రెండో రోజు 70 శాతం పడిపోయిన థగ్ లైఫ్ కలెక్షన్స్- తుడిచిపెట్టుకుపోయిన ఆ వెర్షన్- ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Best Web Hosting Provider In India 2024

రెండో రోజు 70 శాతం పడిపోయిన థగ్ లైఫ్ కలెక్షన్స్- తుడిచిపెట్టుకుపోయిన ఆ వెర్షన్- ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Sanjiv Kumar HT Telugu

కమల్ హాసన్, త్రిష, శింబు, అభిరామి నటించిన థగ్ లైఫ్ మూవీకి రెండో రోజు కలెక్షన్స్ భారీగా పతనమయ్యాయి. సుమారుగా 70 శాతం మేర కలెక్షన్స్ పడిపోయాయి. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన థగ్ లైఫ్ మూవీ రెండు రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

రెండో రోజు 70 శాతం పడిపోయిన థగ్ లైఫ్ కలెక్షన్స్- తుడిచిపెట్టుకుపోయిన ఆ వెర్షన్- ఎన్ని కోట్లు వచ్చాయంటే?

సుమారు 38 ఏళ్ల తర్వాత మణిరత్నం, కమల్ హాసన్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా థగ్ లైఫ్. అయితే, జూన్ 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో అంచనాలు అందుకోలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద అంతగా కలెక్షన్స్ రాబట్టలేకపోతుంది థగ్ లైఫ్ మూవీ.

భారీ పతనం

విడుదలైన రెండో రోజైన శుక్రవారం థగ్ లైఫ్ సినిమా భారీ పతనాన్ని చవిచూసింది. ట్రేడ్ సంస్థ సక్నిల్క్ ప్రకారం థగ్ లైఫ్ సినిమాకు రెండో రోజు అయిన శుక్రవారం (జూన్ 6) నాడు ఇండియాలో అన్ని భాషల్లో కలిపి రూ .7.50 కోట్లు నెట్ కలెక్షన్స్ మాత్రమే వసూలు చేసింది.

ఇది ఓపెనింగ్ డేతో పోలిస్తే 55% తగ్గింది. అంటే, రిలీజ్ రోజున థగ్ లైఫ్ మూవీకి ఇండియాలో రూ. 15.5 కోట్ల (తెలుగులో 1.5 కోట్లు, తమిళం 13.35 కోట్లు, హిందీలో 65 లక్షలు) నెట్ కలెక్షన్స్ వచ్చాయి. కానీ, రెండో రోజు మాత్రం దారుణంగా పడిపోయాయి థగ్ లైఫ్ కలెక్షన్స్.

రెండు రోజులకు మించి

ఇక రెండు రోజుల్లో కలిపి థగ్ లైఫ్ మూవీకి భారతదేశంలో రూ. 23 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. అయితే, శుక్రవారం (జూన్ 6) థగ్ లైఫ్ మూవీకి ఒక రోజు తర్వాత అక్షయ్ కుమార్ కామెడీ ఫిల్మ్ హౌస్‌ఫుల్ 5 చిత్రం విడుదలైంది. ఈ సినిమా తొలిరోజే థగ్ లైఫ్ రెండు రోజుల కలెక్షన్స్‌కు మించి అంత రాబట్టింది.

హౌస్‌పుల్ 5 మూవీతో కలెక్షన్స్‌లో థగ్ లైఫ్ భారీ కోతకు గురైంది. దీంతో థగ్ లైఫ్ హిందీ వెర్షన్ తుడిచిపెట్టుకుపోయినట్లు అయింది. హిందీలో తొలి రోజున థగ్ లైఫ్ కేవలం రూ. 65 లక్షల నెట్ కలెక్షన్స్ రాబడితే.. రెండో రోజు 25 నుంచి 30 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

70 శాతం కలెక్షన్స్

ఇక తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజున థగ్ లైఫ్ మూవీకి దాదాపుగా 60 నుంచి 70 శాతం కలెక్షన్స్ పతనమయ్యాయి. ఆఫ్ లైన్ టికెట్స్ కూడా తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో ఓవరాల్‌గా తెలుగు స్టేట్స్‌లో థగ్ లైఫ్ మూవీకి 30-35 లక్షల రేంజ్‌లో షేర్ కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

తమిళంలో కూడా థగ్ లైఫ్ కలెక్షన్స్ 65 నుంచి 70 శాతం మేర తగ్గిపోయినట్లు, రూ. 4.2 నుంచి 4.5 కోట్ల గ్రాస్ అందుకోనున్నట్లు విశ్లేషకులు అంచనా వేశారు. ఓవర్సీస్‌లో కూడా థగ్ లైఫ్ వసూళ్లు పడిపోగా 10, 11 కోట్ల గ్రాస్ దక్కించుకునే ఛాన్స్ ఉందని సమాచారం. ఇలా మిక్స్‌డ్ టాక్‌తో థగ్ లైఫ్ మూవీకి సాలిడ్ దెబ్బ పడిందని తెలుస్తోంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024