నిన్ను కోరి జూన్ 7 ఎపిసోడ్: శ్రుతి గొంతు పట్టుకున్న శ్యామల- చంద్రకళకు తల్లిగా శ్యామల ఫంక్షన్- విరాట్‌ను తీసుకొచ్చిన అత్త

Best Web Hosting Provider In India 2024

నిన్ను కోరి జూన్ 7 ఎపిసోడ్: శ్రుతి గొంతు పట్టుకున్న శ్యామల- చంద్రకళకు తల్లిగా శ్యామల ఫంక్షన్- విరాట్‌ను తీసుకొచ్చిన అత్త

Sanjiv Kumar HT Telugu

నిన్ను కోరి సీరియల్ జూన్ 7 ఎపిసోడ్‌లో చంద్రకళ ముగ్గు వేస్తుంటే విరాట్ చూస్తుండిపోతాడు. అది చూసి తట్టుకోలేక శ్రుతి వెళ్లిపోతుంది. దాంతో వెనుకనుంచి శ్రుతి గొంతు పట్టుకుంటుంది శ్యామల. నల్ల పూసల ఫంక్షన్‌కు మెట్టింటి, పుట్టింటి వారి నుంచి పుస్తెలు తేవాలని పంతులు చెబితే తల్లిగా శ్యామల తెచ్చానని చెబుతుంది.

నిన్ను కోరి సీరియల్ జూన్ 7 ఎపిసోడ్‌

నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో చంద్రకళ ముగ్గు వేస్తుంటే విరాట్ ప్రేమగా చూస్తుంటాడు. అది చూడలేక శ్రుతి వెళ్లిపోతుంటే.. శ్రుతిని పట్టుకుని ముందుకు అనుకుంటుంది శ్యామల. వెళ్లిపోతావేంటే వెర్రిమొహందానా. ఇలాంటివన్ని నీ వయసులో ఉన్నవే చూడాలి అని శ్యామల అంటుంది.

గొంతు పిసికేసేలా ఉంది

విరాట్ చూడటం చంద్రకళ చూస్తుంది. విరాట్, చంద్రకళ కళ్లు కలిసిపోతాయి. వెనుకునుంచి శ్రుతి గొంతుపట్టుకుంటుంది శ్యామల. నా కూతురు గొంతు పిసికి చంపేసేలా ఉన్నావ్. వదులు అని కామాక్షి విడిపించడానికి ట్రై చేస్తుంది. దాంతో శ్యామల విడిచిపెడుతుంది. వదిన అని శ్యామల పిలిచేసరికి విరాట్, చంద్ర తేరుకుంటారు. చంద్రకళ గురించి జగదీశ్వరికి గొప్పగా చెబుతుంది శ్యామల.

ఇంతలో క్రాంతి వచ్చి అమ్మవారి విగ్రహాలు తీసుకురమ్మన్నావ్‌గా తెచ్చాను అని అంటాడు. దాంతో చంద్రకళ చెప్పింది గుర్తు చేసుకున్న విరాట్ ఓరి దీని నాటకాలు. అత్తయ్య తెప్పిస్తుందని చెప్పి ఇదే తెప్పించిందా అని అనుకుంటాడు. చంద్రకళ ప్లాన్ బయటపడటంతో చాటింపు వేసి చెప్పాల. లోపల పెట్టు అని క్రాంతితో అంటుంది చంద్రకళ. చంద్రకళను కోపంగా చూస్తాడు విరాట్.

ఒక్కొక్కరికి పనులు చెబుతుంది శ్యామల. మీరు రావడం వల్ల నా జీవితంలో అత్యంత ముఖ్యమైన గడియలు వచ్చాయి. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను అని చంద్రకళ అంటుంది. కట్ చేస్తే.. విరాట్ ఆఫీస్‌కు రెడీ అవుతాడు. ఫంక్షన్‌కు ఉండను, ఆఫీస్‌లో అర్జంట్ మీటింగ్ ఉందని విరాట్ అంటాడు. దాంతో చంద్రకళ నవ్వుతుంది. ఏమనవేంటీ అని విరాట్ అంటాడు.

పూజ తప్పించుకునేందుకు

మీటింగ్ చూసుకుని రండి అని చంద్రకళ అంటుంది. పూజ తప్పించుకోడానికే వెళ్తున్నాను అని విరాట్ అంటే.. చాలా పెద్ద ప్లానే వేశారు. సక్సెస్ అవుతారని అనుకుంటున్నారా అని చంద్రకళ అంటుంది. ఇదేంటీ తేడాగా మాట్లాడుతుంది అనుకున్న విరాట్ సాయంత్రం దాకా రాను అని అడుగుతాడు. ఎలా రారో నేను చూస్తాను అని చంద్రకళ అంటుంది.

