





Best Web Hosting Provider In India 2024

బిగ్ బాస్ బ్యూటి శుభశ్రీ రాయగురు నిశ్చితార్థ వేడుక.. నటుడు సాయి కుమార్ రెస్పాన్స్ ఇదే!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కంటెస్టెంట్ శుభశ్రీ రాయగురు త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది. ప్రముఖ నిర్మాత అజయ్ మైసూర్‌తో శుభశ్రీ రాయగురు నిశ్చితార్థం చేసుకుంది. జూన్ 6న శుభశ్రీ రాయగురు-అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నటుడు సాయి కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
బిగ్ బాస్ తెలుగు టీవీ షో ద్వారా క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మల్లో శుభశ్రీ రాయగురు ఒకరు. మోడల్, నటి, లాయర్ అయిన శుభశ్రీ రాయగురు బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ద్వారా తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు సంపాదించుకుంది. పలు సినిమాల్లో నటిగా కూడా అలరించింది. కొంతకాలం లాయర్‌గా ప్రాక్టీస్ చేసిన ఈ బ్యూటి సినిమాలపై ఇంట్రెస్ట్‌తో హైదరాబాద్‌కు షిఫ్ట్ అయింది.
త్వరలో శుభశ్రీ పెళ్లి
అయితే, త్వరలో శుభశ్రీ రాయగురు పెళ్లి పీటలు ఎక్కనుంది. ప్రముఖ నిర్మాత అజయ్ మైసూర్‌తో శుభశ్రీ రాయగురు నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటులు సాయికుమార్, యువ హీరో, బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహైల్, బిగ్ బాస్ షో కంటెస్టెంట్స్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు పాల్గొని ఈ నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు.
మెజెస్టీ ఇన్ లవ్ సాంగ్ లాంఛ్
ఎంగేజ్‌మెంట్, మెహందీ, సంగీత్, రిసెప్షన్ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ఈ నిశ్చితార్థ వేడుకలో అజయ్ మైసూర్, శుభ శ్రీ రాయగురు కలిసి చేసిన ‘మెజెస్టీ ఇన్ లవ్’ అనే కవర్ సాంగ్‌ను లాంఛ్ చేశారు. నటుడు సాయి కుమార్ వాయిస్‌తో ఈ పాట ప్రారంభం కావడం ఆకర్షణగా నిలిచింది.
ఆస్ట్రేలియాలో వివాహం
మెజెస్టీ ఇన్ లవ్ సాంగ్‌ను సిద్ధార్థ్ వాట్కిన్స్ స్వరపర్చి సింగర్ సాహితీ చాగంటితో కలిసి పాడారు. ఈ పాట రూపకల్పన సమయంలోనే శుభశ్రీ, అజయ్ మనసులు కలిసి ప్రేమించుకున్నారు. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాలని నిశ్చయించుకున్నారు. జూలైలో అజయ్ మైసూర్, శుభశ్రీ వివాహం ఆస్ట్రేలియాలో జరగనుంది.
మంచి మిత్రులు
శుభశ్రీ రాయగురు ఎంగేజ్‌మెంట్‌పై నటుడు సాయి కుమార్ మాట్లాడారు. “అజయ్ మైసూర్ నాకు మంచి మిత్రులు. మా ఇంటికి వచ్చి వారి ఎంగేజ్‌మెంట్ కోసం ఆహ్వానించారు. ఈ జంట చిరకాలం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా” అని సాయి కుమార్ శుభాకాంక్షలు అందజేశారు.
బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సందడి
శుభశ్రీ-అజయ్ నిశ్చితార్థ వేడుకలో హీరో సోహైల్, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఫ్రెండ్స్, ఇతర సెలబ్రిటీలు సందడి చేశారు. మెజెస్టీ ఇన్ లవ్ సాంగ్‌కు పనిచేసిన టీమ్ కూడా ఈ వేడుకల్లో పాల్గొని పాట పాడి వీక్షకులను అలరించారు.
అజయ్ మైసూర్ సినిమాలు
ఇదిలా ఉంటే, అజయ్ మైసూర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అమ్మరాజ్యంలో కడప బిడ్డలు, 10th క్లాస్ డైరీస్ వంటి చిత్రాలతో పాటు పలు షార్ట్ ఫిలింస్, 50కి పైగా మ్యూజిక్ అల్బమ్స్‌లో అజయ్ మైసూర్ నటించారు.
సంబంధిత కథనం
టాపిక్