కమల్ హాసన్ లాస్ట్ సినిమా ఇండియన్ 2 అడ్వాన్స్ కలెక్షన్ల మాత్రం థగ్ లైఫ్ అందుకోలేకపోయింది. ఇండియన్ 2 మూవీ రూ.17.9 కోట్ల అడ్వాన్స్ కలెక్షన్లు రాబట్టింది.

యాక్షన్ థ్రిల్లర్

తమిళంలో తెరకెక్కిన మూవీ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా థ్రిల్లర్ గా థియేటర్లలో రిలీజైంది. మణిరత్నం, కమల్ హాసన్ కలిసి 38 ఏళ్ల తర్వాత ఈ సినిమా కోసం పని చేశారు. చివరగా ఈ కాంబోలో1987లో నాయకన్ మూవీ వచ్చింది. కమల్ హాసన్ తో పాటు సిలంబరసన్ (శింబు), త్రిష ఈ మూవీలో కీ రోల్స్ ప్లే చేశారు. ఈ మూవీకి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024