నేను వెళ్లాక ఇదేం చేస్తుంది. అత్తయ్య అడిగితే లేట్ అయింది మరో ముహుర్తం చూడమంటా. ఆమె ఉన్నన్ని రోజులు ఇలాగే తప్పించుకుందాం అని విరాట్ వెళ్లిపోతాడు. ఆఫీస్‌లో కాకుండా వేరే చోట మీటింగ్ పెడతాడు విరాట్. ఆదికి కూడా చెప్పడు. ఫోన్ ఆఫ్ చేసి పెట్టుకుంటే ఎవరికి దొరకను అని మీటింగ్ స్టార్ట్ చేస్తాడు విరాట్. మరోవైపు ఇంటికి పంతులు వస్తాడు.

చంద్రకళ పచ్చ చీర కట్టుకుని వస్తుంది. అది చూసి శ్యామల పొగుడుతుంది. పంతులు కూడా వచ్చాడు. ఫంక్షన్ ఎలా ఆపుతావ్ అని శాలినిని కామాక్షి, శ్రుతి అడుగుతారు. వెయిట్ అండ్ సీ అంటుంది శాలిని. అమ్మాయి పుట్టింటి వాళ్లు, మెట్టింటి వాళ్లు రమ్మని పంతులు అంటాడు. తన పుట్టింటి వాళ్లు తనకు ఎప్పుడో నువ్వుల నీళ్లు వదిలేశారు అని సంతోషంగా చెబుతుంది కామాక్షి.

శ్రుతి వెటకారం

పుట్టింటి వాళ్లు ఓ పుస్తే, మెట్టింటి వాళ్లు ఓ పుస్తే కడితేనేగా బంధం నిలబడేది అని పంతులు అంటాడు. అంటే ఇప్పుడు బంధం నిలబడదా అని కామాక్షి అంటుంది. దాంతో శ్యామల ఏం వాగుతున్నావ్ అని అంటుంది. పిన్ని చెప్పింది నిజమేగా అని శాలిని, శ్రుతి సపోర్ట్ చేస్తారు. పాపం చంద్ర బాగా ఆశపడినట్లుంది. ఇప్పుడేం చేస్తావ్ అని శ్రుతి అంటుంది.

పిన్ని మీరు అనుభవం ఉన్నవారు. ఇలా తెలియకుండా చేసి చంద్రకు ఆశలు రేపారు. ఇప్పుడు చంద్రకళలోని కలర్ కాస్తా బ్లాక్ అయిందని శ్రుతి అంటుంది. దాంతో చంద్రకళ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అది చూసి జగదీశ్వరి కూడా జాలిగా చూస్తుంది. ఇప్పుడేంటీ పుట్టింటి వాళ్లు పుస్తే తేవాలి అంతేగా. తెస్తారు. పుట్టింటి వాళ్లు కూడా తెలుసు అని శ్యామల అంటుంది.

దాంతో జగదీశ్వరి షాక్ అవుతుంది. కామాక్షి వాళ్లు మాత్రం ఇందుకేనా.. ఫంక్షన్‌కు పిలిచి చంద్రను అవమానించి బయటకు పంపాలనుకుంది అని అంటుంది. ఇంకేందుకు ఆలస్యం పిలిచేయ్ అని కామాక్షి అంటుంది. ఇక్కడ ఉంటే పిలవడం ఏంటీ. మీ ముందు ఉన్న నేనే చంద్ర తల్లిని అని శ్యామల అంటుంది. మెట్టింటి సూత్రంతో పాటు పుట్టింటి తరఫున నేను ఇంకో పుస్తె తెప్పించాను అని శ్యామల అంటుంది.

విరాట్‌ను తీసుకొచ్చిన శ్యామల

ఏదో క్యాజువల్‌గా తెప్పించారనుకున్నా. కానీ, ఇంత ఆలోచించి తెప్పించారనుకోలేదని క్రాంతి అంటాడు. దాంతో చంద్రకళ ఎమోషనల్ అవుతుంది. చంద్రకళకు తల్లిగా శ్యామల పుస్తెల ఫంక్షన్ చేయిస్తుంది. తర్వాత ఆఫీస్‌కు వెళ్లి విరాట్‌ను తీసుకొస్తుంది శ్యామల. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024