ఓటీటీలో అదరగొడుతున్న 120 కోట్ల యాక్షన్ థ్రిల్లర్- రిలీజైన మరుసటి రోజే టాప్ 1లో ట్రెండింగ్- 2 భాషల్లో స్ట్రీమింగ్!

Best Web Hosting Provider In India 2024

ఓటీటీలో అదరగొడుతున్న 120 కోట్ల యాక్షన్ థ్రిల్లర్- రిలీజైన మరుసటి రోజే టాప్ 1లో ట్రెండింగ్- 2 భాషల్లో స్ట్రీమింగ్!

Sanjiv Kumar HT Telugu

ఓటీటీలో రూ. 120 కోట్ల కలెక్ట్ చేసిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా జాట్ అదరగొడుతోంది. ఓటీటీ రిలీజ్ అయిన మరుసటి రోజే అంటే రెండో రోజు నుంచే టాప్ 1 స్థానంలో ట్రెండింగ్ అవుతోంది. రెండు భాషల్లో జాట్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. మరి జాట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఓటీటీలో అదరగొడుతున్న 120 కోట్ల యాక్షన్ థ్రిల్లర్- రిలీజైన మరుసటి రోజే టాప్ 1లో ట్రెండింగ్- 2 భాషల్లో స్ట్రీమింగ్!

థియేటర్లలో సినిమాల ఫలితాలకు, ఓటీటీలో రెస్పాన్స్‌కు చాలా తేడా ఉంటోంది. థియేటర్లలో సూపర్ హిట్ అయిన సినిమాలకు దాదాపుగా ఓటీటీలో ఆదరణ బాగానే ఉంటోంది. కొన్నిసార్లు మాత్రమే బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్‌గా నిలిచిన మూవీస్ ఓటీటీలో ట్రెండింగ్ అవుతుంటాయి.

టాప్ ప్లేస్‌లో ట్రెండింగ్

అలాగే, బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్‌తో పర్వాలేదనిపించుకున్న సినిమాలు సైతం ఓటీటీలో టాప్ ప్లేసుల్లో ట్రెండ్ అవుతుంటాయి. అలాంటి సినిమా గురించే ఇప్పుడు మనం చెప్పుకునేది. ఆ మూవీనే జాట్. హిందీలో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు.

రవితేజ సినిమాలతో

మాస్ మహారాజా రవితేజతో డాన్ శీను, బలుపు, క్రాక్ వంటి సూపర్ హిట్స్ అందించిన గోపీచంద్ మలినేని చివరిగా తెలుగులో నందమూరి బాలకృష్ణతో వీర సింహా రెడ్డి చిత్రాన్ని తెరకెక్కించారు. గోపీచంద్ మలినేని బాలీవుడ్‌లో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన సినిమానే జాట్. బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ ప్రధాన పాత్ర పోషించారు.

నెగెటివ్ షేడ్స్‌లో రెజీనా

అలాగే, ఈ సినిమాలో రణదీప్ హుడా విలన్‌గా నటించిగా అతనికి భార్యగా నెగెటివ్ షేడ్స్‌లో టాలీవుడ్ హీరోయిన్ రెజీనా కసాండ్రా చేసింది. వీరితోపాటు సయామీ ఖేర్, ఆయేషా ఖాన్ వంటి హీరోయిన్స్‌తోపాటు బిగ్ బాస్ బ్యూటి దివి వాద్యా కూడా కీలక పాత్రలు పోషించింది.

120 కోట్ల జాట్ ఓటీటీ

రూ. 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన జాట్ ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలై సుమారుగా రూ. 120 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. దీంతో 120 కోట్ల యాక్షన్ థ్రిల్లర్‌ మూవీగా నిలిచిన జాట్ ఓటీటీలో అదరగొడుతోంది. జూన్ 5న నెట్‌ఫ్లిక్స్‌లో జాట్ ఓటీటీ రిలీజ్ అయింది. ఓటీటీ రిలీజ్ అయిన మరుసటి రోజు (జూన్ 6) ఉదయం నుంచే అంటే రెండో రోజు నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్ సినిమాల్లో దూసుకుపోతోంది.

నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్‌లో

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్‌లో టాప్ 1 స్థానంలో జాట్ నిలిచి అదరగొడుతోంది. ఐఎమ్‌డీబీ నుంచి 10కి 6.4 రేటింగ్ సాధించుకున్న జాట్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో హిందీ, తెలుగు రెండు భాషల్లో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.

తెలుగు నిర్మాణ సంస్థలు

హిందీలో తెరకెక్కిన ఈ సినిమాను టాలీవుడ్ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఇక జాట్ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందించాడు. థియేటర్లలో మిస్ అయిన జాట్ మూవీని నెట్‌ఫ్లిక్స్‌లో ఎంచక్కా చూసేయండి.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024